లాక్‌డౌన్ ముగించాలంటున్న చాలా దేశాలు... కొనసాగించాలంటున్న బ్రిటన్...

Corona Lockdown | Corona Update : ప్రపంచంలో కరోనా వైరస్ తర్వాత... లాక్‌డౌన్ అంశంపై ఎక్కువగా చర్చ జరుగుతోంది. ఏ దేశాలు ఏమంటున్నాయి?

news18-telugu
Updated: April 28, 2020, 1:08 PM IST
లాక్‌డౌన్ ముగించాలంటున్న చాలా దేశాలు... కొనసాగించాలంటున్న బ్రిటన్...
లాక్‌డౌన్ ముగించాలంటున్న చాలా దేశాలు... కొనసాగించాలంటున్న బ్రిటన్... (credit - twitter - YorkshireShepherdess)
  • Share this:
Corona Lockdown | Corona Update : ప్రపంచంలో కరోనా పాజిటివ్ కేసులు 30 లక్షలు దాటిన సమయంలో... లాక్‌డౌన్ కొనసాగించాలా వద్దా అనే అంశాలపై ప్రపంచ దేశాలు తమ తమ అభిప్రాయాలతో ఉన్నాయి. ఇటలీ, న్యూజిలాండ్ లాంటి దేశాలు... లాక్‌డౌన్ మెల్లమెల్లగా ఎత్తేయాలని అంటుంటే... బ్రిటన్ ప్రధాని బోరిన్ జాన్సన్... అప్పుడే ఎత్తేయడం మంచిది కాదంటున్నారు. కరోనాతో ప్రత్యక్షంగా యుద్ధం చేసిన ఆయన... పూర్తిగా కోలుకొని... సోమవారం మళ్లీ విధుల్లో చేరారు. నిజానికి కరోనా వ్యాప్తిలో వేగం తగ్గిందని చాలా దేశాలు చెబుతున్నాయి. అదే సమయంలో... లాక్‌డౌన్ కొనసాగిస్తే... ఆర్థికంగా పాతాళంలోకి కూరుకుపోతాయని ఆ దేశాల అధినేతలు అంటున్నారు. ఒకేసారి ఎత్తేయకపోయినా... క్రమంగా ఎత్తేయడం బెటరంటున్నారు.

కరోనా మొదట వచ్చిన చైనా వుహాన్‌లో లాక్‌డౌన్ ఎత్తేయడంతో... ప్రజలు ఇప్పుడు ఏ సమస్యా లేకుండా ఉన్నారు. అందువల్ల లాక్‌డౌన్ ఆర్థిక నష్టాల నుంచి చైనా తప్పించుకున్నట్లైంది. కానీ ప్రపంచ దేశాల్లో రవాణా స్తంభించిపోయింది. విమానాలు, రైళ్లు తిరగట్లేదు. టూరిజం పడిపోయింది. షాపులు, మాల్స్, థియేటర్లు అన్నీ మూతపడ్డాయి. ఫ్యాక్టరీలు సైలెంటైపోయాయి. అన్ని దేశాల్లో ఆర్థిక మాంద్యం జడలు విప్పుతోంది.

కరోనాకి మందు లేదు కాబట్టి... లాక్‌డౌన్ ఎన్నాళ్లని కొనసాగించాలి? కొనసాగిస్తే కరోనా ఆగిపోతుందా? లేదే... అంటున్నాయి చాలా దేశాలు. వెంటనే ఎత్తివేయకపోతే... తాము మళ్లీ కోలుకోవడానికి కొన్నేళ్లు పడుతుందని ఆందోళన చెందుతున్నాయి. ప్రపంచంలో అమెరికా తర్వాత ఎక్కువ మరణాలు (దాదాపు 27000) ఉన్న ఇటలీ... మే 4 నుంచి ఫ్యాక్టరీలు, భవన నిర్మాణాలకు అనుమతి ఇవ్వబోతోంది. సోషల్ డిస్టాన్స్ పాటిస్తూ పనులు చేసుకోవాలని సూచించింది.

56వేల మరణాలున్న అమెరికా... లాక్‌డౌన్ నుంచి ఎప్పుడు బయటపడేదీ ట్రంప్ సహా ఎవరికీ తెలియట్లేదు. అక్కడి రాష్ట్రాలది ఓ మాట, ట్రంప్‌ది మరో మాట అవుతోంది. జార్జియా, ఒక్లహామా లాంటి రాష్ట్రాలు వెసులుబాట్లు ఇవ్వాల్సిందే అంటున్నాయి. న్యూయార్క్ మాత్రం మే 15 వరకూ ఎదురుచూద్దామంటోంది.

న్యూజిలాండ్ ప్రజలు... చేపలు పట్టడం, సర్ఫింగ్, హంటింగ్, హైకింగ్ వంటి వాటికి అనుమతి పొందారు. నెల తర్వాత అక్కడ లాక్‌డౌన్ మినహాయింపులు లభించాయి. 4 లక్షల మంది సోమవారం నుంచి పనులకు వెళ్లారు.

నార్వేలో స్కూల్ పిల్లలకు క్లాసులు మొదలయ్యాయి. హెయిర్ డ్రెస్సర్స్ లాంటి చిన్న షాపులు తెరిచేందుకు అనుమతిచ్చారు.

23వేల మరణాలున్న స్పెయిన్ కూడా... 6 వారాల తర్వాత నిబంధనలను సడలించాలింది. ఫలితంగా పిల్లలు ఇళ్ల నుంచి బయటకొస్తున్నారు. అక్కడక్కడా ప్రజలు గుమికూడుతున్నారు.బెల్జియం ఆల్రెడీ గార్జెన్లు, DIY సెంటర్లను తెరిచింది. మే 4 తర్వాత మరిన్ని మినహాయింపులు ఇవ్వబోతోంది.

స్విట్జర్లాండ్ ప్రజలు కొన్ని వారాల తర్వాత తొలిసారిగా హెయిర్ కట్ షాపులకు వెళ్తున్నారు. గార్డెన్లు కూడా తెరచుకున్నాయి.

ఇజ్రాయెల్... ఆదివారం కొన్ని వ్యాపారాలను తెరవనిచ్చింది. త్వరలో స్కూళ్లు కూడా తెరవనిస్తామంటోంది.

రొమేనియా మే 15 తర్వాత లాక్‌డౌన్ కొనసాగించే ప్రసక్తే లేదని చెప్పింది.
Published by: Krishna Kumar N
First published: April 28, 2020, 1:08 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading