తీర్థం పంపిణీ యంత్రం... కరోనా దృష్ట్యా టచ్ చెయ్యకుండా గుడిలో తీర్థం పంపిణీ...

తీర్థం పంపిణీ యంత్రం... కరోనా దృష్ట్యా టచ్ చెయ్యకుండా గుడిలో తీర్థం పంపిణీ...

తీర్థం పంపిణీ యంత్రం... కరోనా దృష్ట్యా టచ్ చెయ్యకుండా గుడిలో తీర్థం పంపిణీ... (credit - twitter - ANI)

Corona Lockdown | Corona Update : మనసుంటే మార్గం ఉంటుంది అంటారు కదా... అది నిజమే. భక్తులకు ఎలాగైనా తీర్థం ఇవ్వాలనే ఆలోచనతో... ఇదిగో ఈ కొత్త యంత్రం తయారుచేశారు. గ్రేట్.

 • Share this:
  Corona Lockdown | Corona Update : మన దేశంలో అన్‌లాక్ -1 కొనసాగుతోంది. నెలాఖరున అన్‌లాక్-2 రాబోతోంది. వన్‌లో భాగంగా... ఆలయాలను తెరవచ్చింది కేంద్రం. ఐతే... తీర్థ ప్రసాదాలు పంచడానికి వీల్లేదనే కండీషన్ పెట్టింది. అలాగే... గుళ్లో గంట కొట్టొద్దని చెప్పింది. ఈమధ్య గంట కొట్టేందుకు... ప్రత్యేక సెన్సార్లను తయారుచేశారు. తద్వారా భక్తులు గంట దగ్గరకు వెళ్లగానే... గంట ఆటోమేటిక్‌గా కొట్టేసుకుంటోంది. అలాగే ఇప్పుడు ఆటోమేటిక్‌గా తీర్థం పంచే యంత్రం కూడా తయారుచేశారు. ఇప్పుడీ యంత్రం కర్ణాటక, మంగుళూరులోని ఆలయాల్లో మీకు కనిపిస్తుంది.

  దీన్ని తీర్థ డిస్పెన్సర్ (తీర్థ పంపిణీ యంత్రం) అంటున్నారు. సెన్సార్ టెక్నాలజీతో ఇది పనిచేస్తుంది. ఇక్కడి యంత్రం దగ్గర చెయ్యి పెట్టాలి. ఆటోమేటిక్‌గా సెన్సార్లు గుర్తిస్తాయి. ఓకే... అనుకుంటూ.... కొద్దిగా తీర్థాన్ని చేతిలో యంత్రం పోస్తుంది. అంతే... దాన్ని తాగేయడమే. పూజారులు పోసే తీర్థాన్ని ఇప్పుడీ యంత్రం పోస్తోందన్నమాట. ఏ చేతిలోనైనా ఈ యంత్రం నుంచి వచ్చే తీర్థం సమానంగా ఉంటుంది. మరికాస్త కావాలనుకుంటే... వెళ్లి చెయ్యి కడుక్కొని... మళ్లీ వచ్చి అడగడమే. బాగుంది కదా...


  అసిస్టెంట్ ప్రొఫెసర్ సంతోష్ దీన్ని తయారుచేశారు. ఇందుకోసం ఆయనకు రూ.2700 ఖర్చైంది. వెంటనే మంగుళూరులోని ఆలయాలన్నీ తమకు కూడా తయారుచేయాలని కోరాయి. మున్ముందు దేశం మొత్తం ఇలాంటివి వచ్చినా ఆశ్చర్యం అక్కర్లేదు. కరోనా కాలం మరి...
  First published:

  అగ్ర కథనాలు