Corona Lockdown | Corona Update : కరోనా వైరస్ దేశాన్ని పట్టి పీడిస్తున్న వేళ... పేదలకు, అన్నార్తులకూ తోడుగా మేమున్నామంటూ... రిలయన్స్ ఇండస్ట్రీస్ ముందుకొచ్చింది. దేశవ్యాప్తంగా భారీ ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. జనరల్‌గా బిగ్ ఈజ్ బ్యూటీఫుల్ అని నమ్మే రిలయన్స్ ఇండస్ట్రీస్... ఏ కంపెనీ స్థాపించినా, ఏ కార్యక్రమం ప్రారంభించినా అది భారీ స్థాయిలో ఉండేలా చేస్తుంది. ఇప్పుడు కరోనా వైరస్ తీవ్రంగా ప్రబలుతున్న వేళ... ప్రపంచంలోనే అతి పెద్ద సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ, ఆయన సతీమణి నీతా అంబానీ. వారు ఏర్పాటు చేసిన రిలయన్స్ ఫౌండేషన్... ఈ భారీ సేవా కార్యక్రమాన్ని సైలెంట్‌గా చేసుకుపోతోంది.
జనరల్‌గా వ్యాపారవేత్తలు... సేవా కార్యక్రమాల జోలికి వెళ్లరు. ఎందుకంటే... వారి దృష్టి ఎప్పుడూ... వ్యాపారాన్ని విస్తరించుకోవడం, మరింత మనీ సంపాదించడంపైనే ఉంటుంది. కానీ... రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒకప్పటికీ ఇప్పటికీ చాలా మారింది. ఇటీవల కొన్నేళ్లుగా ఆ సంస్థ... వ్యాపారాల్ని విస్తరించడంతోపాటూ... సేవా కార్యక్రమాల్ని కూడా నిర్వహిస్తూ... దేశ ప్రజలతో మమేకం అవుతోంది. తాజాగా కరోనా వారియర్స్ పోరాటాలు, రిలయన్స్ ఫౌండేషన్ చేస్తున్న కార్యక్రమాలపై ఓ షార్ట్ వీడియోని ఆ సంస్థ రిలీజ్ చేసింది. "కర్ దే మేరే హవాలే... హై తేరే దర్ద్ యే సారే" అంటూ... ఈ పాట సాగుతోంది. చివర్లో... రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ నీతా అంబానీ... "మనం కలిసి ఈ పోరాటంలో విజయం సాదిద్దామని దేశ ప్రజలకు పిలుపు ఇచ్చారు.
ఈ సందర్భంగా రిలయన్స్ ఫౌండేషన్ ఏం చేస్తోందో మనం తెలుసుకుంటే మంచిదే. దేశంలోనే అతి పెద్ద కొవిడ్ 19 టెస్ట్ ల్యాబ్‌ని ఈ సంస్థ ఏర్పాటు చేసింది. అక్కడ రోజుకు 3500 టెస్టులు జరుగుతున్నాయి. అంతేకాదు... ఇండియాలో మొదటి కొవిడ్ 19 స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేసింది కూడా ఈ సంస్థే.
రిలయన్స్ ఏర్పాటు చేసిన ప్రత్యేక ఫ్యాక్టరీ నుంచి రోజుకు లక్ష PPEలు, మాస్కులూ తయారవుతున్నాయి. ఇప్పటివరకూ రిలయన్స్ టీమ్... 4 కోట్ల మంది కడుపు నింపింది. ఆ ఇచ్చే ఆహారం కూడా అత్యంత పరిశుభ్రమైనది కావడం విశేషం. రిలయన్స్ టీమ్ ద్వారా కోట్ల మంది కుటుంబాలకు ఉచిత నిత్యవసర సరుకులు అందుతున్నాయి. అంతేకాదు... జియో నెట్వర్క్ ద్వారా... దేశప్రజలంతా ఒక్కటిగా ముందుకుసాగేలా రిలయన్స్ ప్రయత్నిస్తోంది.
(Disclaimer: న్యూస్ 18.కామ్... రిలయన్స్ ఇండస్ట్రీస్ యొక్క అనుబంధ సంస్థ అయిన నెట్వర్క్ 18 మీడియా & ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్‌లో భాగం.)