సముద్రంలో అద్భుతం... ప్రజలకు గిఫ్టులు తెచ్చి ఇస్తున్న డాల్ఫిన్...

Corona Lockdown | Corona Update : కరోనా లాక్‌డౌన్ కారణంగా... రెండు నెలలుగా సందర్శకులను మిస్సైన డాల్ఫిన్... వాళ్లను తిరిగి కలుస్తూ గిఫ్టులు ఇస్తోంది.

news18-telugu
Updated: May 24, 2020, 1:16 PM IST
సముద్రంలో అద్భుతం... ప్రజలకు గిఫ్టులు తెచ్చి ఇస్తున్న డాల్ఫిన్...
సముద్రంలో అద్భుతం... ప్రజలకు గిఫ్టులు తెచ్చి ఇస్తున్న డాల్ఫిన్... (credit - Facebook)
  • Share this:
Corona Lockdown | Corona Update : డాల్ఫిన్ ఏంటి... గిప్టులు తేవడమేంటి... కావాలనే మిస్ లీడింగ్ హెడ్డింగ్ పెట్టారు అనుకోకండి. ఆ డాల్ఫిన్ నిజంగానే సముద్రంలోంచీ గిఫ్టులు తెచ్చిన సందర్శకులకు ఇస్తోంది. చాలా కాలం తర్వాత మనం ఫ్రెండ్స్‌ని కలిస్తే... ఎలా పండ్ల వంటివి ఇస్తామో అలా అన్నమాట. ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌లో కూలూలా తీరం ఉంది. అక్కడ టిన్ కాన్ బే అనే డాల్ఫిన్ ఫీడింగ్ సెంటర్ ఉంది. కరోనాకి ముందు టూరిస్టులు వచ్చి... డాల్ఫిన్లను చూసి వెళ్లేవారు. లాక్‌డౌన్ వల్ల ఓ రెండు నెలలు రావడం మానేశారు. దాంతో... తమను చూసేందుకు ఎవరూ రావట్లేదే అని తెగ ఫీలైపోయాయి. ఇప్పుడు మళ్లీ సందర్శకులు వస్తుంటే... గ్రాండ్ వెల్‌కం అంటూ ఓ డాల్ఫిన్ సముద్రంలోకి వెళ్లి... ఏదొ ఒకటి తెచ్చి వారికి ఇస్తోంది. అలా ఇచ్చే గిఫ్టుల్లో సముద్ర మొక్కలు, కలప ముక్కలు, ఆల్చిప్పలు, ప్లాస్టిక్ వస్తువులు, సీసాలు రకరకాలవి ఉంటున్నాయి.

సముద్రంలో అద్భుతం... ప్రజలకు గిఫ్టులు తెచ్చి ఇస్తున్న డాల్ఫిన్... (credit - Facebook)


ఈ మగ డాల్ఫిన్ పేరు మిస్టిక్. వయసు 29 ఏళ్లు. ఫీడింగ్ సెంటర్ పక్కనే బర్కాకల్స్ కేఫ్ ఉంటుంది. అక్కడకు వచ్చే సందర్శకులు ఆటోమేటిక్‌గా డాల్పిన్లను చూసేందుకు వస్తారు. ఇప్పుడిలా గిఫ్టులు ఇస్తుండటంతో... ఇక వాళ్ల ఆశ్చర్యానికి హద్దు లేకుండా పోతోంది. "అరేయ్... నాకు గిఫ్టు ఇచ్చిందిరా" అని ఫ్రెండ్స్‌కి చూపించి తెగ ఆనందపడుతున్నారు.

గిఫ్టులను డాల్ఫిన్ ఎంతో జాగ్రత్తగా తెస్తోంది. కొన్నింటిని ముక్కుకు చుట్టుకొని... కొన్నింటిని ముక్కుపై బ్యాలెన్స్ చేస్తూ సముద్రంలోంచీ తెస్తోంది. ఈ డాల్ఫిన్‌కి ఇలా గిఫ్టులు ఇవ్వమని ట్రైనింగ్ ఏదీ ఇవ్వలేదు. ఇదే అలవాటు చేసుకుంది. అందుకే ఆశ్చర్యపోతూ... ఫీడింగ్ సెంటర్ వాళ్లు... ఫేస్‌బుక్‌లో వీడియోలు పెట్టారు.

గిఫ్టు తీసుకున్నాక... థాంక్స్ చెబితే సరిపోదు కదా అనుకుంటూ... ప్రజలు... డాల్ఫిన్‌కి ఓ చేపను రిటర్న్ ఇస్తున్నారు. అది ఆ చేపను గుటుక్కుమనిపిస్తోంది. ఇలా చేపలు వేస్తుంటే... ఒక్కోసారి ఈ డాల్ఫిన్... ఒకేసారి 10 గిఫ్టులు తెస్తోంది. వాటిని వరుసగా పెట్టి.... వన్ బై వన్ ఇస్తోంది. ఈ సెంటర్‌లో 7 డాల్ఫిన్లు ఉన్నా... ఇదొక్కటే ఇలా మనుషుల్లా ప్రవర్తిస్తోంది. అందుకే ఇది ఫేమస్ అయ్యింది. మే 16న ఈ సెంటర్‌ని తిరిగి తెరిచారు.

Published by: Krishna Kumar N
First published: May 24, 2020, 1:13 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading