న్యూయార్క్‌ టాప్ డాక్టర్ ఆత్మహత్య... కరోనాపై పోరాడీ పోరాడీ...

Corona Lockdown | Corona Update : మాన్‌హట్టన్‌ ఆస్పత్రిలో... ఎమర్జెన్సీ రూంలో కరోనా పేషెంట్లకు సేవలు చేస్తున్న ఆమె... సూసైడ్ చేసుకున్నట్లు తెలిసింది.

news18-telugu
Updated: April 29, 2020, 10:28 AM IST
న్యూయార్క్‌ టాప్ డాక్టర్ ఆత్మహత్య... కరోనాపై పోరాడీ పోరాడీ...
న్యూయార్క్‌ టాప్ డాక్టర్ ఆత్మహత్య... కరోనాపై పోరాడీ పోరాడీ... (credit - Facebook)
  • Share this:
Corona Lockdown | Corona Update : పేషెంట్లకు ధైర్యం చెప్పి... ప్రాణం పోసేది డాక్టర్లే. అలాంటిది... ఆ డాక్టర్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారన్నది ఆశ్చర్యకర అంశం. డాక్టర్ లోర్నా ఎం బ్రీన్... న్యూయార్క్‌-ప్రెస్బిటేరియన్ ఎల్లెన్ హాస్పిటల్‌ ఎమర్జెన్సీ వార్డులో మెడికల్ డైరెక్టర్. చార్లొట్టేస్‌విల్లేలో చనిపోయారు. న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం... బ్రీన్ తండ్రి డాక్టర్ ఫిలిప్ బ్రీన్ ఏమన్నారంటే... రోజూ కరోనా వైరస్ పేషెంట్లకు ట్రీట్‌మెంట్ చేస్తున్నప్పుడు ఆ దారుణ దృశ్యాలు చూసీ చూసీ... భరించలేక ఆమె ఆత్మహత్య చేసుకుందని అన్నారు. కరోనాపై ఫ్రంట్‌లైన్‌లో ఉండి పోరాడిన ఆమె... చివరకు తన ప్రాణాలే తీసుకున్నారని అన్నారు.

న్యూయార్క్‌లో కరోనా పేషెంట్లకు ట్రీట్‌మెంట్ చేస్తున్నప్పుడు బ్రీన్‌కి కూడా కరోనా సోకింది. 49 ఏళ్ల ఆమె త్వరగానే కోలుకున్నారు. మళ్లీ డ్యూటీలో దిగి... పేషెంట్లకు వైద్యం చేయసాగారు. కానీ... రోజూ వస్తున్న రకరకాల కరోనా పేషెంట్లు, అంబులెన్సుల్లో దయనీయ దృశ్యాలు, రోగుల బంధువులు పడుతున్న బాధలు, ICUలో పేషెంట్లకు వ్యాధి తీవ్రమై... జుగుప్సాకరంగా మారే దారుణ దృశ్యాల్ని చూసీ చూసీ ఆమె తట్టుకోలేకపోయింది. ఏకంగా జీవితంపైనే విరక్తి చెందిందని అంటున్నారు.

బ్రీన్ ఎమర్జెన్సీ డిపార్ట్‌మెంట్‌లో అహరహం పనిచేశారనీ, ఆమె సేవల్ని ఎప్పటికీ మర్చిపోలేమనీ న్యూయార్క్‌-ప్రెస్బిటేరియన్ ఎల్లెన్ హాస్పిటల్‌ వర్గాలు తెలిపాయి.

ప్రస్తుతం న్యూయార్క్‌లో 3 లక్షలకు పైగా కేసులున్నాయి. ఇప్పుడు అక్కడ ప్రతి నలుగురిలో ఒకరికి కరోనా ఉంది. ఆస్పత్రులు ఖాళీ లేక... చాలా మందికి ఇళ్లలోనే ట్రీట్‌మెంట్ చేస్తున్నారు. ఆమెరికాలో మొత్తం కేసుల సంఖ్య 10 లక్షలు దాటేసింది.
Published by: Krishna Kumar N
First published: April 29, 2020, 10:28 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading