IPL 2020 : ఈసారి ఇండియాలో IPL కష్టమే... రారమ్మని పిలుస్తున్న విదేశాలు...

IPL 2020 | Corona Lockdown | Corona Update : కరోనా వైరస్... ఆటల భవిష్యత్తునూ, ఆటగాళ్ల కెరీర్‌ను ప్రశ్నార్థకం చేసింది. ఐపీఎల్ 2020 ఎక్కడ నిర్వహించాలో అర్థం కావట్లేదు.

news18-telugu
Updated: June 7, 2020, 7:30 AM IST
IPL 2020 : ఈసారి ఇండియాలో IPL కష్టమే... రారమ్మని పిలుస్తున్న విదేశాలు...
ఈ ఏడాది ఐపీఎల్ నిర్వహించకపోతే... బీసీసీఐ రూ. 2500 కోట్ల రూపాయలు నష్టపోయే అవకాశం ఉందని బీసీసీఐ కోశాధికారి అరుణ్ దుమాల్ వ్యాఖ్యానించారు.
  • Share this:
Corona Lockdown | Corona Update : BCCI బాస్ సౌరబ్ గంగూలీ చెప్పిందే జరిగేలా ఉంది. ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)ను మాగ్జిమం ఇండియాలోనే నిర్వహిస్తామన్న ఆయన... అది కుదరకపోతే... అప్పుడు వేరే దేశంలో నిర్వహించాల్సి ఉంటుందన్నాడు. ఆ పరిస్థితి రాకుండా ఉండేందుకే ప్రయత్నిస్తామన్నాడు. కానీ... ఇండియాలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి కాబట్టి... ఇక ఈ ఏడాది ఇండియాలో IPL జరపడం సాధ్యం కాదనే వాదన బలపడుతోంది. మరి విదేశాల్లోనైతే... ఎక్కడ నిర్వహించాలనేది ఆలోచించగా... కొంతమంది న్యూజిలాండ్‌లో నిర్వహించాలని కోరారు. అక్కడైతే... ఇటీవల కరోనా కొత్త కేసులు నమోదు కావట్లేదు కాబట్టి... అదే సరైన దేశం అన్నారు. అలాగే శ్రీలంక కూడా తమ దేశంలో నిర్వహించమని కోరింది. ఐతే... శ్రీలంకలో కూడా కొత్త కరోనా కేసులు రోజుకు 10 దాకా వస్తున్నాయి.

తాజాగా ఈ లిస్టులో UAE వచ్చి చేరింది. ఇందుకు కారణం... ఎమిరేట్స్ పాలకులు... IPL తమ దేశంలో జరపాలని కోరుతుండటమే. IPL ఆటకు కావాల్సిన స్టేడియంలు అన్ని రకాల పెసిలిటీస్ తమ దగ్గర ఉన్నాయని ఎమిరేట్స్ క్రికెట్ బోర్డ్ చెబుతోంది. అందువల్ల 13వ ఎడిషన్‌ను అక్కడ నిర్వహిస్తే ఎలా ఉంటుందనే అంశం ఇప్పుడు చర్చలో ఉంది.

నిజానికి మార్చిలోనే IPL జరగాల్సి ఉంది. అదే మార్చిలో లాక్‌డౌన్ ప్రకటించడంతో... ఏప్రిల్‌లో జరపాలనుకున్నారు. అదీ సాధ్యపడలేదు. ఇక ఇప్పుడు ఇండియాలో జరిపే అవకాశాలు ఏమాత్రం లేవు. ఖరీదైన టీ-20 మ్యాచ్‌లను నిర్వహించేందుకు తమ దేశం పూర్తి సామర్ధ్యంతో ఉందని ఎమిరేట్స్ క్రికెట్ బోర్డ్ చెబుతోంది.

BCCI లెక్క ప్రకారం... ఈ ఏడాది ఆస్ట్రేలియాలో జరగాల్సిన T20 వరల్డ్ ‌కప్ జరగట్లేదు. అదే అక్టోబర్ సమయంలో IPL నిర్వహించాలని BCCI అనుకుంటోంది. ఇదివరకు IPL మ్యాచ్‌లు విజయవంతంగా జరిపించిన ట్రాక్ రికార్డ్ UAEకి ఉంది. అక్కడ ఇంగ్లండ్ టీమ్ చాలా మ్యాచ్‌లు ఆడింది కూడా. ఐతే... UAEలో కరోనా తక్కువేమీ లేదు. రోజూ 600 దాకా కొత్త కేసులొస్తున్నాయి. యాక్టివ్ కేసులు 16వేలకు పైనే ఉన్నాయి. ఐతే... మరణాలు మాత్రం ఒక్క కేసే ఉంది. అందువల్ల అక్కడకు వెళ్లాలా వద్దా అనే అంశంపై BCCI ఏమీ తేల్చుకోలేకపోతోంది. దీనిపై జూన్ 10న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా... బోర్డ్ మీటింగ్ జరగనుంది. అందులో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
First published: June 7, 2020, 7:30 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading