అంతుచిక్కని కరోనా... ఎమర్జెన్సీని పొడిగించే ఆలోచనలో జపాన్...

Corona Lockdown | Corona Update : మొదట్లో కరోనా నుంచి తప్పించుకున్నట్లు కనిపించిన జపాన్... ఇప్పుడు కేసుల సంఖ్య పెరుగుతుంటే... టెన్షన్ పడుతోంది.

news18-telugu
Updated: April 26, 2020, 11:02 AM IST
అంతుచిక్కని కరోనా... ఎమర్జెన్సీని పొడిగించే ఆలోచనలో జపాన్...
అంతుచిక్కని కరోనా... ఎమర్జెన్సీని పొడిగించే ఆలోచనలో జపాన్... (credit - twitter - Mission Network News)
  • Share this:
Corona Lockdown | Corona Update : ఈ ఏడాది టోక్యో ఒలింపిక్స్ గేమ్స్ నిర్వహించాలని ఎన్నో ఆశలు పెట్టుకొని... 8 ఏళ్లుగా ఎంతో ప్రిపేర్ అయిన జపాన్‌ని కరోనా వైరస్ తీవ్రంగా దెబ్బతీసింది. ఒలింపిక్స్‌ని వచ్చే ఏడాదికి వాయిదా వేసినా... కరోనాని కంట్రోల్ చెయ్యడం ఎలా అన్నది సవాలుగా మారింది. ప్రస్తుతం జపాన్‌లో 13231 కేసులుండగా... మృతుల సంఖ్య 360గా ఉంది. మన ఇండియాతో పోల్చితే... జపాన్‌లో కేసుల సంఖ్య సగమే ఉండొచ్చు. కానీ... జపాన్ భూభాగం... మన తెలుగురాష్ట్రాల కంటే కాస్త పెద్దదిగా ఉంటుంది. అంత తక్కువ భూభాగంలో ఇన్ని కేసులు నమోదవ్వడం పెద్ద సమస్యే.

జపాన్‌లో ఏప్రిల్ 8న ఏడు ప్రాంతాల్లో విధించిన ఎమర్జెన్సీ (లాక్‌డౌన్ లాంటిదే)... ఆ తర్వాత దేశం మొత్తానికీ పెంచారు. ప్రస్తుతం అది మూడో వారం నడుస్తోంది. మే 6 వరకూ అది కొనసాగనుంది. మరి కరోనా కంట్రోల్ కావట్లేదు కాబట్టి... ఎమర్జెన్సీని మరో రెండు వారాలు పొడిగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాజధాని టోక్యోలో రెండు వారాలుగా రోజూ 100 కేసుల దాకా నమోదవుతున్నాయి. శనివారానికి టోక్యోలో మరణాల సంఖ్య 100 దాటింది. ఐతే... టోక్యో, ఒసాకాలో కొత్త కేసుల సంఖ్య ఇప్పుడిప్పుడే తగ్గుతోంది. ఐతే... తగ్గుదల రేటు ఊహించినంత వేగంగా లేదనీ... అందువల్ల ఎమర్జెన్సీ పొడిగించడమే మంచిదని అంటున్నారు.

ఎమర్జెన్సీని పొడిగించడం మాత్రమే కరోనాకి చెక్ పెట్టేందుకు సరైన మార్గం అని జపాన్ ప్రభుత్వం భావిస్తోంది. సాధారణంగా జపాన్ ప్రజలు కష్టపడేందుకు బాగా ఇష్టపడతారు. లాక్‌డౌన్లు, ఎమర్జెన్సీల వంటివి వాళ్లకు అస్సలు నచ్చవు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత నుంచి జపాన్ కష్టే ఫలి అనే ఫార్ములాతో ముందుకుసాగింది. అందుకే ఎన్ని భూకంపాలు, సునామీలు వచ్చినా... తట్టుకొని నిలబడింది. ఇప్పుడు కరోనా విషయంలోనూ ఇదే పట్టుదలతో ఉంది.

జపాన్‌లో శనివారం తన సిబ్బందిలోని ఒకరికి కరోనా సోకడంతో... ముందు జాగ్రత్తగా జపాన్ ఆర్థిక మంత్రి యసుతోషీ నషిమూరా... తన ఇంట్లోనే స్వయం ఐసోలేషన్‌కి వెళ్లిపోయారు.

జపాన్‌లో ప్రస్తుతం ఫుల్ లాక్‌డౌన్ లేదు. బార్లు, బార్బర్ షాపులు, వస్త్ర దుకాణాల వంటివి తెరిచే ఉన్నాయి. ప్రజలు 80 శాతం దాకా సోషల్ డిస్టాన్స్ పాటిస్తున్నారు.
Published by: Krishna Kumar N
First published: April 26, 2020, 11:02 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading