ఇండియాలో కరోనా వీర విజృంభణ... ఒక్కరోజులో 8909 కేసులు... 2లక్షలకు పైగా పాజిటివ్‌లు

Corona Lockdown | Corona Update : కేంద్ర ప్రభుత్వం, అన్ని రాష్ట్రాలూ కరోనా వైరస్‌ను మరింత సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. లైట్ తీసుకుంటే... పెను ప్రమాదమే.

news18-telugu
Updated: June 3, 2020, 10:27 AM IST
ఇండియాలో కరోనా వీర విజృంభణ... ఒక్కరోజులో 8909 కేసులు... 2లక్షలకు పైగా పాజిటివ్‌లు
ఇండియాలో కరోనా వీర విజృంభణ... ఒక్కరోజులో 8909 కేసులు... 2లక్షలకు పైగా పాజిటివ్‌లు (credit - NIAID)
  • Share this:
Corona Lockdown | Corona Update : భారత్‌లో కరోనా కేసులు రోజురోజుకూ అంచనాలకు మించి పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో ఏకంగా 8909 కేసులు నమోదయ్యాయి. ఇంత అత్యధిక కేసులు నమోదవ్వడం ఇదే తొలిసారి. ఫలితంగా ఇండియాలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2 లక్షలు దాటేసి... 207615కి చేరింది. అలాగే... గత 24 గంటల్లో ఏకంగా 217 మంది చనిపోయారు. ఫలితంగా మొత్తం మరణాల సంఖ్య 5815కి పెరిగింది. ఇలా రోజురోజుకూ కేసులు, మరణాలు రాకెట్ వేగంతో పెరిగిపోతున్నాయి. నిన్న 4776 మంది కరోనా నుంచి రకవరీ అయ్యారు. ఫలితంగా మొత్తం రికవరీ కేసుల సంఖ్య 100302కి చేరింది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 101497కి పెరిగింది. ఇలా లెక్కలన్నీ పెరుగుతూనే ఉన్నాయి తప్ప తగ్గుదల కనిపించట్లేదు. జస్ట్ లక్ష కేసుల నుంచి 2 లక్షల కేసులవ్వడానికి 16 రోజులే పట్టింది. అంటే ఇండియాలో కరోనా ఎంత వేగంగా వ్యాపిస్తోందో అర్థం చేసుకోవచ్చు.

ఇప్పటికే ప్రపంచంలో కరోనా వచ్చి ఆరు నెలలు అవుతోంది. మొదట్లో కాస్త నెమ్మదిగానే ఉన్నా.... ఇప్పుడు కళ్లాలే లేనట్లు దూసుకుపోతున్నాయి కేసులు. ఇటు చూస్తే... వ్యాక్సిన్ ఇంకా తయారు కాలేదు. చాలా కంపెనీలు తయారుచేస్తున్నామని చెబుతున్నాయి, కొన్నేమో... ట్రయల్స్‌లో విజయం సాధించామని చెబుతున్నాయి. ఏది ఏమైనా డిసెంబర్ వరకూ వ్యాక్సిన్ వచ్చే అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు. అంటే... మరో 6 నెలలు. ఆ లోగా ఇండియాలో కేసులు ఎంతవరకూ వెళ్తాయో అన్నది ఊహించడానికే భయంకరమైన అంశం. అప్పటిదాకా కరోనా ఉండదనీ, దానందట అదే తగ్గిపోతుందని అనుకోవడానికి లేదు. ఎందుకంటే... ఇండియా కంటే ముందుగా కరోనా సోకిన యూరప్ దేశాల్లో ఇప్పటికీ కేసులు వస్తూనే ఉన్నాయి. చైనాలో కూడా అప్పుడప్పుడూ నమోదవుతూనే ఉన్నాయి. ఎవరికి వారు అప్రమత్తంగా ఉండటమే చేయగలిగేదని తెలుస్తోంది.

ఇండియాలో కరోనా కేసుల తాజా వివరాలు


First published: June 3, 2020, 9:56 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading