భారత్‌కు ఫ్రీగా వెంటిలేటర్లు... ట్రంప్ కొత్త ఎత్తుగడ...

Corona Lockdown | Corona Update : అమెరికా అధ్యక్షుడికి ఉన్నట్టుండి భారత్‌పై ప్రేమ పుట్టుకొచ్చిందా? ట్రంప్ ఎందుకీ ఆఫర్ ఇచ్చారు?

news18-telugu
Updated: May 16, 2020, 6:27 AM IST
భారత్‌కు ఫ్రీగా వెంటిలేటర్లు... ట్రంప్ కొత్త ఎత్తుగడ...
ట్రంప్ తీసుకున్న నిర్ణయం అమెరికా ఆర్థిక రంగాన్ని దెబ్బతీస్తుందని, కుటుంబాలను విడదీస్తుందని భారతీయుల తరపున దావా వేసిన న్యాయవాది వాస్డెన్ బనియాస్ కోర్టుకు తెలిపారు.
  • Share this:
Corona Lockdown | Corona Update : ఓవైపు చైనాలో కంపెనీలు భారత్‌కి రాకుండా అడ్డుపుల్లలు వేస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్... భారత్‌ను మచ్చిక చేసుకునేందుకు వెంటిలేటర్ల ఎత్తుగడ వేసినట్లు కనిపిస్తోంది. ప్రధాని మోదీ తనకు మంచి ఫ్రెండ్‌గా చెప్పుకునే ట్రంప్... కరోనా కాలంలో భారత్‌కి అండగా నిలుస్తామని ప్రకటించారు. ఇండియాకి వెంటిలేటర్లు డొనేట్ చేస్తామన్న ట్రంప్... రెండు దేశాలు కలిసి... వ్యాక్సిన్ తయారుచేసి... కరోనా అంతు చూస్తాయని అన్నారు. ట్రంప్ చేసిన ట్రీట్‌పై భారత్ నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

గత నెల్లో యాంటీ-మలేరియా డ్రగ్... హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను అమెరికా సహా విదేశాలకు ఎగుమతి చెయ్యడానికి ఉన్న నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం ఎత్తి వేసింది. అప్పట్లో ఈ నిర్ణయంపై అమెరికా హర్షం వ్యక్తం చేసింది. తమ దేశంలో కరోనాపై పోరాటంలో హైడ్రాక్సీ క్లోరోక్విన్ కీలకం కానుందని ట్రంప్ అన్నారు. ఆ తర్వాత ఇప్పుడు ట్రంప్ కూడా భారత్‌కి అనుకూల నిర్ణయం తీసుకున్నారు. ఆల్రెడీ కరోనాపై వ్యాక్సిన్ తయారీలో భారత్, అమెరికా కలిసి ప్రయోగాలు చేస్తున్నాయి.

ఐతే... ట్రంప్‌కి అతి తెలివి ఎక్కువనే విమర్శలు వస్తున్నాయి. ఓవైపు చైనా నుంచి వచ్చే కంపెనీలను ఆకట్టుకునేందుకు భారత్ ప్రయత్నిస్తుంటే... ట్రంప్ అడ్డుకుంటున్నారు. అమెరికా కంపెనీలు తిరిగి స్వదేశానికే రావాలనీ, లేదంటే కొత్త పన్నులు తప్పవని ట్రంప్‌ హెచ్చరించారు. "ఇండియాకు వెళ్తామని యాపిల్‌ కంపెనీ అంటోంది. అదే జరిగితే ఆ కంపెనీకి పన్ను పోటు తప్పదు" అని ట్రంప్ అన్నారు. అమెరికాకు వచ్చే కంపెనీలకు పన్ను ప్రోత్సాహకాలు ఉంటాయని చెప్పడం ద్వారా... ట్రంప్ ఇండియాకి తీరని ద్రోహం చేస్తున్నట్లే అంటున్నారు ఆర్థిక వేత్తలు.

భారత్ నుంచి ఎగుమతి అవుతున్న హైడ్రాక్సీ క్లోరోక్విన్ ద్వారా అమెరికా చాలా ప్రయోజనాలు పొందుతోంది. రేపు అమెరికా కంపెనీ కరోనాకి వ్యాక్సిన్ తయారుచేస్తే... దాన్ని ప్రపంచ దేశాలతోపాటూ... ఇండియా కూడా పెద్ద మొత్తంలో కొనక తప్పదు. ఐతే... అమెరికాతోపాటూ... మరే దేశమైనా కూడా వ్యాక్సిన్ తయారుచేస్తే... అప్పుడు ఇండియా తమ దేశ వ్యాక్సినే కొనాలని ట్రంప్ ఒత్తిడి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకు ఇప్పటి నుంచే ట్రంప్ ఎత్తుగడలు వేస్తున్నారనే వాదన వినిపిస్తోంది. ఐతే... ఇండియా మాత్రం స్వయంగా వ్యాక్సిన్ తయారుచేసే అంశంపై దృష్టిసారిస్తోంది.
Published by: Krishna Kumar N
First published: May 16, 2020, 6:27 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading