హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

భారత్‌ నుంచి బ్రిటన్‌కు ప్రత్యేక విమానం... 136 మంది ప్రయాణం...

భారత్‌ నుంచి బ్రిటన్‌కు ప్రత్యేక విమానం... 136 మంది ప్రయాణం...

భారత్‌ నుంచి బ్రిటన్‌కు ప్రత్యేక విమానం... 136 మంది ప్రయాణం...

భారత్‌ నుంచి బ్రిటన్‌కు ప్రత్యేక విమానం... 136 మంది ప్రయాణం...

Corona Lockdown | Corona Update : ఇండియాలో కరోనా లాక్‌డౌన్ కారణంగా... చిక్కుకుపోయిన... బ్రిటన్ జాతీయుల్ని... ఆ దేశానికి పంపిస్తోంది భారత్.

కరోనా లాక్‌డౌన్ కారణంగా... ప్రయాణికుల విమాన సర్వీసులు అన్నీ ఆగిపోయినా... అప్పుడప్పుడూ విదేశీయుల్ని తరలించేందుకు మాత్రం... కొన్ని విమానాలు నడుస్తున్నాయి. ఇప్పటి వరకూ... అలాంటివి 8 నడిచాయి. తాజాగా 136 మంది ప్రయాణికులతో... బ్రిటీష్ ఎయిర్‌వేస్ విమానం ఇండియా నుంచి బయలుదేరింది.సాధారణంగా విమాన రాకపోకలు లేకపోయినా... మన దేశంలో చిక్కుకుపోయిన విదేశీయుల్ని మానవత్వ హృదయంతో తమ దేశాలకు తరలించేందుకు భారత్ ఇలాంటి ఏర్పాట్లు చేస్తోంది. బహ్రైన్ నుంచి వచ్చిన స్పెషల్ ప్యాసింజర్ రిలీఫ్ ఫ్లైట్... శుక్రవారం 4.59కి శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయ్యింది. 6.46కి తిరిగి టేకాఫ్ అయ్యింది. మొత్తం 136 మంది బ్రిటన్ జాతీయుల్ని అది తీసుకెళ్లింది.ముందుగా ఆ విమానం గుజరాత్... అహ్మదాబాద్ వెళ్తుంది. అక్కడ మరి కొంత మంది విదేశీయుల్ని ఎక్కించుకుంటుంది. తర్వాత బహ్రైన్‌లో ల్యాండ్ అవుతుంది. అక్కడి నుంచి లండన్ వెళ్తుంది.విమానం ఎక్కే ప్రయాణికులందర్నీ... IID టెర్మినల్ నుంచి లోపలికి పంపారు. తద్వారా... అందరూ ఫుల్లుగా శానిటైజ్ అయ్యారు. ఇలా ఇప్పటివరకూ కరోనా లాక్‌డౌన్ విధించాక... ఇప్పటివరకూ 600 మంది బ్రిటన్, అమెరికా, జర్మనీకి వెళ్లారు.ప్రయాణికుల విమానాలు నడవకపోయినా... నిత్యవసర సరుకులు, మందుల ఎగుమతుల కోసం కేంద్ర ప్రభుత్వం కార్గో విమానాల్ని నడుపుతూనే ఉంది.

First published:

ఉత్తమ కథలు