ఇక కరోనాకి మూడినట్లే... మందు కనిపెట్టామన్న ఇజ్రాయెల్...

ఇక కరోనాకి మూడినట్లే... మందు కనిపెట్టామన్న ఇజ్రాయెల్... (credit - NIAID)

Corona Lockdown | Corona Update : ప్రపంచంలో సరికొత్త టెక్నాలజీలో ముందుండే ఇజ్రాయెల్ నుంచి ఈ ప్రకటన రావడంతో... అన్ని దేశాలూ ఆసక్తిగా తెలుసుకుంటున్నాయి.

 • Share this:
  Corona Lockdown | Corona Update : ఇజ్రాయెల్ ప్రజలకు తెలివితేటలు కాస్త ఎక్కువ. అందువల్ల వాళ్లు పరిశోధనలు ఎక్కువగా చేస్తున్నారు. అలాగే... సరికొత్త టెక్నాలజీలను వాడేసుకోవడంలో ఎప్పుడూ ముందే ఉంటారు. అలాంటి ఆ దేశం నుంచి కరోనా వైరస్‌కి సంబంధించి ఓ గుడ్ న్యూస్ వచ్చింది. ఏంటంటే... కరోనా వైరస్‌ని అడ్డుకునే యాంటీబాడీని తయారుచేశామని ఇజ్రాయెల్ చెప్పింది. జెరుసలేం లోని ప్రధాన బయోలాజికల్ రీసెర్చ్ లేబరేటరీలో ఇది సాధించినట్లు ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి సోమవారం తెలిపారు. అందువల్ల కరోనా వైరస్ సోకిన వారికి... ట్రీట్‌మెంట్ చెయ్యడంలో ఇదో కీలకమైన ప్రధానమైన ముఖ్యమైన సంచలన అంశంగా చెబుతున్నారు.

  తమ ల్యాబ్‌లో "మోనోక్లొనాల్ న్యూట్రలైజింగ్ యాంటీబాడీ"ని తయారుచేసినట్లు ఇజ్రాయెల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ బయోలాజికల్ రీసెర్చ్ (IIBR) తెలిపింది. ఇది కరోనా వైరస్‌ అంతు చూడగలదని అంటోంది. తాము కనిపెట్టిన యాంటీబాడీ (మందు) ఫార్ములాని పెద్ద సంఖ్యలో (వ్యాక్సిన్ల రూపంలో) తయారుచేసేందుకు ఏదైనా అంతర్జాతీయ మందుల తయారీ కంపెనీతో డీల్ కుదుర్చుకున్నాక... తమ ఫార్ములాకు పేటెంట్ పొందుతామని IIBR డైరెక్టర్ ష్మ్యుయల్ షాపిరా తెలిపారు.

  IIBR ఇజ్రాయెల్‌లో కరోనా వైరస్‌పై భారీ ఎత్తున ప్రయోగాలు చేస్తోంది. ఇప్పటికే ఇది కరోనా వైరస్ నుంచి కోలుకున్న వ్యక్తుల నుంచి రక్తం సేకరించి పరీక్షలు జరిపింది. ఆ రక్తంలో ఉండే కరోనా నిరోధిత (కరోనాను ఆపే) యాంటీ బాడీస్‌ని తాము కనిపెట్టినట్లు IIBR చెబుతోంది.

  ఇప్పుడు IIBR ఆ ప్రత్యేక యాంటీబాడీని పెద్ద సంఖ్యలో ఉత్పత్తి చెయ్యాలనుకుంటోంది. పెద్ద సంఖ్యలో అంటే... ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకూ సరిపడా వ్యాక్సిన్ తయారుచెయ్యాలనుకుంటోంది.

  పైన మనం ఆ యాంటీ బాడీ పేరులో మోనోక్లొనాల్ అనే పదం చూశాం కదా... దానర్థం ఏంటంటే... ఆ యాంటీబాడీని కరోనా నుంచి కోలుకున్న సింగిల్ కణం నుంచి సేకరించిందన్నమాట. ఆ కణం రికవరీ అవ్వడానికి కారణం ఎవరో కాదు... ఆ యాంటీబాడీయే. సో... అలాంటి యాంటీ బాడీలను బిలియన్ల కొద్దీ తయారుచేసి... ప్రపంచంలో అందరికీ అమ్మేస్తే... అందరూ కరోనాని చావగొట్టవచ్చన్నది ఇజ్రాయెల్ ప్లాన్.

  ప్రపంచంలో చాలా దేశాల్లో యాంటీ బాడీలను సేకరిస్తున్నారు. ఐతే... అవన్నీ పాలీక్లోనాల్... అంటే... రెండు లేదా అంతకంటే ఎక్కువ కణాల నుంచి సేకరించినవి అన్నమాట. పాలీక్లొనాల్ యాంటీబాడీల్లో... పర్ఫెక్టుగా ఏవి కరోనాను ఎదుర్కోగలవన్నదానిపై డౌట్ ఉంటుంది. అదే ఏకైక యాంటీబాడీ అయితే... అది ఆల్రెడీ కణాన్ని కాపాడిన ట్రాక్ రికార్డ్ దానికి ఉంటుంది కాబట్టి... అచ్చుగుద్దినట్లు దాని లాంటి యాంటీబాడీలనే తయారుచేస్తారన్నమాట. అందువల్ల అలా తయారైన ప్రతీ యాంటీబాడీ... కరోనాను చంపగలదు అనేది IIBR ఉద్దేశం. చూద్దాం. అది సక్సెస్ అయితే... ప్రపంచానికి మేలే కదా.

  కరోనా వచ్చాక... అంతర్జాతీయ సరిహద్దుల్ని మూసేసిన తొలి దేశాల్లో ఇజ్రాయెల్ కూడా ఉంది. ప్రస్తుతం అక్కడ 16246 పాజిటివ్ కేసులున్నాయి. 235 మంది చనిపోయారు.
  Published by:Krishna Kumar N
  First published: