లాక్‌డౌన్‌కి చెక్... మళ్లీ తెరచుకున్న ఆస్ట్రేలియా... సిడ్నీ బాండీ బీచ్...

Corona Lockdown | Corona Update : ఏడాది మొదట్లో కార్చిచ్చుతో అల్లాడిపోయిన ఆస్ట్రేలియా కరోనా విషయంలో మాత్రం ఎక్కువ ముప్పు లేకుండా తప్పించుకోగలిగింది.

news18-telugu
Updated: April 28, 2020, 2:48 PM IST
లాక్‌డౌన్‌కి చెక్... మళ్లీ తెరచుకున్న ఆస్ట్రేలియా... సిడ్నీ బాండీ బీచ్...
మళ్లీ తెరచుకున్న ఆస్ట్రేలియా... సిడ్నీ బాండీ బీచ్... (credit - twitter - AFP news agency)
  • Share this:
Corona Lockdown | Corona Update : ఆస్ట్రేలియా... సిడ్నీలో వరల్డ్ ఫేమస్ బాండీ బీచ్... మళ్లీ ప్రారంభమైంది. ఇలా గేట్లు తెరిచారో లేదో... అలా వందల మంది బీచ్‌కి వెళ్లి... అలలతో ఆడుకున్నారు. ఆస్ట్రేలియాలో కరోనా వైరస్ వచ్చాక... లాక్‌డౌన్ విధించారు. కేసుల సంఖ్య 6725కి చేరింది. బట్... కొత్త కేసులు 5కి మించి నమోదవ్వట్లేదు. మృతుల సంఖ్య 83గా ఉంది. అంత పెద్ద ఆస్ట్రేలియాలో ఈ లెక్కల ప్రకారం చూస్తే... కరోనా చాలా తక్కువ ఉన్నట్లే అని మనకు ఎలా అనిపిస్తుందో... ఆస్ట్రేలియా పాలకులకూ అలాగే అనిపించింది. అనవసరంగా లాక్‌డౌన్ పెట్టి... వచ్చే వచ్చే ఆదాయాన్ని పోగొట్టుకుంటున్నామా అని అనుకున్న ప్రభుత్వం... మెల్లమెల్లగా నిబంధనలు సడలిద్దామని డిసైడైంది. అందులో భాగమే ఈ బీచ్ రీ ఓపెనింగ్.


బాండీ బీచ్‌లో సర్ఫింగ్ చెయ్యడమంటే సర్ఫర్లకు పండగే. మంగళవారం ఉదయం 7 గంటలకు గేట్ తెరవగానే రెయిలింగ్స్‌తో నీటిలోకి జంప్ చేశారు. 5 వారాలుగా మిస్సైన ఆనందాన్ని ఇప్పుడు తిరిగి పొందారు. ఈ బీచ్‌లో సర్ఫింగ్ చెయ్యడానికి వీలుగా ఆలలు ఎత్తుగా వస్తాయి. పైగా... ఎక్కువ కుదుపులు కూడా ఉండవు. అందుకే ఇది ఫేమస్ అయ్యింది.


ఐదు వారాల కిందట ఇదే బీచ్‌లో జనం కిటకిట లాడారు. సోషల్ డిస్టాన్స్ సముద్రానికి వదిలేశారు. అది చూసిన పోలీసులు... అమ్మో ఇలాగైతే కష్టమే అని సీల్ వేశారు. ఇక అప్పటి నుంచి అలలను చూసి... అయ్యో అనుకోవడమే తప్ప... తీరాన్ని చేరిందే లేదు.


బీచుల్ని సీల్ వెయ్యడంలో ఆస్ట్రేలియా పోలీసులు ఆరితేరిపోయారు. అక్కడ షార్క్ చేపలు దాడి చేసినప్పుడూ... ఒక రకమైన బ్లూ కలర్ జెల్లీ ఫిష్‌లు దాడి చేసినప్పుడూ... బీచ్‌లను ఇలాగే మూసివేశారు. మాటిమాటికీ మూయాల్సి వస్తుందనే ఉద్దేశంతో... ముఖ్యమైన బీచ్‌లలో బలమైన ఫెన్స్‌లను ఏర్పాటు చేశారు. అందువల్ల బీచ్ సీల్ వేస్తే... ఇక లోపలికి వెళ్లే ఛాన్సే ఉండదు. ఇప్పుడు చూస్తున్నారుగా ఎలా ఎంజాయ్ చేస్తున్నా్రో.


బీచ్ తెరిచారు కదా అని వెళ్లి... సన్ బాత్ చేస్తానంటే కుదరదు. రూల్స్ పాటించాల్సిందే. సోషల్ డిస్టాన్స్ తప్పనిసరి చేశారు. ఎవరైనా సరే... సర్ఫింగ్ చేసి వెళ్లిపోవాలి అంతే తప్ప అక్కడే గంటల తరబడి ఉంటామంటే కుదరదు.


నిజానికి బాండీ బీచ్‌తోపాటూ... ఆ చుట్టుపక్కల ఉండే కొన్ని బీచ్‌లు కూడా తెరిచారు. కానీ... వాటికి ప్రజలు పెద్దగా వెళ్లట్లేదు. బాండీలో మాత్రం సోషల్ డిస్టాన్స్ పాటిస్తూనే... దూరం దూరం అనుకుంటూనే ఎంజాయ్ చేస్తున్నారు. ఇన్నాళ్లూ బంధీలమైపోయినట్లు ఫీలైన వాళ్లంతా... ఇప్పుడు ఫ్రీడం దొరికినట్లు ఫీలవుతున్నారు.
Published by: Krishna Kumar N
First published: April 28, 2020, 2:48 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading