ప్రపంచంలో జోరుగా కరోనా కొత్త కేసులు... ఐదో స్థానంలో భారత్...

Corona Lockdown | Corona Update : ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్రత తగ్గుతోంది. కానీ కేసుల సంఖ్య మాత్రం పెరుగుతూనే ఉంది.

news18-telugu
Updated: May 10, 2020, 5:20 AM IST
ప్రపంచంలో జోరుగా కరోనా కొత్త కేసులు... ఐదో స్థానంలో భారత్...
ప్రపంచంలో జోరుగా కరోనా కొత్త కేసులు... ఐదో స్థానంలో భారత్... (credit - WHO)
  • Share this:
Corona Lockdown | Corona Update : ప్రపంచ దేశాల్లో కరోనా వైరస్‌ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. శనివారం కొత్తగా 88222 కేసులు నమోదవడంతో... మొత్తం కేసుల సంఖ్య 4097513కి చేరింది. అలాగే శనివారం కొత్తగా 4195 మంది చనిపోవడంతో... మొత్తం మరణాల సంఖ్య 280171కి చేరింది. ఇప్పటివరకూ కరోనా నుంచి 1434361 మంది కోలుకున్నారు. అందువల్ల ప్రస్తుతం 2382981 .యాక్టివ్ కేసులున్నాయి. వీటిలో 47704 కేసుల్లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. వీరికి ICUలో ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు. తీవ్రత ఎక్కువగా ఉండే కేసుల నమోదు క్రమంగా తగ్గుతోంది. కానీ... తీవ్రత తక్కువగా ఉండే కేసుల సంఖ్య మాత్రం తగ్గట్లేదు. అంటే... కరోనా వైరస్ బలహీనపడినట్లు కనిపిస్తోంది కానీ... దాని వ్యాప్తి మాత్రం ఆగట్లేదు.

అమెరికాలో తాజాగా 24986 కేసులు రావడంతో... మొత్తం కేసుల సంఖ్య 1346771కి చేరింది. అలాగే... శనివారం మరో 1416 మంది చనిపోవడంతో... మొత్తం మరణాల సంక్య 80031కి చేరింది. ఈ నెలాఖరు లోపే... లక్ష మరణాలు నమోదయ్యేలా కనిపిస్తోంది పరిస్థితి.

అమెరికా తర్వాత రష్యాలో 10817 కొత్తకేసులొచ్చాయి. అలాగే బ్రెజిల్‌లో 10047, బ్రిటన్‌లో 3896, ఇండియాలో 3320, పెరూలో 3168, స్పెయిన్‌లో 2666 కేసులు నమోదయ్యాయి. అంటే... కొత్త కేసులు ఎక్కువగా నమోదవుతున్న దేశాల్లో భారత్... ఐదో స్థానంలో ఉంది.

నెల కిందట టాప్ 20లో కూడా భారత్ ఉండేది కాదు. ఇప్పుడు ఇండియాలో కొత్త కేసులు అనూహ్యంగా పెరిగిపోతున్నాయి. ఎక్కడా బ్రేక్ పడట్లేదు. ఒక్క రోజులో 3320 కొత్త కేసులు, 95 మరణాలు ఇండియాలో సంభవించాయి. ప్రస్తుతం దేశంలో కరోనా కేసుల సంఖ్య 59662కి చేరింది. వీళ్లలో 17847 మంది రికవరీ అయ్యారు. మరణాల సంఖ్య 1981కి చేరింది. ఒక్కో రాష్ట్రంలో పెరుగుతుంటే, ఒక్కో రాష్ట్రంలో తగ్గుతోంది. ఓవరాల్‌గా మాత్రం పెరుగుదలే ఉంది.

కరోనా పరీక్షల్లో దేశంలోనే ఏపీ తొలి స్థానంలో ఉంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,65,069 పరీక్షలు చేయగా... శుక్రవారం ఒక్క రోజే రాష్ట్రవ్యాప్తంగా 8388 పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రంలో ప్రతి పది లక్షల మందిలో 3091 పరీక్షలు చేస్తున్నారు. ఏపీలో కొత్తగా 43 కరోనా కేసులు నమోదు కావడంతో... రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,930కి చేరింది. కరోనాతో మరో ముగ్గురు మృతి చెందడంతో మరణాల సంఖ్య 44కు చేరింది. కొత్తగా 45 మంది డిశ్చార్జ్‌ కావడంతో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 887కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 999 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు ఒక్కసారిగా పెరిగాయి. శనివారం ఏకంగా 31 కొత్త కేసులు నమోదయ్యాయి. మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1163కు చేరుకుంది. కొత్తగా 24 మంది డిశ్చార్జ్ అయ్యారు. తెలంగాణలో ప్రస్తుతం 382 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు 751 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. శనివారం ఒకరు చనిపోయారు. మొత్తం ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 30కి పెరిగింది. గత 14 రోజులుగా 23 జిల్లాల్లో కొత్త కరోనా కేసులు నమోదు కాలేదని ప్రభుత్వం ప్రకటించింది.
Published by: Krishna Kumar N
First published: May 10, 2020, 5:20 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading