కరోనా ఎఫెక్ట్... డాక్టర్‌గా మారిన మిస్ ఇంగ్లండ్ భాషా ముఖర్జీ...

Corona Lockdown | Coronaupdate : ప్రపంచంలో భారతీయులు ఎక్కడున్నా సేవా తత్వాన్ని చాటుతారు. భాషా ముఖర్జీ ద్వారా అది మరోసారి రుజువైంది. మంచి స్టోరీ తెలుసుకుందాం.

news18-telugu
Updated: April 8, 2020, 12:15 PM IST
కరోనా ఎఫెక్ట్... డాక్టర్‌గా మారిన మిస్ ఇంగ్లండ్ భాషా ముఖర్జీ...
కరోనా ఎఫెక్ట్... డాక్టర్‌గా మారిన మిస్ ఇంగ్లండ్ భాషా ముఖర్జీ... (credit - insta - bhasha05)
  • Share this:
Corona Lockdown | Coronaupdate : కోల్‌కతాలో పుట్టిన భాషా ముఖర్జీ... గతేడాది ఆగస్టులో... మిస్ ఇంగ్లండ్ టైటిల్ గెలుచుకుంది. అప్పటికే మెడికల్ కెరీర్‌లో సాగుతున్న ఆమె... తనకు ఇచ్చిన గౌరవాన్ని నిలబెట్టుకోవాలన్న ఉద్దేశంతో... మెడికల్ కెరీర్‌కి బ్రేక్ ఇచ్చి... చారిటీ వర్క్ (సేవా కార్యక్రమాలు)లో పడిపోయింది. ఐతే... ఇప్పుడు కరోనా వైరస్ ఇంగ్లండ్‌లో బాగా ఎక్కువైంది కదా... దాంతో... చారిటీకి బ్రేక్ ఇచ్చి... తిరిగి వైద్య వృత్తిని కొనసాగించాలని డిసైడైంది. ఇటీవల హ్యుమానిటేరియన్ ట్రిప్ (సేవా కార్యక్రమం)లో భాగంగా ఇండియా వచ్చిన ఆమె... తిరిగి ఇంగ్లండ్ వెళ్లిపోయి... వెంటనే డాక్టర్ అయిపోయింది.... కరోనా వైరస్ పేషెంట్లకు సేవలు అందించబోతోంది.
భాషా ముఖర్జీ వయసు 24 ఏళ్లు. చిన్న వయసులోనే ఆఫ్రికా, టర్కీ, భారత్ దేశాల్లో పర్యటించి సేవలు అందించాల్సి వచ్చింది. ఇండియా తర్వాత చాలా దేశాల్లో పర్యటించాల్సి ఉంది. కానీ తాను ఇప్పుడు ఉండాల్సింది ప్రజల మధ్య కాదనీ... ఆస్పత్రిలో పేషెంట్లతో అనీ తనకు తానే అనుకొని... ఇంగ్లండ్ వెళ్లిపోయింది.ముఖర్జీ ఇండియాలో నాలుగు నెలలు ఉంది. ఆమె ఇండియాకి వచ్చిన కొత్తలో... మార్చిలో... ఇంగ్లండ్‌లో కరోనా వైరస్ మొదలైంది. దాదాపు నెల పాటూ... అక్కడి పరిస్థితులేవీ ఆమెకు చెప్పలేదు డాక్టర్లు. ఐతే... ముఖర్జీ మన ఇండియన్ మీడియాలో వార్తలు చూసి... తూర్పు ఇంగ్లండ్‌లోని బోస్టన్‌లో ఉన్న పిల్‌గ్రిమ్ ఆస్పత్రిలో తన కొలీగ్స్ (సహచరులు)కి కాల్ చేసి... విషయం అడిగింది. అప్పటివరకూ సైలెంట్‌గా ఉన్న వాళ్లు... ఒక్కసారిగా ప్రవాహంలా తమ బాధలు, పరిస్థితుల్ని చెప్పుకున్నారు. అంతే... అవి విన్న తర్వాత ముఖర్జీకి ఇక ఇండియాలో ఉండబుద్ధి కాలేదు. ఓవైపు ఇంగ్లండ్ బాధల్లో ఉంటే... తాను మిస్ ఇంగ్లండ్ టైటిల్ పెట్టుకొని... ప్రపంచ దేశాలు తిరగడం కరెక్టు కాదనుకుంది. తన కొలీగ్స్ నిరంతరం శ్రమిస్తుంటే... తానూ అందులో భాగం కావాలనుకుంది. బుధవారం ఆమె యూరప్ వెళ్లింది. అక్కడ ఆమెను రెండు వారాలు ఐసొలేషన్‌లో ఉంచబోతున్నారు. ఆ తర్వాత ఆమె డాక్టర్‌గా పిల్‌గ్రిమ్ ఆస్పత్రిలో సేవలు అందించనుంది.

ప్రస్తుతం ఇంగ్లండ్‌లో 55,242 కరోనా పాజిటివ్ కేసులు ఉండగా... 6,159 మంది ఇప్పటివరకూ చనిపోయారు.
First published: April 8, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading