బీచ్‌లో దెయ్యం... పర్యాటకులకు హడల్... ఎక్కడంటే...

బీచ్‌లో దెయ్యం... పర్యాటకులకు హడల్... ఎక్కడంటే... (credit - twitter)

Corona Lockdown | Corona Update : కరోనా వైరస్ టెన్షన్ వీడటంతో... ఆ బీచ్ తిరిగి తెరచుకుంది. కానీ... ఇప్పుడో దెయ్యం అక్కడకు వచ్చే వారిని వెంటాడుతోంది.

 • Share this:
  Corona Lockdown | Corona Update : అమెరికా... ఫ్లోరిడాలో ప్రజలు... ఇష్టమొచ్చినట్లు తిరుగుతున్నారు. బీచ్‌లకు వెళ్లి జల్సా చేస్తున్నారు. ఇలాగైతే కరోనా ఎక్కడ ఆగుతుంది అని అనుకున్న ఓ లాయర్... గ్రిమ్ రీపర్ (Grim Reaper) డ్రెస్ వేసుకొని... బీచ్‌లో తిరుగుతున్నాడు. సోషల్ డిస్టాన్స్ పాటించకపోయినా... మాస్క్ పెట్టుకోకపోయినా... కరోనా వైరస్ పట్టుకుపోతుందంటూ భయపెడుతున్నాడు (హెచ్చరిస్తున్నాడు). ఇలా బీచ్‌లను తిరిగి ఓపెన్ చెయ్యడంపై ఆ లాయర్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాడు. తన నిరసనను ఇలా గ్రిమ్ రీపర్ డ్రెస్సు వేసుకొని తెలుపుతున్నాడు.

  నిజమే మరి... మన దేశంలో రోజుకు 2 వేల కొత్త కేసులు వస్తుంటేనే మనం అన్నీ మూసుకొని ఇళ్లలో కూర్చుంటున్నాం... అలాంటిది అమెరికాలో మాత్రం రోజూ 30 వేల కొత్త కేసులొస్తున్నా... వాళ్లసలు పట్టించుకున్నట్లే కనిపించట్లేదు. ప్రపంచంలో ఏ దేశంలో కరోనా కంట్రోల్ కాకపోయినా... ఆ ప్రభావం ప్రపంచమంతా ఉంటుంది కాబట్టి... అమెరికన్ల నిర్లక్ష్యం... ప్రపంచానికే ప్రమాదం. అందుకే ఆ లాయర్... సమాజ హితాన్ని కోరుకుంటూ... ఈ వినూత్న నిరసన చేస్తున్నాడు. ఓ టీవీలో అతని నిరసన లైవ్ బ్రాడ్‌కాస్ట్ అయ్యింది.

  పేరు డేనియల్ అల్ఫెల్డర్... బీచ్‌లను తిరిగి తెరవడం... బుద్ధితక్కువ నిర్ణయంగా అతను తెలిపాడు. ఎన్నో ఏళ్లుగా బీచ్‌ల రక్షణ కోసం పోరాడుతున్నానన్న ఈ లాయర్... ఈసారి కరోనా నుంచి ప్రజల్ని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపాడు. ఇలా ప్రజలు నిర్లక్ష్యంగా ఉంటే... కరోనా వదిలిపోయే సమయం మరింత పెరిగిపోతుందని ఆందోళన వ్యక్తం చేశాడు.


  ప్రస్తుతం ఫ్లోరిడా రాష్ట్రంలో 35463 కరోనా కేసులున్నాయి. 1364 మంది చనిపోయారు. అయినా అక్కడి గవర్నర్ మాత్రం... కరోనాను లైట్ తీసుకుంటున్నారు. అదే ఇలాంటి బాధ్యత గల వారికి నచ్చట్లేదు.
  Published by:Krishna Kumar N
  First published: