స్పెయిన్‌లో కరోనాను జయించిన 113 ఏళ్ల బామ్మ...

Corona Lockdown | Corona Update : ముసలివారికి కరోనా వస్తే నయం అవ్వడం కష్టం అనే భావనను ఆమె చెరిపేస్తోంది. ఆమె ఎలా కోలుకోగలిగింది?

news18-telugu
Updated: May 13, 2020, 7:57 AM IST
స్పెయిన్‌లో కరోనాను జయించిన 113 ఏళ్ల బామ్మ...
స్పెయిన్‌లో కరోనాను జయించిన 113 ఏళ్ల బామ్మ... (credit - twitter)
  • Share this:
Corona Lockdown | Corona Update : ఇప్పటివరకూ ప్రపంచంలో... కరోనాతో ఎక్కువగా చనిపోతున్నది 60 ఏళ్లు దాటిన వాళ్లే. డయాబెటిక్, హార్ట్ ప్రాబ్లమ్స్, బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉండేవారికి కరోనా సోకితే... వాళ్లు చనిపోయే పరిస్థితులు ఉంటున్నాయి. ఇలాంటి సమయంలో... స్పెయిన్‌లో అత్యధిక వయసు (113 ఏళ్లు) కలిగిన... మారియా బ్రన్యాస్... కరోనా నుంచి కోలుకొని చరిత్ర సృష్టించింది. ఇటీవల డచ్‌లో 107 ఏళ్ల బామ్మ కరోనాను జయించింది. ఇప్పుడు ఆమె కంటే ఎక్కువ వయసున్న మారియా... రికార్డును తిరగరాసింది. ఎంతో హుషారుగా కనిపిస్తోంది. ఇదెలా సాధ్యమైందో తెలుసుకుందాం.

అమెరికా... శాన్ ఫ్రాన్సిస్కోలో 1097లో పుట్టిన మారియా... స్పెయిన్‌లో పెరిగింది. ఆ దేశస్థురాలైంది. స్పెయిన్‌లో అత్యంత వృద్ధ మహిళగా అధికారిక గుర్తింపు పొందింది. కరోనాను జయించిన అత్యధిక వయస్కురాలు ఆమే కావచ్చని అంటున్నారు. ది జెరంటాలజీ రీసెర్చ్ గ్రూప్... ఆమెకు ఆల్రెడీ ఈ గుర్తింపు ఇచ్చింది.

మారియాకు ఏప్రిల్‌లో కరోనా సోకింది. ఓ కేర్ హోంలో ఐసోలేట్ చేశారు. కొన్ని వారాల తర్వాత ఆమె ఆరోగ్యం కుదుటపడింది. తాజాగా టెస్ట్ చెయ్యగా... నెగెటివ్ వచ్చింది.

తనకు వ్యాధి నయమయ్యేలా చేసిన కేర్ హోమ్ సిబ్బందికి మారియా కృతజ్ఞతలు తెలిపింది. వ్యాధి వచ్చినప్పుడు నొప్పితో బాధపడ్డానన్న ఆమె... ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నానని చెప్పింది. 113 ఏళ్లపాటూ ఎలా బతకగలిగారని మీడియా ఆమెను ప్రశ్నించింది. ఓ క్షణం మౌనంగా ఉన్న ఆమె... "నేనెప్పుడు స్మోకింగ్ చెయ్యలేదుగా" అంటూ నవ్వేసింది.
Published by: Krishna Kumar N
First published: May 13, 2020, 7:57 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading