చైనాకి షాక్... కరోనా లెక్కలపై... అంతర్జాతీయ కోర్టులో కేసు పెట్టిన భారతీయుడు..

Corona Lockdown | Corona Update : చైనా తప్పుడు లెక్కలు చెప్పడం వల్ల ప్రపంచ దేశాలన్నీ కరోనా వైరస్‌ను తక్కువ అంచనా వేసి.. చిక్కుల్లో పడ్డాయి.

news18-telugu
Updated: April 19, 2020, 9:51 AM IST
చైనాకి షాక్... కరోనా లెక్కలపై... అంతర్జాతీయ కోర్టులో కేసు పెట్టిన భారతీయుడు..
చైనాకి షాక్... కరోనా లెక్కలపై... అంతర్జాతీయ కోర్టులో కేసు పెట్టిన భారతీయుడు.. (File)
  • Share this:
Corona Lockdown | Corona Update : కరోనా వైరస్ ద్వారా చైనా తన కొంప ముంచుకోవడమే కాదు... ప్రపంచ దేశాల్నీ ముంచేసింది. కరోనా వైరస్ మృతుల లెక్కల్ని 50 శాతం తక్కువగా చూపించి... ప్రపంచ దేశాలకు ఆ వైరస్‌పై తక్కువ అంచనా ఏర్పడేలా చేసింది. దాని ఫలితంగా... ఆయా దేశాలు... ఆ వైరస్‌ని లైట్ తీసుకొని... ముందుగా జాగ్రత్తలు చేపట్టలేదు. తీరా వైరస్ తమ దేశాల్లోకి వచ్చాక... దాని విశ్వరూపం చూసి... షాకయ్యాయి. ఇలా యూరప్ దేశాలు, అమెరికా... అడ్డంగా బుక్కయ్యాయి. ఇండియా ముందుగానే మేల్కొన్నా... అంతర్జాతీయ విమాన సర్వీసులపై ఓ వారం ఆలస్యంగా నిషేధం విధించింది. ఐతే... అప్పటికే చాలా మంది విదేశీయులు భారత్ వచ్చారు. వారి వల్ల ఇండియాలో కరోనా వైరస్ చాలా రాష్ట్రాల్లో వ్యాపించిన విషయం మనకు తెలుసు.

ఈ మొత్తం ఘోరం జరగడానికి చైనా ఇచ్చిన తప్పుడు లెక్కలే కారణం కాబట్టి... ఇదే విషయాన్ని లేవనెత్తుతూ.... ముంబైకి చెందిన లాయర్ ఆశిష్ సొహానీ... అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ICC)లో చైనాకి వ్యతిరేకంగా కేసు పెట్టారు. చైనా తన దేశంలో వచ్చిన కరోనా వైరస్‌ని కంట్రోల్ చెయ్యకపోగా... ఆ వైరస్ ప్రపంచ దేశాలకు పాకేలా చేసిందని తన పిటిషన్‌లో తెలిపారు. మొత్తం 33 పేజీల పిటిషన్‌లో.... భారత్‌కి చైనా వల్ల జరిగిన నష్టానికి... చైనా... రూ.190 లక్షల కోట్లు పరిహారంగా చెల్లించాలని డిమాండ్ చేశారు.

నిజానికి తమ దేశంలో కరోనా కేసులు బయటపడినప్పటి నుంచి చైనా... ప్రపంచ దేశాలకు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తూనే ఉంది. డిసెంబర్ 21న తమ దేశంలో నిమోనియా లాంటి వ్యాధి ఒకటి వుహాన్ నగరంలో ప్రబలుతోందని తెలిపింది. అలాగే... కరోనా వైరస్ ఎలా ఉంది, దాని జన్యు క్రమం ఏంటి? ఎలా వ్యాపిస్తోంది? ఇలా ఎంతో సమాచారాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థకు అందించింది. ఐతే... వాస్తవాల్ని దాచేసి... వైరస్ ప్రభావాన్ని తక్కువ చేసి చూపిందనే వాదన అమెరికా సహా చాలా దేశాల నుంచి వస్తోంది. చైనా చేసిన కుట్ర వల్లే ప్రపంచ వ్యాప్తంగా ఇంత మంది ప్రాణాలు పోతున్నాయన్న ముంబై లాయర్... ఇందుకు చైనాకి శిక్ష పడి తీరాల్సిందే తన పిటిషన్‌లో తెలిపారు.

ముంబై లాయర్ ఏమంటున్నారంటే... వుహాన్ లోని... వెట్ మార్కెట్స్ నుంచి కరోనా వైరస్ వ్యాప్తి జరిగింది కాబట్టి......
- అసలా మార్కెట్లు అంత దరిద్రంగా ఉంటుంటే... చైనా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదు?
- అక్కడ రకరకాల జంతువుల్ని కలిపి బోన్లలో బంధిస్తుంటే చైనా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదు?
- అక్కడ చట్ట వ్యతిరేకంగా వన్యప్రాణుల్ని అమ్ముతుంటే ఎందుకు అరెస్టులు చెయ్యలేదు?- అక్కడ బతికున్న వన్యప్రాణుల్ని నరికి, పచ్చిగానే అమ్ముకూ, పచ్చిగానే తింటుంటే... ఎందుకు చైనా ప్రభుత్వం ఊరుకుంది?
- ఆలుగులు (pangolins), కుక్కలు, గబ్బిలాలు, పాములు, సివెట్స్, వంటి జంతువుల్ని ఇతర రెగ్యులర్ మాంసాలతో అమ్ముతుంటే చైనా ఎందుకు నిర్లక్ష్యం చేసింది?

చైనా నిర్లక్ష్యం వల్లే కరోనా వైరస్ వచ్చింది కాబట్టి... చైనాపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పాలని లాయర్ డిమాండ్ చేశారు. వెట్ మార్కెట్ వల్లే కరోనా వైరస్ వ్యాపించింది కాబట్టే చైనా... జనవరి 1, 2020న ఆ మార్కెట్‌ను మూసివేసిన విషయాన్ని కూడా ప్రస్తావించారు ఆ లాయర్. మరి అంతర్జాతీయ కోర్టు దీనిపై ఎలా స్పందిస్తుందో త్వరలో తెలుస్తుంది.
Published by: Krishna Kumar N
First published: April 19, 2020, 9:51 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading