నేడే దీప కాంతి... ప్రధాని మోదీ పిలుపుతో సిద్ధమవుతున్న భారతదేశం...

Corona Lockdown | Coronaupdate : దేశవ్యాప్తంగా ప్రజలు ఇవాళ దీపాలను వెలిగించేందుకు అన్ని ఏర్పాట్లూ చేసుకుంటున్నారు.

news18-telugu
Updated: April 5, 2020, 6:19 AM IST
నేడే దీప కాంతి... ప్రధాని మోదీ పిలుపుతో సిద్ధమవుతున్న భారతదేశం...
ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చినట్టు మన ఇంట్లో లైట్లు ఆర్పి దీపాలు వెలిగించడానికి మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉంది.
  • Share this:
Corona Lockdown | Coronaupdate : భారత్‌లో లాక్‌డౌన్ 9 రోజులు పూర్తైన తర్వాత... సోషల్ మీడియా ద్వారా ప్రజల ముందుకు వచ్చిన ప్రధాని మోదీ... ఆదివారం (ఇవాళే) రాత్రి 9 గంటలకు... దేశ ప్రజలంతా లైట్లు ఆర్పేసి... 9 నిమిషాలపాటూ... కొవ్వొత్తులు, దీపాలు, అగరబత్తులు, టార్చిలైట్లు, మొబైల్ ఫ్లాష్ లైట్లూ వెలిగించాలని పిలుపు ఇచ్చారు. తద్వారా దేశంలో ప్రజలంతా ఒక్కటేననీ, ఐక్యంగా కరోనాపై పోరాటం చేస్తున్నామనే సంకేతాన్ని ప్రపంచానికి చాటాలని ప్రధాని మోదీ కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజలంతా పాల్గొనడం ద్వారా... ప్రజల్లో ఐక్యతాభావం పెరుగుతుందని అన్నారు. ఐతే... ఈ కార్యక్రమంలో పాల్గొనే ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా సోషల్ డిస్టాన్స్ లేదా ఫిజికల్ డిస్టాన్స్ (భౌతిక దూరం) పాటించాలని ప్రధాని సూచించారు.


ప్రధాని పిలుపుకి దేశవ్యాప్తంగా భారీ స్పందన వస్తోంది. ప్రజలంతా ఒక్కటై... ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నారు. రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు, సెలబ్రిటీలూ... ఈ కార్యక్రమంలో అంతా పాల్గొనాలని కోరుతున్నారు.


ప్రధాని పిలుపుతో... ఒక్కసారిగా కొవ్వొత్తుల అమ్మకాలు, కొనుగోళ్లూ పెరిగాయి. చాలా మంది ఆల్రెడీ ఉన్న ప్రమిదల్లో నూనె పోసి... దీపాలను వెలిగించేందుకు సిద్ధమవుతున్నారు. అలాగే... కొంత మంది టార్టిలైట్లు వెయ్యాలని నిర్ణయించుకుంటే... మరికొందరు మొబైల్ ద్వారా ఫ్లాష్ లైట్స్ వేస్తామంటున్నారు.


ఇంటి గడప దగ్గర కానీ... లేదా బాల్కనీ దగ్గరకు వచ్చి... ఈ ప్రదర్శన చెయ్యాలని మోదీ కోరారు. ఆ ప్రకారం చేసేందుకు అంతా సిద్ధమవుతున్నారు.


రాత్రి 9 గంటలకు దేశం మొత్తం చీకటి అవుతుంది. ప్రజలంతా లైట్లు ఆర్పేస్తారు. ఆ చీకటిలో... ఈ లైట్లు వెలిగించి... తమ ఐక్యతను చాటుతారు.


ఇది వరకు జనతా కర్ఫ్యూకి పిలుపు ఇచ్చిన ప్రధాని మోదీ... సాయంత్రం 5 గంటల సమయంలో... ప్రజలంతా డాక్టర్లు, వైద్య సిబ్బందికి మద్దతుగా చప్పట్లు కొట్టాలని పిలుపు ఇచ్చారు. ప్రజలంతా ఆ పిలుపును పాటించారు. ఇప్పుడు మరోసారి ఇచ్చిన పిలుపును పాటించేందుకు సిద్ధమవుతున్నారు.

First published: April 5, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading