Corona Lockdown | Coronaupdate : లాక్‌డౌన్ కారణంగా పేదలు ఇబ్బంది పడకుండా... అన్ని జన్‌ధన్ ఖాతాల్లో నెలకు రూ.500 చొప్పున మూడు నెలలపాటూ జమ చేస్తామని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం తొలి రూ.500 ఇవాళ జమ చేసింది. దాంతో... బ్యాంకుల్లో జన్‌ధన్ ఖాతాదారుల అకౌంట్లలోకి రూ.500 జమ అవుతున్నాయి. ఇందుకు సంబంధించి లబ్దిదారుల ఫోన్లకు మెసేజ్‌లు వస్తున్నాయి. దాంతో... డబ్బు డ్రా చేసుకునేందుకు చాలా మంది తమకు దగ్గర్లోని బ్యాంకులకు వెళ్తున్నారు. ATM కార్డులతో కూడా డబ్బు విత్ డ్రా చేసుకునే ఛాన్స్ ఉన్నా... చాలా మంది ATM కార్డు వాడటం రాని వారున్నారు. వారంతా బ్యాంకులకే వెళ్లి మనీ తీసుకుంటున్నారు.
ఒకేసారి మనీ డిపాజిట్ అవుతుండటంతో... ప్రజలు పెద్ద సంఖ్యలో బ్యాంకులకు వెళ్తున్నారు. అక్కడ అంత మందిని సోషల్ డిస్టాన్స్ మెయింటేన్ చెయ్యమని చెప్పడం బ్యాంక్ అధికారుల వల్ల కావట్లేదు. ఇలా డిపాజిట్ అయిన మనీ... ఎక్కడికీ పోదు... అకౌంట్‌లోనే ఉంటుంది. ఆ విషయం ఖాతాదారులకు కూడా తెలుసు. కాకపోతే... చేతిలో డబ్బు లేకపోవడం, కంటిన్యూగా రెండు వారాలకుపైగా లాక్‌డౌన్ ఉండటంతో... వారు డబ్బు కోసం బ్యాంకులకు వెళ్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: AP News, Coronavirus, Covid-19, Pradhan Mantri Jan Dhan Yojana