భారత్‌లో కరోనా విజృంభణ... 4 లక్షలు దాటిన కేసులు... పెరుగుతున్న రికవరీ రేటు

Corona Lockdown | Corona Update : భారత్‌లో ఓవైపు కరోనా కొత్త కేసులు పెరుగుతుంటే... మరోవైపు రికవరీ రేటు కూడా పెరుగుతోంది. ఇప్పుడు మందు కూడా రావడం మంచి విషయమే.

news18-telugu
Updated: June 21, 2020, 9:58 AM IST
భారత్‌లో కరోనా విజృంభణ... 4 లక్షలు దాటిన కేసులు... పెరుగుతున్న రికవరీ రేటు
భారత్‌లో కరోనా విజృంభణ... 4 లక్షలు దాటిన కేసులు... పెరుగుతున్న రికవరీ రేటు (credit - NIAID)
  • Share this:
Corona Lockdown | Corona Update : ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుంటే... అదే సమయంలో... కరోనాను జయించగలమనే కాన్ఫిడెన్స్ కూడా ప్రజల్లో పెరుగుతోంది. ఇడియాలో గత 24 గంటల్లో ఏకంగా 154136 కేసులు నమోదయ్యాయి. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 4 లక్షలు దాటి... 410461కి చేరింది. నిన్న 306 మంది చనిపోవడంతో... మొత్తం మరణాల సంఖ్య 13254కి చేరింది. ఇండియాలో కరోనా వల్ల ఒకే రోజు ఇంత ఎక్కువ మంది చనిపోవడం ఇదే తొలిసారి. గత 24 గంటల్లో 13925 మంది రికవరీ అవ్వడంతో... మొత్తం రికవరీ కేసుల సంఖ్య 227755కి చేరింది. ఫలితంగా మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 169451గా ఉంది. దేశంలో రికవరీ రేటు మరింత పెరిగి... 55.5కి చేరుకోవడం మంచి విషయమే.

ప్రపంచవ్యాప్తంగా కరోనా క్లోజింగ్ కేసుల్లో మరణాల రేటు 9 శాతంగా ఉంది. ఇండియాలో అది 3.2 శాతంగా ఉండటం మనకు ఊరట కలిగించే విషయం. తాజాగా ఇండియాలో కరోనాను జయించేందుకు టాబ్లెట్ల మందు ఫాబిఫ్లూకి అనుమతి లభించడం కూడా కరోనాపై చిన్నపాటి విజయంగానే చెప్పుకోవచ్చంటున్నారు నిపుణులు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కేసుల్లో భారత్ 4వ స్థానంలో ఉంది. కొత్త కేసుల నమోదులో 3వ స్థానంలో ఉంది.

ఇండియాలో కరోనా కేసుల వివరాలు


ప్రపంచంలో కరోనా విజృంభణ... 4 లక్షలు దాటిన కేసులు... పెరుగుతున్న రికవరీ రేటు
First published: June 21, 2020, 9:58 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading