పేరెంట్స్ ఇది విన్నారా... స్కూళ్లలో సరి-బేసి విధానం... 12 టీవీ ఛానెళ్లు కూడా...

Corona Lockdown | Corona Update : లాక్‌డౌన్ 3 ముగిశాక... స్కూళ్లు తెరచుకునే ఛాన్స్ ఉంది కాబట్టి... ఎలా తెరవాలి అనే అంశంపై చర్చలు, డిబేట్లూ జరుగుతున్నాయి.

news18-telugu
Updated: May 9, 2020, 10:16 AM IST
పేరెంట్స్ ఇది విన్నారా... స్కూళ్లలో సరి-బేసి విధానం... 12 టీవీ ఛానెళ్లు కూడా...
మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెప్టెంబర్ 5 నుంచి స్కూళ్లు తెరిచే ఆలోచనలో ఉన్నట్టు ఇప్పటికే కేంద్ర మానవనరుల శాఖకు తెలియజేసింది.
  • Share this:
Corona Lockdown | Corona Update : కరోనా వచ్చింది కదా అని పిల్లలకు చదువులు దూరం చెయ్యలేం... అంటున్నారు విద్యా నిపుణులు. ఇప్పటివరకూ సమ్మర్ హాలిడేస్ కాబట్టి... సరిపోయింది... కానీ... జూన్ నుంచి స్కూళ్లు తెరచుకోవడమే మంచిదంటున్నారు నిపుణులు. దీనిపై కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ (MHRD)... NCERT సభ్యులతో చర్చించింది. స్కూళ్లలో సరి-బేసి (ODD-EVEN) విధానం తెస్తే బాగుంటుందని ఎవరో చెప్పారు. ఎలా అని ఇంకెవరో అడిగారు. ఇలా అని ఆ వ్యక్తి చెప్పారు. రోజూ 50 శాతం మంది విద్యార్థులతోనే స్కూళ్లు నడవాలని ఆ సభ్యుడు సూచించారు. అందువల్ల తరగతి గదిలో ప్రస్తుతం 40 మంది విద్యార్థులు ఉంటే... లాక్‌డౌన్ తర్వాత స్కూళ్లు తెరిచాక... క్లాస్ రూంలో 20 మంది విద్యార్థులే ఉంటారు. మరి మిగతా 20 మంది సంగతేంటి? వాళ్లను ఎండలో కూర్చోబెట్టలేం కదా... అందుకే సరి-బేసి విధానం తేవాలని సూచించారు.

స్కూళ్లకు సంబంధించిన గైడ్ లైన్స్‌ (మార్గదర్శకాలు)ని త్వరలో MHRD ప్రకటించనుంది. సరి-బేసి విధానం తెస్తే గనక... ప్రతి విద్యార్థికీ ఓ నంబర్ ఇస్తారు. సరిసంఖ్య (2, 4, 6, 8 లాంటివి) కలిగిన విద్యార్థులంతా ఓ రోజు.... బేసి సంఖ్య (1, 3, 5, 7, 9, 11) కలిగిన విద్యార్థులంతా నెక్ట్స్ రోజు స్కూలుకు వస్తారు. అంటే... సోమవారం బేసి అనుకుంటే... మంగళవారం సరి సంఖ్య వాళ్లు వస్తారు. తద్వారా 50 శాతం విద్యార్థులనే అనుమతించినట్లు అవుతుంది. అలాగే... రోజు విడిచి రోజు లెక్కన అందరు విద్యార్థులకూ చదువు లభిస్తుంది. ఇక ఆదివారం అంతా సెలవు తీసుకుంటారు.

ఈ సరి-బేసి విధానం వల్ల... విద్యార్థులు... వారానికి మూడు రోజులు మాత్రమే స్కూలుకు వెళ్లినట్లు అవుతుంది కదా. అలాగైతే చదువు దెబ్బతినడం ఖాయం. దీనికి MHRDలో పెద్ద చర్చే జరిగింది. ఏంటే... ఇళ్ల దగ్గర ఉండే పిల్లలకు ఆన్‌లైన్‌లో చదవాల్సిన మెటీరియల్ ఇస్తారట. అలాగే ఇంట్లోనే టీవీల్లో పాఠాలు చెబుతారట. అవి చూస్తూ... నేర్చేసుకోవాలన్నమాట. ఇందుకు సంబంధించి అన్ని స్కూళ్లలో డిజిటల్ సౌకర్యాలు పెంచాలన్న వాదన వినిపించింది.

మీకో డౌట్ వచ్చి ఉంటుంది. ఒక్క ఛానెల్‌లో ఎన్ని పాఠాలు చెప్పగలరు అని. దీనికి వాళ్లు ఏమనుకున్నారంటే... ఒక్కో క్లాసుకూ ఒక్కో ఛానెల్ తేవాలనుకుంటున్నారు. అప్పుడు ఏ క్లాస్ విద్యార్థి... ఆ క్లాస్ ఛానెల్ పెట్టుకొని... టీవీ ముందు కూర్చొని... పాఠాలు నేర్చుకోవాలన్నమాట. మొత్తం 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకూ... 12 టీవీ ఛానెళ్లు తేవాలనుకుంటోంది కేంద్రం.

సరి-బేసి విధానం... రోజు విడిచి రోజు కంటే... వారం వారం లెక్కన ఉంటే బాగుంటుందని ఎవరో అన్నారు. అంటే... ఓవారం మొత్తం సరిసంఖ్య విద్యార్థులు, మరోవైరం మొత్తం బేసి సంఖ్య విద్యార్థులు స్కూళ్లకు వెళ్లాలన్నమాట. ఏ విధానం తెచ్చినా... చదువులకు ఆటంకం కలగకుండా చెయ్యాలని MHRD భావిస్తోంది.

చైనాలో ఇలాంటివేవీ లేవు. రోజూ విద్యార్థులంతా స్కూళ్లకు వెళ్తున్నారు. కాకపోతే... గేటు దగ్గర ధెర్మల్ స్కానర్‌లో చెకప్ ఉంటోంది. తర్వాత్ క్లాస్ రూంలో మీటర్ దూరంలో కూర్చుంటున్నారు. మాస్క్ తప్పనిసరి. అలాగే... ఆన్ లైన్ క్లాసులు వాళ్లకు జనవరి నుంచి నడుస్తున్నాయి. ఇప్పుడు కేంద్రం అనుకునేది వాస్తవంలో జరగాలంటే... మన విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు రావాల్సిందే. దశాబ్దాలుగా రాని మార్పులు ఇప్పటికిప్పుడు రావాలంటే... వాటికి విద్యార్థులు అలవాటవ్వాలంటే... అదంత తేలికైన విషయం మాత్రం కాదు.
Published by: Krishna Kumar N
First published: May 9, 2020, 10:16 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading