ప్రపంచంలో కంట్రోల్ అవుతున్న కరోనా... తగ్గుతున్న సీరియస్ కేసుల సంఖ్య

Corona Lockdown | Corona Update : కరోనా కొత్త కేసుల సంఖ్య తగ్గకపోయినా... సీరియస్ కేసుల సంఖ్య తగ్గుతుండటం ఒకింత సంతోషించదగ్గ విషయమే.

news18-telugu
Updated: May 2, 2020, 5:42 AM IST
ప్రపంచంలో కంట్రోల్ అవుతున్న కరోనా... తగ్గుతున్న సీరియస్ కేసుల సంఖ్య
ప్రపంచంలో కంట్రోల్ అవుతున్న కరోనా... తగ్గుతున్న సీరియస్ కేసుల సంఖ్య (credit - WHO)
  • Share this:
Corona Lockdown | Corona Update : ప్రపంచవ్యాప్తంగా రోజూ నమోదవుతున్న కరోనా కొత్త కేసులు, కరోనా మరణాల సంఖ్య ఏమాత్రం తగ్గలేదు. కాకపోతే... కరోనా తీవ్రంగా ఉన్న కేసుల సంఖ్య మాత్రం క్రమంగా తగ్గుతోంది. శుక్రవారం కొత్తగా 94151 కేసులు నమోదవడంతో... మొత్తం కేసుల సంఖ్య 3398072కి చేరింది. అలాగే... శుక్రవారం కొత్తగా 5575 మరణాలు సంభవించడంతో మొత్తం మృతుల సంఖ్య 239399కి చేరింది. ఈ లెక్కలు ఆందోళన కలిగించేవే. ఐతే... 1079572 మంది ఆల్రెడీ రికవరీ అవ్వడం వల్ల ప్రస్తుతం 2079101 మంది కరోనాతో బాధపడుతున్నారు. వీరిలో 2027766 మందికి కరోనా లక్షణాలు తక్కువగానే ఉన్నాయి. 51335 మందికి మాత్రం కరోనా తీవ్రంగా ఉంది. మొత్తం కేసుల్లో వీరి సంఖ్య 2 శాతమే. రెండు నెలల కిందట ఇది 5 శాతం ఉండేది. ఏప్రిల్‌లో 3 శాతానికి దిగింది. ఇప్పుడు మరింత తగ్గింది. అంటే నానాటికీ తీవ్రమైన కేసుల సంఖ్య తగ్గుతోంది. అంటే కరోనా వైరస్ బలహీనపడుతోందనుకోవచ్చు లేదా మానవుల్లో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతోందనుకోవచ్చు.

అమెరికాలో శుక్రవారం 35828 కేసులు నమోదవ్వడంతో... మొత్తం కేసుల సంఖ్య 1130851కి చేరింది. అలాగే... కొత్తగా 1873 మరణాలు సంభవించడంతో మొత్తం మరణాల సంఖ్య 65729కి చేరింది. ఈ లెక్కల్ని బట్టీ అమెరికాలో కరోనా వైరస్ ఏమాత్రం కంట్రోల్ కావట్లేదని అర్థం చేసుకోవచ్చు.

ఇక బ్రిటన్, రష్యా, బ్రెజిల్ ఈ మూడు దేశాలు ఇప్పుడు ప్రపంచ దేశాలకు ఎక్కువ ఆందోళన కలిగిస్తున్నాయి. ఎందుకంటే... ఈ మూడుదేశాల్లో రోజూ కొత్తగా 6వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. బ్రిటన్, బ్రెజిల్ దేశాల్లో మరణాల సంఖ్య రోజూ 500కు పైగానే ఉంటోంది. రష్యాలో మాత్రం మరణాలు 100 లోపే నమోదవుతున్నాయి. ఇలా కరోనా వ్యాప్తి ఎక్కువగానే ఉంటోంది.

ఇండియాలో కరోనా కంట్రోల్ కాకపోవడం, కొత్త కేసుల నమోదు పెరుగుతుండటంతో... కేంద్ర ప్రభుత్వం మే 17 వరకూ లాక్‌డౌన్ పొడిగించింది. ప్రస్తుతం దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య 35365గా ఉండగా... రికవరీ లేదా డిశ్చార్జి అయిన వారి సంఖ్య 9065గా ఉంది. అలాగే మరణాల సంఖ్య 1152కి చేరింది.

ఏపీలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 1463గా ఉంది. ఇప్పటివరకు 403 మంది కోలుకున్నారని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో కరోనా వైరస్ నుంచి కోలుకున్న వారి శాతం 26గా ఉండగా... ఏపీలో అది 27.50శాతంగా ఉంది. దేశంలో కేసుల రెట్టింపు సమయం 11 రోజులు ఉండగా... ఏపీలో 13రోజులుగా ఉంది.

తెలంగాణలో శుక్రవారం ఆరు కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 1044కి చేరింది. శుక్రవారం 22 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 464 మంది డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 552 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా కారణంగా ఇప్పటివరకు 28 మంది చనిపోయారు.
First published: May 2, 2020, 5:42 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading