కేంద్రానికి షాక్... ఆరోగ్య సేతు యాప్‌పై సంచలన ప్రకటన చేసిన జస్టిస్ శ్రీకృష్ణ...

కేంద్రానికి షాక్... ఆరోగ్య సేతు యాప్‌పై సంచలన ప్రకటన చేసిన జస్టిస్ శ్రీకృష్ణ... (File)

Corona Lockdown | Corona Update : కేంద్రమేమో... ఆరోగ్య సేతు యాప్ తప్పనిసరిగా వాడాల్సిందే అంటోంది. అలా ఎలా అంటారని ప్రశ్నిస్తున్నారు జస్టిస్ శ్రీకృష్ణ.

 • Share this:
  Corona Lockdown | Corona Update : కరోనా వైరస్‌ని కంట్రోల్ చేస్తుందంటూ... కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య సేతు యాప్‌పై బోలెడంత ప్రచారం చేస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సహా కేంద్ర పెద్దలంతా... ఈ యాప్ తప్పనిసరిగా మొబైల్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవాల్సిందేనని చెబుతున్నారు. రైళ్లలో వచ్చే వలస కూలీలు, విమానాల్లో వచ్చే విదేశీ భారతీయులు అంతా ఈ యాప్ లేకుండా ఉండకూడదని కేంద్రం తాజా ఆదేశాలు కూడా జారీ చేసింది. అంతలా దీన్ని కేంద్రం సమర్థిస్తుంటే... సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ బీఎన్ శ్రీకృష్ణ మాత్రం... కేంద్రానికి షాక్ ఇచ్చారు. ఆరోగ్య సేతు యాప్ తప్పనిసరిగా వాడాలని కేంద్రం చెప్పడాన్ని చట్ట విరుద్ధం అన్నారు ఆయన. పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్ డ్రాఫ్ట్ రూపకల్పన కమిటీకి శ్రీకృష్ణ... ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్న సమయంలో... ఈ వ్యాఖ్య చేయడం దుమారం రేపుతోంది.

  చట్టంలోని ఏ సెక్షన్ ప్రకారం... ఆరోగ్య సేతు యాప్ తప్పనిసరి చేస్తున్నారని జస్టిస్ శ్రీకృష్ణ కేంద్రాన్ని ప్రశ్నించారు. ఇప్పటివరకూ ఏ చట్టమూ ఈ యాప్‌ని సమర్థించట్లేదని స్పష్టం చేశారు. లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ... మే 1న కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాల్లో ఆరోగ్య సేతు యాప్... ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగులంతా విధిగా ఇన్‌స్టాల్ చేసుకోవాలని కేంద్రం ఆదేశించింది. కంటైన్‌మెంట్ జోన్లలో... ఈ యాప్ 100 పనిచేస్తూ ఉండాలని తెలిపింది. జాతీయ విపత్తు నిర్వహణ చట్టం (NDMA) 2005 ప్రకారం... జాతీయ కార్యనిర్వహణ కమిటీ (NEC) ఈ మార్గదర్శకాన్ని జారీ చేసింది.

  నోయిడా పోలీసులు... మొబైళ్లలో ఆరోగ్య సేతు లేకపోతే... 6 నెలల జైలు శిక్ష, రూ.1000 దాకా ఫైన్ వేస్తామని చెప్పారు. ఇలా చెప్పడాన్ని చట్ట వ్యతిరేకం అన్న జస్టిస్ శ్రీకృష్ణ... ఈ దేశం ఇప్పటికీ ప్రజాస్వామ్య దేశమే అన్నారు. ఇలాంటి ఆదేశాల్ని కోర్టుల్లో సవాలు చెయ్యవచ్చని చెప్పారు.

  సోమవారం... ఆరోగ్య సేతు సమాచార వినియోగం, డేటా షేరింగ్ ప్రోటోకాల్‌ని కేంద్రం జారీ చేసింది. ఎవరైనా ఆరోగ్య సేతు యాప్‌లోని వ్యక్తుల సమాచారాన్ని దొంగిలించినా, షేర్ చేసినా చర్యలు తప్పవని తెలిపింది. ఐతే... జస్టిస్ శ్రీకృష్ణ మాత్రం కేంద్రం జారీ చేసిన ప్రోటోకాల్... డేటాకి పూర్తిస్థాయి రక్షణ ఇవ్వడానికి సరిపోదన్నారు.
  Published by:Krishna Kumar N
  First published: