కరోనా కేసుల్లో చైనాను దాటేసిన రష్యా... అక్కడేం జరుగుతోంది?

Corona Lockdown | Corona Update : రష్యాలో కరోనా ఎందుకు రావట్లేదని చాలా మంది ప్రశ్నించారు. ఇప్పుడు అక్కడి కేసులు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి.

news18-telugu
Updated: April 28, 2020, 10:30 AM IST
కరోనా కేసుల్లో చైనాను దాటేసిన రష్యా... అక్కడేం జరుగుతోంది?
కరోనా కేసుల్లో చైనాను దాటేసిన రష్యా... అక్కడేం జరుగుతోంది?
  • Share this:
Corona Lockdown | Corona Update : రష్యాలో ప్రస్తుతం కరోనా పాజిటివ్ కేసులు 87147కి చేరాయి. ఫలితంగా చైనా చెబుతున్న అధికారిక పాజిటివ్ కేసులైన 82836 కంటే... రష్యాలోనే ఎక్కువ కేసులు ఉన్నట్లు స్పష్టమవుతోంది. నిజానికి రెండు నెలల కిందటి వరకూ... రష్యాలో కరోనా పెద్దగా లేనే లేదు. ఫిబ్రవరి 15న తొలిసారిగా రెండు కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత మార్చి 22 నాటికి కేసులు 367 మాత్రమే ఉండటంతో... చాలా మంది అనుమానం వ్యక్తం చేశారు. చైనా, రష్యా ఫ్రెండ్లీ దేశాలు కాబట్టి... చైనా ఆ వైరస్‌ని రష్యాకు అంటనివ్వకుండా జాగ్రత్తలు తీసుకుందని కొందరు అన్నారు. కానీ... మార్చి 22 తర్వాత పరిస్థితులు మారాయి. ఒక్కసారిగా కేసుల్లో పెరుగుదల మొదలై... తాజాగా ఆదివారం ఏకంగా 6198 కొత్త కేసులు నమోదయ్యాయి. ప్రపంచంలో అమెరికా తప్ప మరే దేశంలో ఇన్ని ఎక్కువ కేసులు ఒకే రోజు నమోదు కాలేదు. ఇదే ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది.

అసలు కరోనాయే లేదనుకున్న రష్యాలో... ఇప్పుడు చైనాను మించినన్ని కేసులు ఎందుకొచ్చాయి? ఇప్పుడు కొంత మంది ఏమంటున్నారంటే... రష్యా ప్రభుత్వం అబద్ధం చెబుతోందనీ... వాస్తవంగా కేసుల సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుందని అంటున్నారు.

రష్యాలో ఇన్నాళ్లూ పెద్దగా టెస్టులు చెయ్యలేదు. ఇప్పుడు చేస్తున్నారు. అందువల్ల పాజిటివ్ కేసులు తెరపైకి వస్తున్నాయి. ఇంకో సమస్యేంటంటే... రష్యాలో చాలా మందికి కరోనా ఉన్నా... సింప్టమ్స్ కనిపించట్లేదు. ఆలస్యంగా కనిపిస్తున్నాయి. ఈ ఆలస్య సమయంలో... సదరు వ్యక్తులు చాలా మందికి ఆ వైరస్‌ని తమకు తెలియకుండానే వ్యాప్తి చేస్తున్నారు. ఈ వాస్తవాలన్నీ ఇప్పుడు బయటపడుతున్నాయి.

కొత్త కేసులు నమోదవుతున్నదాన్ని బట్టీ చూస్తుంటే... అమెరికా, యూరప్ దేశాల తర్వాత... ఎక్కువ కేసులు రష్యాలోనే నమోదవుతాయనే సంకేతాలొస్తున్నాయి. రష్యాలో గత 24 గంటల్లో 50 కొత్త మరణాలు రావడంతో... మొత్తం మరణాల సంఖ్య 794కి చేరింది. ఇంత మంది ఒకేసారి చనిపోవడంతో... రష్యా నిజమైన లెక్కలే చెబుతోందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.

రష్యా రాజధాని మాస్కో చుట్టుపక్కల గత వారం నుంచి కరోనా కేసులు 110 శాతం పెరిగాయి. ఇన్నాళ్లూ కరోనాను లైట్ తీసుకున్న రష్యాకి ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి. హడావుడిగా ఆస్పత్రుల్లో బెడ్స్ ఏర్పాటు చేస్తోంది. నాలుగు, ఐదో సంవత్సరం చదువుతున్న మెడికల్ విద్యార్థులంతా కోరనా విధుల్లో పనిచెయ్యాలని కోరింది. ఐతే... రష్యాలో ఇప్పుడున్న ఆస్పత్రులు కరోనా పేషెంట్లకు ఏమాత్రం సరిపోవని రిపోర్టులు చెబుతున్నాయి.

ప్రపంచంలో ఏ దేశంలో కరోనా పెరిగినా అది ప్రపంచానికే ప్రమాదం. అన్ని దేశాలూ బుద్ధిగా కరోనాను కంట్రోల్ చేస్తేనే... ఆ వైరస్ నుంచి ప్రపంచం బయటపడగలదు. ప్రస్తుతం చైనాలో కరోనా యాక్టివ్ కేసులు 648 ఉన్నాయి. మరో 10 రోజుల్లో ఆ దేశం పూర్తిగా కరోనా ఫ్రీ కంట్రీగా మారే అవకాశాలు కనిపిస్తున్న సమయంలో... రష్యాలో కేసులు పెరుగుతుండటం విచారకరమే.
Published by: Krishna Kumar N
First published: April 28, 2020, 10:30 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading