కూలీలకు రోబోల సవాలు... ఉపాధిని లాగేసుకుంటాయా?

Corona Lockdown | Corona Update : కరోనా వచ్చి వలస కూలీలకు తాత్కాలికంగా ఉపాధిని పోగొట్టిందని అనుకుంటున్నాం. కానీ చూస్తుంటే... శాశ్వతంగా ఉపాధిని దూరం చేస్తున్నట్లు కనిపిస్తోంది.

news18-telugu
Updated: May 30, 2020, 10:31 AM IST
కూలీలకు రోబోల సవాలు... ఉపాధిని లాగేసుకుంటాయా?
కూలీలకు రోబోల సవాలు... ఉపాధిని లాగేసుకుంటాయా? (credit - twitter)
  • Share this:
Corona Lockdown | Corona Update : ఈ ప్రంపంచంలో ఎప్పటి నుంచో రోబో రివల్యూషన్ ఉన్నా... ఇన్నాళ్లూ దాన్ని ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు మాత్రం కరోనా కాలంలో... పెద్ద పెద్ద కంపెనీలన్నీ రోబోలవైపు చూస్తున్నాయి. వలస కూలీలు, రోజువారీ కార్మికుల స్థానంలో... రోబోలను దించితే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తున్నాయి. ఇందుకు చాలా కారణాలు ఉన్నాయి. రోబోలతోనే పని జరుగుతూ ఉంటే... కరోనా కాలంలో ఫ్యాక్టరీలు, స్టోర్లూ మూయాల్సిన అవసరమే ఉండేది కాదని కంపెనీలు భావిస్తున్నాయి. అంతేకాదు రోబోలతో కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. అవి ఎంతకీ అలసిపోవు. వాటికి షిఫ్టులతో పనిలేదు. అవి శాలరీలు అడగవు. అవి సమ్మెలు చెయ్యవు. సిక్ లీవ్స్ అడగవు. వీకాఫ్స్ తీసుకోవు. ఏదైనా తేడా వస్తే రిపేర్ చేయడం తేలిక, ఉద్యోగులైతే... ఉద్యోగం మానేసే ఛాన్స్ ఉంటుంది. రోబోలు అలా చెయ్యవు. రోబోలకు ఒకసారి పెట్టుబడి పెడితే చాలు పదేళ్ల వరకూ... సమస్య ఉండదంటున్నారు. ఇలాంటి కారణాల్ని చూస్తూ... పెద్ద కంపెనీలన్నీ రోబోలను దింపే అంశాన్ని పరిశీలిస్తున్నాయి.


రోబోలతో కొన్ని సమస్యలూ ఉన్నాయి. వస్తువుల్ని మోసేటప్పుడు అవి మనుషులంత వేగంగా పని చెయ్యలేవు. మనుషులు స్వతసిద్ధంగా ఆలోచించగలరు. రోబోలకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పూర్తిస్థాయిలో ఉండదు. రోబోల్ని కంట్రోల్ చెయ్యడానికి కూడా మనుషుల అవసరం తప్పదు. రోబోలకు రిపేర్లు వస్తే... విదేశాలపై ఆధారపడక తప్పదు. ఇలా కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ... కాలాన్ని బట్టీ... అవసరాల్నీ బట్టీ మార్పులు తప్పవంటున్నారు నిపుణులు.


ఇండియాలో రోబో రివల్యూషన్ తక్కువే. ఆటోమొబైల్ లాంటి రంగంలోనే రోబోలతో ఉత్పత్తులు తయారవుతున్నాయి. అయితే... ఇప్పుడిప్పుడే ఇండియాలో కూడా రోబోల వాడకం కనిపిస్తోంది. ముఖ్యంగా కరోనా వచ్చాక... రోబోలతోనే పేషెంట్లకు కొన్ని రకాల సేవలు చేస్తున్నారు. అలాగే... రెస్టారెంటల్లోనూ రోబోలు పనిచేస్తున్నాయి. కొన్ని రకాల సర్జరీలు కూడా రోబోలే చేస్తున్నాయి. ఇండియాలో రోబో టెక్నాలజీ రావడానికి మరికొస్త సమయం పట్టే అవకాశాలున్నా... విదేశాల్లో, సంపన్న దేశాల్లో మాత్రం రోబోల వాడకం కచ్చితంగా విప్లవాత్మక స్థాయిలో పెరుగుతుందని అంచనా వేస్తున్నారు నిపుణులు.

Published by: Krishna Kumar N
First published: May 30, 2020, 10:31 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading