news18-telugu
Updated: April 26, 2020, 9:55 AM IST
ఒకసారి కరోనా సోకితే... మళ్లీ సోకే ప్రమాదం : WHO (credit - twitter - Goverdhan Dutt Puri)
Corona Lockdown | Corona Update : ప్రపంచవ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య 2 లక్షలు దాటేయడంతో... ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఓ ప్రకటన చేసింది. ఒకసారి కరోనా సోకి... రికవరీ అయిన వారు... ఇక తమకు కరోనా సోకదని అనుకోవడానికి వీల్లేదనీ... మళ్లీ సోకే ప్రమాదం ఉందని హెచ్చరించింది. కరోనా నుంచి నయమైనవారికి మళ్లీ కరోనా సోకదు అనేందుకు ఆధారాలు లేవని తెలిసింది. ఇప్పటివరకూ... ఎవరైనా సరే... ఓసారి వైరస్ బారిన పడి కోలుకున్న తర్వాత... మళ్లీ కొన్ని నెలల పాటూ... ఆ వైరస్ వారిపై మరోసారి దాడి చెయ్యలేదన్న నమ్మకం ఉంది. అందువల్ల... కరోనా వైరస్ నుంచి కోలుకున్నవారు... మళ్లీ తమకు ఆ వైరస్ రాదులే అనే కాన్ఫిడెన్స్‌తో ఉండేవాళ్లు. ఇప్పుడు WHO ప్రకటనతో... వారు కూడా ఆందోళన చెందే పరిస్థితి.
ఏదైనా వైరస్ దాడి చేసినప్పడు... మన శరీరంలోని యాంటీ బాడీస్... ఆ వైరస్‌ని ఎదుర్కోవడానికి మరింత బలంగా రూపాంతరం చెందుతాయి. అందువల్ల అవి వైరస్‌పై విజయం సాధించి... వైరస్‌ను తరిమేస్తాయి. ఆ తర్వాత మళ్లీ ఆ వైరస్ వచ్చినా... దాన్ని ఎదుర్కొనేంత శక్తిసామర్ధ్యాలు యాంటీ బాడీస్‌కి ఉంటాయి కాబట్టి... ఇక ఆ వైరస్ రెండోసారి రాదు అనే నమ్మకంతో ఉన్నారు ప్రజలు. చైనా శాస్త్రవేత్తలు కూడా ఇదే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.
WHO మాత్రం... నయమైన వారికి కూడా మళ్లీ కరోనా సోకే ప్రమాదం ఉందని అంటోంది. కరోనా నుంచి బయటపడిన వారు తమకు మళ్లీ రాదనే ఉద్దేశంతో... ఫ్రీగా బయట తిరగడం మంచిది కాదంటోంది WHO. బాడీలోని యాంటీబాడీస్... కరోనాను రెండోసారి ఎదుర్కోగలవనేందుకు శాస్త్రీయమైన (సైంటిఫిక్) ఆధారాలు లేవంది.
తమ దేశంలో ఎవరికీ కరోనా రెండోసారి సోకలేదని చైనా చెబుతుంటే... తమ దేశంలో అలాంటి కేసులు 2 శాతం ఉన్నాయని దక్షిణ కొరియా తెలిపింది. ఐతే... చైనా అబద్ధం చెబుతోందని కనీసం 5 నుంచి 10 శాతం అలాంటి కేసులుంటాయనే వాదన కూడా ఉంది.
ఓవరాల్‌గా ఏంటంటే... కరోనా సోకి తగ్గినా, సోకకపోయినా... ఎవరైనా సరే... సోషల్ డిస్టాన్స్ మెయింటేన్ చెయ్యడమే మేలు. తద్వారా కరోనా సోకే (మళ్లీ సోకే) అవకాశాల్ని తగ్గించొచ్చు.
Published by:
Krishna Kumar N
First published:
April 26, 2020, 9:54 AM IST