కాణిపాకం ఆలయంలో భక్తులకు అనుమతిపై అధికారుల కసరత్తు...

కాణిపాకం ఆలయంలో భక్తులకు అనుమతిపై అధికారుల కసరత్తు... (File)

Corona Lockdown | Corona Update : ఎన్నాళ్లని దేవుడిని భక్తులకు దూరం చేసేది? 50 రోజులైనా కరోనా తగ్గింది లేదు. అందుకే ఆలయాలు తిరిగి తెరవబోతున్నారా?

 • Share this:
  Corona Lockdown | Corona Update : చిత్తూరు జిల్లాలోని ప్రపంచ ప్రసిద్ధ కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో భక్తులను తిరిగి అనుమతించే అంశంపై చర్చ జరుగుతోంది. లాక్‌డౌన్ 3... మే 17తో ముగుస్తుంది కాబట్టి... ఆ తర్వాత ఆలయంలోకి తిరిగి భక్తుల్ని అనుమతిస్తే ఎలా ఉంటుంది అనే అంశంపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఆలయంలోకి వచ్చే భక్తులు ముఖాలకు మాస్క్ పెట్టుకోవడం, చేతులకు హ్యాండ్ శానిటైజర్ రాసుకోవడం, క్యూలో తప్పనిసరిగా సోషల్ డిస్టాన్స్ పాటించడం, అలాగే పూజలు, ప్రసాదాలు, అన్నదానం ఇతరత్రా అంశాలపై విధి విధానాల్ని రెడీ చేస్తున్నారు అధికారులు.

  భక్తులు కంటిన్యూగా సోషల్ డిస్టాన్స్ గుర్తుంచుకునేలా... ప్రత్యేక బాక్సులపై పెయింటింగ్ వేసి అక్కడక్కడా ఏర్పాటు చెయ్యాలనుకుంటున్నారు అధికారులు. లాక్‌డౌన్ అమల్లో ఉన్నా. తిరుమలలో లాగానే... కాణిపాకంలో కూడా స్వామి వారికి నిత్య పూజలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం భక్తులను అనుమతించాక... రోజూ... పరిమిత సంఖ్యలో భక్తులను దర్శనానికి అనుమతించాలని అధికారులు రెడీ అవుతున్నారు.

  రాజకీయ రగడ :
  ఏపీ ప్రభుత్వం... దక్షిణ కొరియా నుంచి కొన్న కరోనా కిట్ల విషయంలో గోల్‌మాల్ జరిగిందని బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించడం, దానికి ఎంపీ విజయసాయి రెడ్డి ఘాటుగా కౌంటర్ ఇవ్వడం ఆమధ్య జరిగాయి. దాంతో కన్నా... కాణిపాకం స్వామి ముందు ప్రతిజ్ఞ చేసే దమ్ముందా అని విజయసాయిరెడ్డికి సవాల్ విసిరారు. దానికి ఎంపీ.... స్వామి ముందు సాష్టాంగ నమస్కారం చేసి మరీ చెప్పేంత దమ్ముందని కౌంటర్ ఇచ్చారు. సో... ఈ ప్రతిజ్ఞల అంశం పెండింగ్‌లో పడింది. ఆలయంలో భక్తుల్ని ఆహ్వానిస్తే... అప్పుడు వాళ్లిద్దరూ కాణిపాకం వెళ్లి... సవాళ్లను పూర్తి చేస్తారో... లేక ముగిసిన అధ్యాయం అని వదిలేస్తారో త్వరలో తెలుస్తుంది
  Published by:Krishna Kumar N
  First published: