Indian Railways : ప్యాసింజర్ ట్రైన్స్‌పై రైల్వే శాఖ కీలక నిర్ణయం...

Indian Railways | Corona Lockdown | Corona Update : కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ను మే 17 వరకు పొడిగించడంతో... రైల్వే శాఖ కూడా రైళ్లను మే 17 వరకు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

news18-telugu
Updated: May 2, 2020, 11:25 AM IST
Indian Railways : ప్యాసింజర్ ట్రైన్స్‌పై రైల్వే శాఖ కీలక నిర్ణయం...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
Indian Railways | Corona Lockdown : వలస కార్మికుల కోసం ప్రత్యేక రైళ్లను నడుపుతున్న రైల్వే శాఖ... అవి కాకుండా ఇతర ప్యాసింజర్ రైళ్ల సేవల్ని మే 17 వరకు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దయచేసి... సామాన్య ప్రయాణికులెవరూ (వలస కార్మికులు కానివారు) రైల్వే స్టేషన్లకు రావొద్దని రైల్వే శాఖ మరీ మరీ కోరింది. ఇంతలా కోరడానికి కారణం ఉంది... ఎప్పుడైతే వలస కార్మికుల కోసం ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు రైల్వే శాఖ ప్రకటించిందో... చాలా మంది ఆ ప్రకటనను సరిగా అర్థం చేసుకోకుండా... రైల్వే శాఖ లాక్‌డౌన్ సమయంలో ప్రత్యేక రైళ్లు నడుపుతోంది అనుకుంటూ... రైల్వేస్టేషన్లకు లగేజీతో సహా వచ్చేస్తున్నారు. ఇలా వచ్చిన వాళ్లను తిరిగి వెనక్కి పంపడం రైల్వే అధికారులకు తలనొప్పిగా మారుతోంది.

వలస కార్మికుల కోసం వేసిన రైళ్లు మాత్రమే ప్రస్తుతం నడుస్తున్నాయి. వాళ్లను మాత్రమే ఆ రైళ్లు ఎక్కేందుకు అనుమతి ఇస్తారు. సాధారణ ప్రయాణికులు రైళ్లలో ప్రయాణించాలంటే మే 17 వరకు ఆగాల్సి ఉంటుంది. ఆ తర్వాత కూడా రైళ్లు నడుస్తాయా లేదా అన్నది అప్పటి కేంద్రం లాక్‌డౌన్‌పై తీసుకునే నిర్ణయాన్ని బట్టీ ఆధారపడి ఉంది. ప్రస్తుతానికి సరుకు రవాణా, పార్శిల్స్ రైళ్లు తప్ప... ప్యాసింజర్ రైళ్లేవీ నడవట్లేదు. మే 17 వరకూ ఇదే పరిస్థితి ఉంటుంది.

ప్రత్యేక ప్రజల కోసం రైల్వే శాఖ శ్రామిక్ స్పెషల్ ట్రైన్స్ రంగంలోకి దింపింది. ఈ రైళ్లలో వేర్వేరు రాష్ట్రాల్లో ఉండి... సొంత రాష్ట్రాలకు వెళ్లిపోవాలి అనుకుంటున్న వలస కార్మికులు, భక్తులు, యాత్రికులు, పర్యాటకులు, విద్యార్థుల వంటి వారు మాత్రమే ఎక్కేందుకు అనుమతి ఉంది. ఇలా వెళ్లాలనుకునేవారు... తమ పేర్లను నమోదు చేయించుకోవాలి.

మే 3తో లాక్‌డౌన్ రెండో దశ ముగుస్తుంది. మే 4 నుంచి 17వరకు మూడో దశ ఉంటుంది. లాక్‌డౌన్ ఉండగా... ప్రయాణికులను అనుమతిస్తే... సోషల్ డిస్టాన్స్ సాధ్యపడదని భావిస్తున్న రైల్వే శాఖ... కేంద్ర నిర్ణయానికి అనుగుణంగా తమ నిర్ణయాలు ఉండాలని భావిస్తోంది.

ప్రస్తుతం ప్యాసింజర్ రైళ్లకు టికెట్ బుకింగ్ అమలులో లేదు. ఎప్పటి నుంచి అది అమలవుతుందో ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. అడ్వాన్స్ రిజర్వేషన్లు కూడా లేవు. ఇదివరకే టికెట్ బుక్ చేసుకున్నవారు... ఇప్పుడు రద్దు చేసుకోవాలంటే మాత్రం అలా చేసుకోవడానికి అనుమతి ఉంది.

పార్శిల్ రైళ్లలో రైల్వేశాఖ ప్రస్తుతం పండ్లు, కూరగాయలు, పాలు, డైరీ ఉత్పత్తులు, వ్యవసాయ ఉత్పత్తులను తరలిస్తోంది.

కరోనాపై పోరాటంలో భాగంగా... రైల్వే శాఖ 5000 కో‌చ్‌లను ఐసోలేషన్ వార్డులుగా మార్చింది. మరో 15000 కోచ్‌లను కూడా మార్చబోతోంది.
Published by: Krishna Kumar N
First published: May 2, 2020, 11:25 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading