మొన్న కరోనా హెల్మెట్... ఇప్పుడు కరోనా కారు... తెలంగాణలో కొత్త ప్రచారం...

Corona Lockdown | Coronaupdate : కరోనా వైరస్‌పై వీలైనంత ఎక్కువగా ప్రచారం చెయ్యాలనే ఉద్దేశంతో... కొత్త కొత్తవి తెరపైకి వస్తున్నాయి.

news18-telugu
Updated: April 8, 2020, 1:34 PM IST
మొన్న కరోనా హెల్మెట్... ఇప్పుడు కరోనా కారు... తెలంగాణలో కొత్త ప్రచారం...
Video : వినూత్న ప్రచారం.. హైదరాబాద్ లో కరోనా కారు చక్కర్లు..
  • Share this:
Corona Lockdown | Coronaupdate : తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణలో కరోనా వైరస్‌కి బ్రేక్ పడాలంటే... ప్రజల్లో అవగాహన బాగా కలగాలి. కరోనా వైరస్‌పై ప్రజలకు ఆసక్తి పెరగాలి. అప్పుడే వారు ఆ వైరస్ ఏంటి? దాని సంగతేంటన్నది పూర్తిగా తెలుసుకుంటారు. ఇందులో భాగంగా... ఇప్పటికే హైదరాబాద్ పోలీసులు.. బైక్ హెల్మెట్లతో అవగాహన పెంచుతుంటే... తాజాగా కరోనా కారు హైదరాబాద్ రోడ్లపై సందడి చేసింది. ప్రభుత్వంతోపాటూ... స్వచ్ఛంద సంస్థలు కూడా ఇలాంటి ప్రచారాలు చేస్తున్నాయి. హైదరాబాద్‌కు చెందిన సుధాకార్స్ మ్యూజియం చీఫ్ సుదాకర్... కరోనా వైరస్ రూపంలో కారును తయారుచేశారు. ఇది వరకు ఈయన బర్గర్ కారు, క్రికెట్ బాల్ కారు, క్రికెట్ బ్యాట్ కార్లను తయారుచేశారు. కరోనాపై ప్రజలల్లో అవగాహన పెంచేందుకు ఇలా చేసినట్లు తెలిపారు.



కరోనా వైరస్‌లా కనిపిస్తూ ఈ కారు రోడ్లపై వెళ్తుంటే... అంతా దీన్నే చూస్తున్నారు, మొదట ఆశ్చర్యపోతూ... తర్వాత కరోనా వైరస్‌పై ఆసక్తి పెంచుకుంటున్నారు. ఇప్పటికే తెలంగాణ పోలీసులు తెచ్చిన కరోనా హెల్మెట్ కాన్సెప్ట్ కూడా బాగా క్లిక్ అయ్యింది. స్వయంగా పోలీసులే కరోనా హెల్మెట్లు పెట్టుకొని వెళ్తుండటంతో... ప్రజలు ఈ వైరస్‌పై పూర్తి అవగాహన పెంచుకుంటున్నారు.

First published: April 8, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading