ప్రజల ముందుకి వచ్చిన కిమ్ జోంగ్ ఉన్... అనారోగ్య ప్రచారానికి చెక్...

Corona Lockdown | Corona Update : కొన్ని విదేశీ మీడియా సంస్థలైతే... ఏకంగా కిమ్ జోంగ్ ఉన్ చనిపోయి ఉండొచ్చని ప్రచారం చేశాయి.

news18-telugu
Updated: May 2, 2020, 7:35 AM IST
ప్రజల ముందుకి వచ్చిన కిమ్ జోంగ్ ఉన్... అనారోగ్య ప్రచారానికి చెక్...
కిమ్ జోంగ్ ఉన్ (File)
  • Share this:
Corona Lockdown | Corona Update : ఉత్తరకొరియాకి చెందిన అధికారిక న్యూస్ ఏజెన్సీ KCNA... చేసిన ఓ ప్రకటనపై ప్రపంచ దేశాలు చర్చించుకుంటున్నాయి. శనివారం... ఆ దేశ అధినేత కిమ్ జోంగ్ ఉన్... ప్రజల ముందుకి వచ్చారనీ... రాజధాని ప్యాంగ్‌యాంగ్‌లోని... ఓ నిర్మాణం పూర్తైన ఎరువుల కర్మాగారాన్ని సందర్శించి, అక్కడి వేడుకల్లో పాల్గొన్నారని తెలిపింది. అందువల్ల కిమ్ జోంగ్ ఉన్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారనే ప్రచారానికి చెక్ పెట్టినట్లైంది. ఏప్రిల్ 11న కిమ్ చివరిసారి ప్రపంచానికి కనిపించారు. ఆ తర్వాత ఆయన కనిపించకపోవడం, కీలకమైన వేడుకల్లో కూడా పాల్గొనకపోవడం, కిమ్ కి సంబంధించిన అంశాలను ఆయన సోదరి నడిపిస్తుండటంతో... ప్రపంచ మీడియా అనుమానం వ్యక్తం చేసింది. కిమ్ జోంగ్ ఉన్‌కి హార్ట్ సర్జరీ తర్వాత... తీవ్ర అనారోగ్యం ఏర్పడిందని కథనాలు ఇచ్చింది. దానికి తోడు... గత వారం చైనా నుంచి కొందరు డాక్టర్లు ఉత్తర కొరియా వెళ్లడంతో... అనుమానాలు మరింత బలపడ్డాయి.

తాజాగా కిమ్... ప్రజలకు కనిపించారని నార్త్ కొరియా మీడియా చెప్పడంతో... 20 రోజుల ఊహాగానాలు, ప్రచారానికి తెరపడినట్లైంది. ఐతే... కిమ్‌తో పాటు ఫెర్టిలైజర్ ప్లాంట్‌కి కొందరు సీనియర్ అధికారులు, కిమ్ సోదరి కిమ్ యో జోంగ్ కూడా వెళ్లారని తెలిసింది. సహజంగా ఇలాంటి వాటికి కిమ్ సోదరి వెళ్లరు. ఈసారి ఆమె కూడా వెళ్లడం అందర్నీ ఆలోచింపజేస్తోంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలను మాత్రం రిలీజ్ చెయ్యలేదు.

ఏప్రిల్ 11న కరోనా వైరస్‌పై జరిగిన అధికార పార్టీ చర్చలో కిమ్ పాల్గొన్నారు. ఆ తర్వాత ఆయన కనిపించలేదు. ఏప్రిల్ 15న తన తాతగారి జయంతి వేడుకల్లో కూడా పాల్గొనలేదు. అందువల్ల ఆయనకు ఏమైందోనని ప్రపంచం ఆలోచించింది. తాజాగా ఆయన ప్రజల ముందుకి రావడంతో... ఇక ఊహాగానాలకు తెరపటినట్లే అనుకోవచ్చు.
First published: May 2, 2020, 7:35 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading