దేశాన్ని కబళిస్తున్న కరోనా... 4 లక్షలకు దగ్గర్లో పాజిటివ్ కేసులు... జోరుగా మరణాలు...

Corona Lockdown | Corona Update : కరోనా అన్‌లాక్ 1 ప్రారంభమైనప్పటి నుంచి... దేశంలో కరోనా వైరస్ జోరు బాగా పెరిగింది. ఇప్పుడు మరింత తీవ్రంగా ఉంది.

news18-telugu
Updated: June 20, 2020, 9:45 AM IST
దేశాన్ని కబళిస్తున్న కరోనా... 4 లక్షలకు దగ్గర్లో పాజిటివ్ కేసులు... జోరుగా మరణాలు...
దేశాన్ని కబళిస్తున్న కరోనా... 4 లక్షలకు దగ్గర్లో పాజిటివ్ కేసులు... జోరుగా మరణాలు... (credit - NIAID)
  • Share this:
Corona Lockdown | Corona Update : జూన్ 3 నుంచి ఇండియాలో కరోనా లెక్కలు జోరుగా సాగుతున్నాయి. ఏ రోజుకారోజు పెద్ద ఎత్తున పాజిటివ్ కేసులు వస్తున్నాయి. తాజాగా 24 గంటల్లో 14516 పాజిటివ్ కేసులు రావడంతో... మొత్తం కేసుల సంఖ్య దాదాపు 4లక్షలకు చేరువవుతూ... 395048గా ఉన్నాయి. ఇక నిన్న ఒక్క రోజే 375 మంది చనిపోవడంతో... మొత్తం మరణాల సంఖ్య 12948కి చేరింది. ఇదే సమయంలో... నిన్న 9120 మంది రికవరీ అవ్వడంతో... మొత్తం రికవరీ కేసుల సంఖ్య 213830కి చేరింది. అందువల్ల ప్రస్తుతం యాక్టివ్ కేసులు 168269గా ఉన్నాయి. మన దేశంలో రికవరీ రేటు 54.1 శాతంగా ఉండటం కాస్త ఊరట కలిగించే అంశం. ప్రస్తుతం మొత్తం కేసుల్లో ఇండియా... ఇప్పుడు నాలుగో స్థానంలో ఉంది.

ప్రధానంగా ఇండియాలో మహారాష్ట్ర (124331), తమిళనాడు (54449) ఢిల్లీ (53116) కేసులున్నాయి. ఈ మూడు రాష్ట్రాల్లో కేసులు 50 వేలను దాటేశాయి. మహారాష్ట్రలో ఏకంగా లక్ష దాటేశాయి. ఫిబ్రవరిలో జస్ట్ 3 కేసులుండే ఇండియా... నాలుగు నెలల్లో 4 లక్షలకు చేరువవడం షాకింగ్ విషయమే.

దేశంలో కరోనా కేసుల వివరాలు


ప్రపంచదేశాల్లో కరోనా కేసుల వివరాలు


 

First published: June 20, 2020, 9:37 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading