ఫాస్ట్ ట్రాక్ డిజైన్‌తో రాబోతున్న mRNA-1273 కరోనా వ్యాక్సిన్... ఏంటి దీని అర్థం?

Corona Lockdown | Corona Update : ప్రపంచంలో కరోనాకి చాలా వ్యాక్సిన్లు తయారవుతుంటే... mRNA-1273 ముందు వరుసలో ఉంది.

news18-telugu
Updated: May 13, 2020, 10:25 AM IST
ఫాస్ట్ ట్రాక్ డిజైన్‌తో రాబోతున్న mRNA-1273 కరోనా వ్యాక్సిన్... ఏంటి దీని అర్థం?
ఫాస్ట్ ట్రాక్ డిజైన్‌తో రాబోతున్న mRNA-1273 కరోనా వ్యాక్సిన్... (credit - twitter - PharmaShots)
  • Share this:
Corona Lockdown | Corona Update : కొన్ని పేర్లు గుర్తు పెట్టుకోవడం కష్టం... mRNA-1273 వ్యాక్సిన్ పేరు అలాంటిదే. కానీ... దీన్ని మోడెర్నా వ్యాక్సిన్ అని పిలుచుకోవడం తేలిగ్గా ఉంటుంది. అమెరికాలోని బయోటెక్నాలజీ కంపెనీ మోడెర్నా థెరాప్యూటిక్స్ ఈ వ్యాక్సిన్ తయారుచేస్తోంది. తాజాగా దీనికి అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) నుంచి ఫాస్ట్ ట్రాక్ అనుమతి పొందింది. కేంబ్రిడ్జిలోని ఈ కంపెనీ... తమ mRNA వ్యాక్సిన్ డిజైన్‌ను FDA ఒప్పుకుందని తెలిపింది. ఇంతకు ముందు ఈ కంపెనీ... ఫేజ్ 2 ట్రయల్స్ జరిపేందుకు FDA పర్మిషన్ ఇచ్చింది.

త్వరలోనే రెండో దశ పరీక్షలు జరగనున్నాయి. ఇందులో 600 మంది వ్యక్తులపై వ్యాక్సిన్ ఇచ్చి... ఎలా పనిచేస్తుందో తెలుసుకుంటారు. ఈ దశలో... వ్యాక్సిన్ ఎంత వరకూ వాళ్లకు రక్షణ కల్పించగలుగుతోంది? వ్యాక్సిన్ ఇచ్చిన తర్వా బాడీ రియాక్షన్ ఎలా ఉంది? వ్యాక్సిన్ వల్ల బాడీలో వ్యాధి నిరోధక శక్తి ఎంత వరకు పెరిగింది? వంటివి తెలుసుకుంటారు. మొత్తం 28 రోజుల్లో రెండుసార్లు డోసులు ఇస్తారు. ఇక మూడో ట్రయల్‌కి సంబంధించిన అనుమతులు పొందేందుకు రెడీ అవుతున్న కంపెనీ... రెండు నెలల్లో అది కూడా ప్రారంభించే అవకాశాలున్నాయి.

ఫాస్ట్ ట్రాక్ డిజైన్ అంటే :
సాధారణంగా వ్యాక్సిన్ తయారీకి ఏళ్లు పడుతుంది. కానీ కరోనా వ్యాక్సిన్ త్వరగా తయారవ్వాలి కాబట్టి... చాలా ఫార్మాలిటీలు పక్కన పెట్టాల్సి ఉంటుంది. అందుకు FDA ఫాస్ట్ ట్రాక్ డిజైన్ పర్మిషన్ తప్పనిసరి. ఆ ఛాన్స్ మోడెర్నా కంపెనీకి లభించింది.

mRNA-1273 వ్యాక్సిన్ ఎలా పనిచేస్తుంది? :
ఇది వైరస్‌లోని mRNA ఆధారంగా పనిచేస్తుంది. పరిశోధకులు ఈ వ్యాక్సిన్ ఇవ్వడం ద్వారా... వ్యక్తి శరీరంలోకి... ప్రత్యేకంగా తయారుచేసిన మెసెంజర్ RNA (జన్యు పదార్ధం)ను ప్రవేశపెడతారు. ఇది వైరల్ ప్రోటీన్ లేదా యాంటీజెన్‌ను ఉత్పత్తి చేస్తుంది. అది మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని ప్రేరేపిస్తుంది. ఫలితంగా... యాంటీబాడీలు ఉత్పత్తి అవుతాయి. అవి కరోనా వైరస్ చుట్టూ ఉండే ముళ్లలాంటి ప్రోటీన్‌ను గుర్తిస్తాయి. దాన్ని నాశనం చేస్తాయి. ఈ ముళ్లలాంటి ప్రోటీన్‌ను నాశనం చేస్తే... కరోనా వైరస్ చచ్చిపోతుంది. ఈ ముళ్లలాంటి ప్రోటీన్‌ ఉండటం వల్లే... ఈ వైరస్... మనుషుల కణాల్లోకి చొచ్చుకొని వెళ్లగలుగుతుంది. ట్రయల్స్ సక్సెస్ అయి... కరోనా చస్తే... అందరికీ ఆనందమే.
Published by: Krishna Kumar N
First published: May 13, 2020, 10:25 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading