కరోనాకి టాబ్లెట్ల మందు... పనిచేస్తుందా? పూర్తిగా నయం చేస్తుందా? ఇవీ వాస్తవాలు...

Corona Lockdown | Corona Update : ప్రపంచవ్యాప్తంగా కరోనాకి మందు లేదనుకుంటున్న సమయంలో... ICMR ఓ మందుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాని వివరాలు, వాస్తవాలూ తెలుసుకుందాం.

news18-telugu
Updated: June 21, 2020, 8:59 AM IST
కరోనాకి టాబ్లెట్ల మందు... పనిచేస్తుందా? పూర్తిగా నయం చేస్తుందా? ఇవీ వాస్తవాలు...
కరోనాకి టాబ్లెట్ల మందు... పనిచేస్తుందా? పూర్తిగా నయం చేస్తుందా? ఇవీ వాస్తవాలు... (credit - reuters)
  • Share this:
Corona Lockdown | Corona Update : గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ కంపెనీ... ఫావిపిరావిర్... అనే టాబ్లెట్లను ఫాబీఫ్లూ (FabiFlu) అనే బ్రాండ్ నేమ్‌తో కరోనా వైరస్‌కి చెక్ పెట్టేందుకు తయారుచేసింది. ఈ మందుని కరోనా పేషెంట్లు వాడేందుకు అధికారికంగా అనుమతి లభించినట్లు కంపెనీ తెలిపింది. కరోనా వైరస్ అంతంతమాత్రంగా ఉన్నవారికీ, కొద్దిగా లక్షణాలు ఉన్నవారికీ ఈ మందు పనిచేస్తుందనీ... కరోనా తగ్గిపోతుందనీ కంపెనీ తెలిపింది. ఐతే... కరోనా లక్షణాలు తీవ్రంగా ఉంటే మాత్రం ఈ టాబ్లెట్లు పనిచేయవని కంపెనీ క్లియర్‌గా తెలిపింది. అందువల్ల ఇది పూర్తిస్థాయి కరోనాకు చెక్ పెట్టే మందు కాదన్నది నిజం.

ప్రస్తుతం ఒక టాబ్లెట్ ధరను కంపెనీ... రూ.103గా నిర్ధారించింది. ఒక్కో టాబ్లెట్ 200 మిల్లీగ్రాములు ఉంటుందనీ... మొత్తం 34 టాబ్లెట్లు ఉండే స్ట్రిప్ ధర... 3500గా నిర్ణయించినట్లు కంపెనీ తెలిపింది. కరోనా ఉన్నవారు... మొదటి రోజు 1800 మిల్లీ గ్రాముల చొప్పున రెండుసార్లు టాబ్లెట్లు (డోసుకి 9 చొప్పున మొదటి రోజు 18 టాబ్లెట్లు) వేసుకోవాలనీ... ఆ తర్వాత రెండో రోజు నుంచి 14వ రోజు వరకూ... రోజూ 800 మిల్లీగ్రాముల చొప్పున రెండేసి సార్లు టాబ్లెట్లు (డోసుకి 4 చొప్పున రోజూ 8 టాబ్లెట్లు) వేసుకోవాలని కంపెనీ తెలిపింది. అంటే మొత్తం 122 టాబ్లెట్లు వాడాల్సి ఉంటుంది. మొత్తంగా టాబ్లెట్లకు రూ.14000 దాకా ఖర్చు అవుతుంది. ఇలా తాము చెప్పినట్లు డోసులు వేసుకుంటే తక్కువ లక్షణాలు ఉన్న వారికి కరోనా కచ్చితంగా తగ్గుతుందని కంపెనీ తెలిపింది.

ప్రస్తుతం గ్లెన్మార్క్ కంపెనీ... ఒక్కో పేషెంట్‌కీ 2 స్ట్రిప్పుల చొప్పున మొత్తం 82500 మంది పేషెంట్లకు సరిపడా టాబ్లెట్లను మొదటి నెలలో తయారుచేయగలమని తెలిపింది. ఐతే... పరిస్థితులను బట్టీ... ఇంకా ఎక్కువ ఉత్పత్తి చేసేందుకు ప్రయత్నిస్తామని వివరించింది. ఫాబీఫ్లూ టాబ్లెట్లు ఆస్పత్రులు, రిటైల్ మెడికల్ షాపుల్లో కూడా కొనుక్కోవచ్చని తెలిపింది.

ముంబైకి చెందిన ఈ కంపెనీకు... శుక్రవారం... డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) నుంచి తయారీ, మార్కెటింగ్ అనుమతి లభించింది. ఈ మందు ద్వారా కరోనాకు చెక్ పెట్టగలమని కంపెనీ యాజమాన్యం ఆశాభావం వ్యక్తం చేసింది.

ఫావిపిరావిర్‌ను క్లినికల్ ట్రయల్స్‌లో భాగంగా... కరోనా తక్కువగా, మధ్యస్థాయిలో ఉన్న పేషెంట్లకు ఇచ్చినప్పుడు 88 శాతం మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఈ మందును 2014లో జపాన్ ఆమోదించింది. తద్వారా దీన్ని ఇన్‌ఫ్లూయెంజా వైరస్‌ ఇన్ఫెక్షన్లకు విరుగుడుగా వాడుతున్నారు.
First published: June 21, 2020, 8:59 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading