హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

జనం లేని మద్యం షాపు... ఎక్కడో తెలుసా... ఏపీలోనే...

జనం లేని మద్యం షాపు... ఎక్కడో తెలుసా... ఏపీలోనే...

జనం లేని మద్యం షాపు... ఎక్కడో తెలుసా... ఏపీలోనే...

జనం లేని మద్యం షాపు... ఎక్కడో తెలుసా... ఏపీలోనే...

Corona Lockdown | Corona Update : ఇది చిత్రమే. మద్యం కోసం దేశవ్యాప్తంగా ప్రజలు ఎగబడుతున్నారు. మరి ఆ షాపు ఎందుకు ఖాళీగా ఉంది?

  Corona Lockdown | Corona Update : మద్యం కోసం 40 రోజులుగా ఎదురుచూసిన మందుబాబులంతా... ఇప్పుడు తమకు స్వాతంత్ర్యం వచ్చినట్లు ఫీలవుతున్నారు. మద్యం షాపులకు వెళ్లి... క్యూ లైన్‌లో ఆలస్యమైనా ఓపిగ్గా నిల్చొని... తమ టికెట్ రాగానే... ఇన్ని రోజులుగా దాచుకున్న ఆ కాస్త డబ్బునూ ఇచ్చి... కోటరో, లీటరో కొనుక్కొని... ఇంటికెళ్లి... ప్రశాంతంగా తాగి పడుకుంటున్నారు. ఈ కారణంగా... తెలుగు రాష్ట్రాల్లో మద్యం షాపులన్నీ కస్టమర్లతో కళకళలాడుతున్నాయి. కొన్ని చోట్లైతే... "నాక్కావాలి, నాక్కావాలి" అంటూ పోటీలు పడుతున్నారు. ఇది చూసిన ఏపీ ప్రభుత్వం మద్యం ధరలను మరింత పెంచింది. అయినా రష్ ఆగట్లేదు. అన్ని షాపులూ హౌస్ ఫుల్లే. అలాంటిది ఆ షాపు మాత్రం ఖాళీగా ఉంది. కస్టమర్లే లేదు. మందుబాటిళ్లు ముందు పెట్టినా... మద్యం కావాలని ముందుకు ఒక్కరూ రావట్లేదు.

  అనంతపురం జిల్లాలోని మడకశిరలో ఈ చిత్రమైన పరిస్థితి ఉంది. మద్యం షాపు తెరిచిన ఓనర్... ఎవరైనా కొనేందుకు వస్తే బాగుండని... నీటి చుక్క కోసం రైతు ఆకాశం వైపు చూసినట్లు చూస్తున్నాడు. అయినా జనం రావట్లేదే. జనం లేక మందు షాపులో నిండా మద్యం బాటిళ్లు ఉన్నా... కళ కనిపించట్లేదు. కనీసం కిరాణా షాపుకి వచ్చేంత మంది కూడా రావట్లేదు. "ఛీ... జీవితం" అని షాప్ యజమాని అనుకునేంత పరిస్థితి వచ్చేస్తోంది. వర్షాకాలంలో కూడా అప్పుడప్పుడూ కురిసే వానల్లాగా... ఎప్పుడో ఒకసారి ఓ కస్టమర్ వచ్చి... ఓ చిన్న కోటర్ బాటిల్ కొనుక్కెళ్తుంటే... అదే పదివేలు అన్నట్లు ఫీలవ్వాల్సి వస్తోంది యజమానికి.

  అసలీ పరిస్థితి ఎందుకొచ్చిందంటే... ఈ షాపు ఏపీ, కర్ణాటక సరిహద్దులో... ఏపీలో ఉండటం వల్లే. ఏపీలో ధరలు అడ్డంగా పెంచేశారు కదా... దాంతో మందుబాబులు... ఒక్క అడుగు కర్ణాటక వైపుగా వేసి... ఆ సరిహద్దుల్లో ఉండే వైన్ షాపుకి వెళ్లి... మద్యం కొనుక్కొని... మళ్లీ ఏపీలోకి వచ్చి... గటగటా తాగుతున్నారు. అది చూస్తున్న మడకశిర షాపు యజమానికి మనసు చివుక్కుమంటోంది. సరిహద్దుల్లో షాపు ఉండటమే నేరమా అన్నట్లుగా ఫీలవుతున్నట్లు కనిపిస్తోంది ఆయన ఫేస్ చూస్తుంటే.

  నిజానికి కర్ణాటకలో సరిహద్దు వైన్ షాపు పక్కనే ఏమీ లేదు. దాదాపు 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడకు వెళ్లి, రావడానికి 20 కిలోమీటర్లకు పెట్రోల్ ఖర్చవుతుంది కూడా. అయినప్పటికీ అక్కడికే ఎందుకు వెళ్తున్నారంటే... పెట్రోల్ ఖర్చులను కూడా కలిపినా... కర్ణాటకలో మద్యం ధరే తక్కువగా ఉందట. పైగా అక్కడ ఎక్కువ బ్రాండ్లు, భారీ ఆఫర్లు కూడా ఉన్నాయట. "ఏ రాష్ట్రంలోనైతేనేం... అదే మద్యం, అదే కిక్కు... మనక్కావలసింది మనీ మిగలడమే" అనుకుంటూ లిక్కర్ లవర్స్... బాటిల్ దించేస్తున్నారు. అందుకే ఈ షాపు... "ఓ కాలమా.. ఇది నీ గాలమా"... అని పాటేసుకుంటోంది.

  Published by:Krishna Kumar N
  First published:

  Tags: Coronavirus, Covid-19

  ఉత్తమ కథలు