ఇండియాలో మరో 15వేల కేసులు... గోవాలో తొలి కరోనా మరణం...

Corona Lockdown | Corona Update : భారత్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఇది ఎక్కడి దాకా వెళ్తుందో అంచనాకు అందట్లేదు.

news18-telugu
Updated: June 22, 2020, 10:13 AM IST
ఇండియాలో మరో 15వేల కేసులు... గోవాలో తొలి కరోనా మరణం...
ఇండియాలో మరో 15వేల కేసులు... గోవాలో తొలి కరోనా మరణం... (credit - NIAID)
  • Share this:
Corona Lockdown | Corona Update : ఇండియాలో గత 24 గంటల్లో కొత్తగా మరో 14821 కరోనా కేసులు నమోదయ్యాయి. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 425282కి పెరిగింది. నిన్న ఒక్క రోజే... 445 మంది చనిపోవడంతో... మొత్తం మరణాల సంఖ్య 13699కి పెరిగింది. ఐతే... రికవరీల రేటు కాస్త పెరిగింది. తాజాగా... 9440 మంది రికవరీ అవ్వడంతో... మొత్తం రికవరీ కేసుల సంఖ్య 237195గా మారింది. ప్రస్తుతం రికవరీ రేటు 55.8 శాతంగా ఉంది. రెండు వారాలుగా ఈ రేటు పెరుగుతూ ఉండటం కాస్త ఉపశమన అంశం. ఇండియాలో ప్రస్తుతం 174387 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మొత్తం కరోనా పాజిటివ్ కేసుల్లో ఇండియా ప్రస్తుతం 4వ స్థానంలో ఉంది.

ఇప్పటివరకూ ఒక్క మరణమూ లేని గోవాలో... తొలిసారిగా ఓ కరోనా మరణం సంభవించింది. ఆ రాష్ట్రంలో ప్రస్తుతం... 754 పాజిటివ్ కేసులు ఉండగా... వాటిలో... 129 మంది రికవరీ అయ్యారు. ప్రస్తుతం మహారాష్ట్రలో అత్యధికంగా 132075 పాజిటివ్ కేసులున్నాయి. ఆ తర్వాత ఢిల్లీలో 59746 కేసులు, తమిళనాడులో... 59377 కేసులు, గుజరాత్‌లో 27260 కేసులు, రాజస్థాన్ 14930, బెంగాల్ 13945, మధ్యప్రదేశ్ 11903, హర్యానా 10635 కేసులతో టాప్ 8లో ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లో కరోనా కంట్రోల్‌పై కేంద్ర ప్రభుత్వం ఎక్కువ ఫోకస్ పెడుతోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణాల రేటు... 9 శాతంగా ఉండగా... ఇండియాలో అది 3.2 శాతంగా ఉంది.

ఇండియాలో కరోనా కేసుల వివరాలు


ప్రపంచ దేశాల్లో కరోనా కేసుల వివరాలు
First published: June 22, 2020, 10:05 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading