న్యూయార్క్‌లో దారుణం... కరోనాతో ఇళ్లలో చనిపోతే... లెక్కించని ప్రభుత్వం

Corona Lockdown | Coronaupdate : కరోనా వైరస్‌తో న్యూయార్క్ సిటీ కకావికలం అవుతోంది. చాలా మంది ఆస్పత్రులకు వెళ్లలేక ఇళ్లలోనే కరోనాతో చనిపోతున్నారు.

news18-telugu
Updated: April 8, 2020, 9:37 AM IST
న్యూయార్క్‌లో దారుణం... కరోనాతో ఇళ్లలో చనిపోతే... లెక్కించని ప్రభుత్వం
న్యూయార్క్‌లో దారుణం... కరోనాతో ఇళ్లలో చనిపోతే... లెక్కించని ప్రభుత్వం (credit - twitter - Austin Prendergast)
  • Share this:
Corona Lockdown | Coronaupdate : మన దేశంలో కరోనా వైరస్ లెక్కలు ఎంతో పక్కాగా వేస్తుంటే... అమెరికా మాత్రం తమ దేశంలో కరోనా లెక్కల్ని అటకెక్కిస్తోంది. ముఖ్యంగా న్యూయార్క్ సిటీలో కరోనా కేసుల సంఖ్యల్లో వాస్తవం కనిపించట్లేదు. ప్రస్తుతం న్యూయార్క్ సిటీలో 142384 పాజిటివ్ కేసులున్నాయి. ఆ ఒక్క నగరంలోనే 5489 మంది చనిపోయారు. ఐతే... ఇవన్నీ ఆస్పత్రుల్లో చేరిన కరోనా పేషెంంట్లకు సంబంధించిన లెక్కలు మాత్రమే. ఎవరైనా ఆస్పత్రుల్లో చేరకుండా... ఇళ్లలోనే కరోనా వైరస్‌తో చనిపోతే... వాటిని లెక్కలోకి తీసుకోవట్లేదు అక్కడి అధికారులు. ఓవైపు కరోనాను కంట్రోల్ చెయ్యలేక తాము తిప్పలు పడుతుంటే... ఇక లెక్కలేసుకుంటూ కూర్చోవడం సాధ్యమవుతుందా అని అంటున్నారు.
ప్రస్తుతం అమెరికాలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 400412 అయ్యింది. మృతుల సంఖ్య 12854 అయ్యింది. కానీ వాస్తవంగా ఈ నంబర్లు ఇంకా ఎక్కువే ఉంటాయంటున్నారు నిపుణులు. మొన్నటిదాకా చైనా నిజమైన లెక్కలు చెప్పట్లేదని మండిపడిన అధ్యక్షుడు ట్రంప్... ఇప్పుడు తానే చెప్పకుండా చెయ్యడం దారుణమే. నిజానికి చైనా నిజమైన లెక్కలే చెప్పింది. తమ దగ్గర కరోనా తగ్గింది కాబట్టే... వుహాన్‌లో లాక్‌డౌన్ ఎత్తివేసింది. కేసులు తగ్గాయనడానికి అదే నిదర్శనం.

ప్రపంచవ్యాప్తంగా ఎపిడెమాలజిస్టులు కరోనా లెక్కలు వేస్తున్నారు. వీళ్లు ఆయా దేశాలకు ఫోన్లు చేసి... ఎప్పటికప్పుడు తాజా లెక్కలు తెలుసుకుంటున్నారు. అమెరికాలో లెక్కల విషయంలో వాళ్లకు కాన్ఫిడెన్స్ కలగట్లేదు. అబద్ధాలు చెబుతున్నారనే ఆలోచనలు వస్తున్నాయి. న్యూయార్క్ ఆరోగ్య అధికారుల ప్రకారం... అక్కడ రోజూ యావరేజ్‌గా 245 మంది చనిపోతున్నారు. కానీ... స్థానికంగా లెక్కలు వేస్తున్న సంస్థలు... రోజుకు 500 మందికి పైగా చనిపోతున్నారని అంటున్నాయి. అంటే రోజూ న్యూయార్క్‌లో 200 మందిదాకా ఇళ్లలోనే కరోనాతో చనిపోతున్నారని అనుకోవచ్చు.


ఇలా అడ్డమైన లెక్కలు చెబుతున్న అమెరికా ప్రభుత్వం... ప్రపంచ ఆరోగ్య సంస్థపై మండిపడుతోంది. కరోనాపై చైనాతో చేతులు కలిపి తమకు నిజాలు చెప్పలేదనీ, అందుకే ఇప్పుడు తమకు ఇలాంటి సమస్య ఎదురైందని ఫైర్ అవుతున్నారు ట్రంప్.
First published: April 8, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading