కరోనా హాట్‌స్పాట్‌‌లో ఇవాంక ట్రంప్... రూల్స్ బ్రేక్...

Corona Lockdown | Corona Update : కొంత మంది రాజకీయ నాయకులు ఏం చెయ్యవద్దంటే... అదే చేస్తారు. ఇవాంక ట్రంప్ ఆ లిస్టులో చేరారు.

news18-telugu
Updated: April 18, 2020, 8:14 AM IST
కరోనా హాట్‌స్పాట్‌‌లో ఇవాంక ట్రంప్... రూల్స్ బ్రేక్...
కరోనా హాట్‌స్పాట్‌‌లో ఇవాంక ట్రంప్... రూల్స్ బ్రేక్... (File)
  • Share this:
Corona Lockdown | Corona Update : ఓవైపు అమెరికాలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 7 లక్షలు దాటేసింది, మృతుల సంఖ్య 37వేలకు పైనా. ఇలాంటి సమయంలో... ప్రజలతోపాటూ... రాజకీయ నేతల ప్రయాణాలు, పర్యటనలపై నిషేదాజ్ఞలు ఉన్నాయి. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంక మాత్రం... తన భర్త, ఫ్యామిలీ సభ్యులతో కలిసి... వాషింగ్టన్ నుంచి... న్యూజెర్సీ వెళ్లారు. యూదుల పండుగ పాసోవర్‌‌లో పాల్గొనడానికి ఆమె కొన్నిరోజుల కిందట అక్కడకు వెళ్లారని వైట్‌హౌస్ వర్గాలు తెలిపాయి. న్యూజెర్సీలోని బెడ్‌మినిస్టర్‌లో జరిగిన పాసోవర్‌ ఫంక్షన్‌లో ఇవాంక ఫ్యామిలీతో పాల్గొన్నారు. దీనిపై ఆందోళన అవసరం లేదనీ... ఆమె సోషల్ డిస్టాన్స్ పాటిస్తున్నారని... అధికార వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఇవాకం... ఆ వేడుకల నుంచే అధికార విధులు చేపడుతున్నారు. ఆమె భర్త కుష్నెర్‌ మాత్రం ట్రంప్‌కి సహాయపడేందుకు వైట్‌హౌస్ తిరిగొచ్చారని తెలిసింది.

అమెరికాలో కరోనా వైరస్‌ ఇప్పుడు అత్యంత ఎక్కువగా ఉంది. రోజూ... 2వేల మందికి పైగా చనిపోతున్నారు. రోజూ 30వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇలాంటి సమయంలో... ఇవాంక... కరోనా వైరస్ హాట్‌స్పా్ట్‌కి వెళ్లడం ఆందోళన కలిగించే అంశమే. చాలా మంది సోషల్ డిస్టాన్స్ అంటే... ఓ 2 అడుగులు దూరంగా ఉంటే చాలని అనుకుంటున్నారు. అలా ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. ఎందుకంటే... తాజా అంచనాల ప్రకారం... కరోనా వైరస్.... 13 అ‌డుగుల దూరం వరకూ గాలిలో వెళ్తోంది. అంటే... ఎవరైనా తుమ్మినా, దగ్గినా... ఆ తుంపర్లు... 13 అడుగుల దూరం వరకూ వెళ్లగలుగుతున్నాయి. అందువల్ల కనీసం 8 అడుగుల దూరం డిస్టాన్స్ పాటించాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కానీ... ప్రపంచంలో ఎవరైనా అంతదూరం పాటిస్తున్నారా.... అన్నది మనం ఆలోచించుకోవాల్సిన అంశం.
Published by: Krishna Kumar N
First published: April 18, 2020, 8:14 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading