గుడ్ న్యూస్... పూడుకుపోయిన ఓజోన్ పొర కన్నం...

Corona Lockdown | Corona Update : ఆర్కిటిక్ హిమ ప్రాంతంపై ఏర్పడిన కన్నం... పోలార్ వర్టెక్స్ కారణంగా ఏర్పడినట్లు శాస్త్రవేత్తలు తేల్చారు.

news18-telugu
Updated: April 27, 2020, 9:49 AM IST
గుడ్ న్యూస్... పూడుకుపోయిన ఓజోన్ పొర కన్నం...
గుడ్ న్యూస్... పూడుకుపోయిన ఓజోన్ పొర కన్నం... (File)
  • Share this:
Corona Lockdown | Corona Update : భూమికి ఉత్తరార్ధ గోళంలో ఉన్న ఆర్కిటిక్ హిమ ప్రాంతంపై ఏర్పడిన ఓజోన్ లేయర్ కన్నం... చాలా త్వరగా పూడుకుపోయిందని యూరోపియన్ శాటిలైట్ సిస్టం కోపర్నికస్ (Copernicus) ద్వారా తెలిసింది. మార్చిలో... ఈ కన్నాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఉత్తర ధ్రువంలో... ఉష్ణోగ్రతల్లో వచ్చిన మార్పులే ఇది ఏర్పడటానికి కారణం అనుకున్నారు. నిజానికి ఓజోన్ లేయర్ అనేది సూర్యుడి అతినీల లోహిత కిరణాల (ultraviolet radiation) నుంచి భూమిని, ప్రాణికోటిని కాపాడుతోంది. ఈ పొరే గనక లేకపోతే... మనుషులపై తీవ్ర ఎండపడి చర్మ కాన్సర్లు వచ్చే ప్రమాదం ఉంది.

ఆ రంధ్రం మనుషులు ఉండే ప్రాంతంలో లేకపోవడం వల్ల మనకు ఏమీ కావట్లేదు. ఒకవేళ అది మరింత పెద్దదై... ఉత్తర గోళం నుంచి దక్షిణ గోళం వైపుగా పెరిగి ఉంటే... అప్పుడు మనుషులపై డైరెక్ట్ అతినీలలోహిత కిరణాలు పడే ప్రమాదం ఉండేది. అలాంటిది... జస్ట్ నెల రోజుల గ్యాప్‌లో... ఆ కన్నం పూడుకుపోయింది. మొత్తం ఆరు రకాల కోపర్నికస్ సిస్టం శాటిలైట్లు, మరిన్ని డజన్ల కొద్దీ థర్డ్ పార్టీ శాటిలైట్ల సమాచారాన్ని క్రోఢీకరించడం ద్వారా... ఈ కన్నం పూడుకుపోయిన విషయం తెలిసింది.

కరోనా లాక్‌డౌన్ వల్ల... కాలుష్యం తగ్గడంతో... ఈ కన్నం మూసుకుపోలేదని సైంటిస్టులు తెలిపారు. ఉత్తర ధ్రువంలో ఏర్పడిన పోలార్ వర్టెక్స్ (polar vortex) బలహీన పడటం వల్లేనని తెలిపారు. పోలార్ వర్టెక్స్ ఘటనలో... ఎత్తైన ప్రదేశాల్లో చల్లటి గాలులు... ధ్రువ ప్రాంతాలకు వస్తాయి. అవి క్లోరోఫ్లోరోకార్బన్ (CFC)తో కలిసి... ఓజోన్ పొరను నాశనం చేస్తాయి. ఈ సంవత్సరం బలమైన పోలార్ వర్టెక్స్ వచ్చి... మార్చిలో కనిపించిన ఓజోన్ కన్నం... ఏప్రిల్‌లో పోలార్ వర్టెక్స్ బలహీన పడటంతో... మూసుకుపోయింది.

2011లో ఉత్తర ధ్రువంలో ఇలాంటి ఓజోన్ కన్నం తొలిసారి కనిపించింది. ప్రస్తుతం మూసుకుపోయిన దానితో పోల్చితే అది చాలా చిన్నదే. ఏది ఏమైనా కన్నం మూసుకుపోవడం వల్ల భూమి సేఫ్ అనుకోవచ్చు.
Published by: Krishna Kumar N
First published: April 27, 2020, 9:48 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading