కరోనాకి చెక్ పెడుతున్న కఫసుర... ఐదు రోజుల్లోనే వైరస్ ఖతం...

Corona Lockdown | Corona Update : కఫసుర అంత బాగా పనిచేస్తుందని వారు కూడా ఊహించలేదు. తీరా ట్రయల్‌లో ఫలితాలు చూశాక... కాన్ఫిడెన్స్ కలిగింది.

news18-telugu
Updated: June 20, 2020, 8:09 AM IST
కరోనాకి చెక్ పెడుతున్న కఫసుర... ఐదు రోజుల్లోనే వైరస్ ఖతం...
కరోనాకి చెక్ పెడుతున్న కఫసుర... ఐదు రోజుల్లోనే వైరస్ ఖతం... (credit - NIAID)
  • Share this:
Corona Lockdown | Corona Update : కరోనాకి ప్రపంచవ్యాప్తంగా 120 రకాల వ్యాక్సిన్ల ప్రయోగాలు జరుగుతున్నాయి. వాటిలో ఓ ఏడు వ్యాక్సిన్లు కచ్చితంగా డిసెంబర్ నాటికి తయారవుతాయనే నమ్మకం ఉంది. ఇప్పటికే మూడు, నాలుగు వ్యాక్సిన్లు మంచి ఫలితాల్ని చూపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో తమిళనాడులోని తాంబరంలో... సిద్ధ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ డాక్టర్లు... మూలికలతో కఫసుర అనే మందును తయారుచేశారు. ఇప్పుడు ఆ మందు కరోనాకి కచ్చితంగా చెక్ పెట్టగలదనే నమ్మకం డాక్టర్లకు కలిగింది. ఎందుకంటే... అది మంచి ఫలితాలు ఇస్తోంది.

డిసెంబర్‌లో చైనాలో కరోనా వచ్చినప్పుడే ఈ ఇన్‌స్టిట్యూట్ డాక్టర్లు అలర్ట్ అయ్యారు. కరోనా వైరల్ లక్షణాలు తెలుసుకొని... భారతీయ మూలికల్లో ఆ వైరస్‌కి చెక్ పెట్టే మూలికల్ని ఎంపిక చేశారు. వాటితో ఓ చూర్ణం మందును తయారుచేశారు. ఎలాగూ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కదా అనుకుంటూ... డైరెక్టుగా కరోనా వచ్చిన వారిని రెండు గ్రూపులుగా చేసి... ఏప్రిల్ 1న ఐదు రోజుల పాటూ... మందు ఇచ్చారు. ఆరో రోజున కరోనా పరీక్షలు చెయ్యగా... నెగెటివ్ అని వచ్చింది. డాక్టర్లు చాలా ఆనందపడ్డారు.

మే, జూన్‌లో SRM ఆస్పత్రిలోని కరోనా బాధితులకు మరోసారి ఇదే మందును ఇచ్చి చూశారు. అక్కడ పాజిటివ్ ఉన్నవారంతా... ఐదు రోజుల్లోనే నెగెటివ్ అయిపోయారు. అంటే... ఐదు రోజులు మందు తీసుకుంటే... కరోనా వైరస్ చచ్చిపోతోందన్నమాట.

ఇప్పుడీ డాక్టర్లు భారతీయ వైద్య పరిశోధనా మండలి (ICMR) పర్మిషన్‌తో పెద్ద సంఖ్యలో ఎక్కువ మంది పేషెంట్లకు ఈ మందును ఇచ్చి... ప్రయోగాత్మకంగా నిరూపించాలనుకుంటున్నారు. ఇందుకు మరో నెల పట్టే అవకాశం ఉంది. ఒకవేళ మూడోసారి ప్రయోగాల్లోనూ సక్సెస్ వస్తే... అప్పుడు అధికారికంగా కఫసురకు గుర్తింపు లభిస్తుంది. వెంటనే భారీ ఎత్తున మందు ఉత్పత్తి చేయగలరు. వ్యాక్సిన్‌లా ఎక్కువ కాలం పట్టకుండానే... దీన్ని భారీగా ఉత్పత్తి చేసేందుకు వీలుంటుంది. ఈ పరిణామాలన్నీ డిసెంబర్ నాటికి కరోనా పని అయిపోయినట్లే అనే సంకేతాలు ఇస్తున్నాయి.
First published: June 20, 2020, 6:43 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading