Indian Railways : రైళ్లను ఎలా శుభ్రం చేస్తున్నామంటే... స్పెషల్ వీడియో రిలీజ్...

Corona Lockdown | Corona Update : రైల్వేల్లో శుభ్రతపై ప్రయాణికులకు చాలా డౌట్లు ఉంటాయి. వాటికి క్లారిటీ ఇస్తూ... ఇండియన్ రైల్వేస్ ఓ వీడియో రిలీజ్ చేసింది.

news18-telugu
Updated: May 24, 2020, 6:45 AM IST
Indian Railways : రైళ్లను ఎలా శుభ్రం చేస్తున్నామంటే... స్పెషల్ వీడియో రిలీజ్...
Indian Railways : రైళ్లను ఎలా శుభ్రం చేస్తున్నామంటే... స్పెషల్ వీడియో రిలీజ్... (credit - twitter)
  • Share this:
Corona Lockdown | Corona Update : ఇండియాలో శ్రామిక్ రైళ్లను ప్రారంభించి... వలస కూలీలను వేర్వేరు రాష్ట్రాలకు తరలిస్తున్న భారతీయ రైల్వే శాఖ... రైళ్లను ఎలా శుభ్రం చేస్తున్నదీ, ఎలా శానిటైజ్ చేస్తున్నదీ తెలుపుతూ... ఓ వీడియోని రిలీజ్ చేసింది. ప్రతీ రైలును బయట, లోపల కూడా పూర్తిగా శానిటైజ్ చేస్తున్నామనీ అలాగే... ప్రయాణికులంతా కచ్చితంగా సోషల్ డిస్టాన్స్ పాటించేలా చేస్తున్నామని తెలిపింది. ఫేస్ మాస్క్ లేదా కర్చీఫ్ లాంటిది పెట్టుకున్న వారిని, ధర్మల్ స్క్రీనింగ్ చేసిన తర్వాత మాత్రమే స్టేషన్‌లోకి అనుమతిస్తున్నామనీ... అందరూ హ్యాండ్ శానిటైజర్ రాసుకునేలా... ప్రయాణికులకు ఎంట్రీ దగ్గరే నాలుగు చుక్కలు చేతిలో వేస్తున్నామనీ వీడియో ద్వారా వివరించింది.


కోచ్‌ల లోపల చేతులు శుభ్రం చేసుకునే చోట... ప్రయాణికుల ఆరోగ్య భద్రత కోసం లిక్విడ్ హ్యాండ్ వాష్, శానిటైజర్లను ఉంచినట్లు రైల్వే తెలిపింది. టికెట్ కన్‌ఫామ్ అయిన పాసింజర్లను మాత్రమే స్టేషన్లలోకి అనుమతిస్తున్నట్లు వివరించింది. ప్లాట్‌ఫామ్ దగ్గర, రైలు ఎక్కేటప్పుడు, సీట్లలో కూర్చునేటప్పుడు... అంతటా సోషల్ డిస్టాన్స్ కంపల్సరీ చేసినట్లు వీడియోలో చూపించింది రైల్వే శాఖ. ఈ చర్యలు చాలా బాగున్నాయని ప్రయాణికులు కూడా సంతృప్తి వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ నుంచి ఢిల్లీకి ఏసీ ఎక్స్‌ప్రెస్ బయలుదేరిన సందర్భంగా.... భారతీయ రైల్వే శాఖ ఈ వీడియో రిలీజ్ చేసింది.
First published: May 24, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading