కరోనా పేషెంట్లకు ఇకపై ఆ మందు కూడా సప్లై... అనుమతి ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం

Corona Lockdown | Corona Update : ఓ వైపు హైడ్రాక్సీ క్లోరోక్విన్... కరోనా మరణాల్ని ఆపలేకపోతోందని చెబుతున్న తరుణంలో... మరో కొత్త మందును ఇకపై ఇండియాలో కరోనా పేషంట్లకు ఇవ్వబోతున్నారు.

news18-telugu
Updated: June 20, 2020, 10:02 AM IST
కరోనా పేషెంట్లకు ఇకపై ఆ మందు కూడా సప్లై... అనుమతి ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం
కరోనా పేషెంట్లకు ఇకపై ఆ మందు కూడా సప్లై... అనుమతి ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం (credit - twitter)
  • Share this:
Corona Lockdown | Corona Update : యాంటీ వైరల్ డ్రగ్‌గా పిలిచే ఫావిపిరావిర్ (Favipiravir)ను కరోనా పేషెంట్లకు ఇచ్చేందుకు భారత ఔషధ నియంత్రణ సంస్థ నుంచి తమకు అనుమతి లభించిందని గ్లెన్మార్క్ ఫార్మా తెలిపింది. ఈ మందును కరోనా పేషెంట్లు అందరికీ ఇవ్వరు. కరోనా లక్షణాలు తక్కువగా, అంతంత మాత్రంగా ఉండేవారికీ... లక్షణాలు కాస్త ఎక్కువగా ఉండేవారికి మాత్రమే ఇస్తారు. లక్షణాలు అత్యంత తీవ్రంగా ఉండేవారికి మాత్రం ఈ మందును ఇవ్వరు. కరోనా పేషెంట్లపై ఫావిపిరావిర్‌ను ప్రయోగించి చూసినప్పుడు వచ్చిన ఫలితాల్ని లెక్కలోకి తీసుకొని... ప్రత్యేక నిపుణుల కమిటీ... ఈ మందును కరోనా పేషెంట్లకు ఇవ్వొచ్చని సూచించడంతో... అనుమతి లభించింది.

ప్రస్తుతం ఇస్తున్న మందులు అందుబాటులో లేకపోతే... అప్పుడు మాత్రమే ఫావిపిరావిర్‌ ఇవ్వొచ్చు. అంటే ఎమర్జెన్సీ సమయంలో మాత్రమే ఇది ఇవ్వాలన్నమాట. ఇందుకు పేషెంట్ కుటుంబ సభ్యుల అనుమతి తప్పనిసరి. ఈమధ్యే గ్లెన్మార్క్ కంపెనీ... మూడు దశల్లో ఈ మందును ప్రయోగించి చూసింది. ముందుగా 1000 మంది కరోనా పేషెంట్లకు ఈ మందును ఇచ్చి... ఇది ఎలా పనిచేస్తుందో తెలుసుకుంటామని కంపెనీ నిర్వాహకులు తెలిపారు.

సాధారణంగా ఫ్యావిపిరావిర్‌ను ఇన్‌ఫ్లూయెంజా నివారణకు వాడుతారు. ఇప్పటికా ప్రపంచ దేశాలతోపాటూ... రష్యా, చైనా, జపాన్... ఈ మందును కరోనా పేషెంట్లకు ఇచ్చేందుకు ఆమోదించాయి. ఇప్పుడీ లిస్టులో భారత్ కూడా చేరింది.
First published: June 20, 2020, 10:00 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading