ఇండియాలో 30 శాతం పడిపోయిన డిజిటల్ చెల్లింపులు... నోట్ల రద్దు తర్వాత తొలిసారి...

Corona Lockdown | Corona Update : నోట్ల రద్దు తర్వాత ఎక్కువ మంది ఆన్‌లైన్ డిజిటల్ చెల్లింపులు చేస్తున్నారు. మరి ఈ చెల్లింపులు ఎందుకు తగ్గాయి?

news18-telugu
Updated: April 25, 2020, 12:41 PM IST
ఇండియాలో 30 శాతం పడిపోయిన డిజిటల్ చెల్లింపులు... నోట్ల రద్దు తర్వాత తొలిసారి...
ఇండియాలో 30 శాతం పడిపోయిన డిజిటల్ చెల్లింపులు... నోట్ల రద్దు తర్వాత తొలిసారి... (File)
  • Share this:
Corona Lockdown | Corona Update : కరోనా వైరస్ కరెన్సీ నోట్లపై 2 రోజులు జీవిస్తుందనే అంచనాలు ఉండటంతో... ఇండియాలో చాలా మంది తాము కొనే వస్తువులకు చెల్లింపులు ఆన్‌లైన్ డిజిటల్ ప్లాట్‍‌ఫామ్స్ ద్వారా చేస్తున్నారు. గుగుల్ పే, పేటీఎం, యూపీఐ వంటి యాప్స్ ఉపయోగిస్తున్నారు. ఈ లెక్కన చూస్తే... డిజిటల్ చెల్లింపుల ట్రాన్సాక్షన్స్ పెరగాలి. అలాంటిది... నోట్ల రద్దు తర్వాత తొలిసారిగా... ఈ ట్రాన్సాక్షన్స్ 30 శాతం తగ్గిపోయాయి. ఎందుకంటే... ఇండియన్స్ ఇప్పుడు అత్యవసరాలు, నిత్యవసరాలు మాత్రమే కొనుక్కుంటున్నారనీ, సౌకర్యాలు, విలాస వస్తువుల జోలికి వెళ్లట్లేదనీ రేజర్‌పే సంస్థ సర్వేలో తెలిసింది. ఇండియాలో 30 రోజుల లాక్‌డౌన్‌ పూర్తైన సందర్భంగా సంస్థ ఈ రిపోర్ట్ తెచ్చింది.

2016లో ప్రధాని మోదీ నోట్ల రద్దు తెచ్చాక... ఫైనాన్షియల్ టెక్నాలజీ కంపెనీలకు కలిసొచ్చింది. ఆన్‌లైన్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ బాగా పెరిగాయి. మార్జి 24న లాక్ డౌన్ ప్రకటించాక... మొదటి రెండు వారాలూ దేశంలో ఆన్‌లైన్ చెల్లింపులు... సాధారణం కంటే 10 శాతం ఎక్కువగా జరిగాయి. ఆ తర్వాత నుంచి గ్రాఫ్ పడిపోతూ వస్తోంది. ప్రజలు ఇళ్లలోనే ఉండిపోవడం, ఖర్చులపై జాగ్రత్తలు తీసుకోవడమే ఇందుకు కారణం.

లాజిస్టిక్స్‌లో ట్రాన్సాక్షన్స్ 96 శాతం పడిపోయాయి. ట్రావెల్ సెక్టార్‌లో 87 శాతం, రియల్ ఎస్టేట్‌లో 83 శాతం, ఫుడ్ అండ్ బేవరేజెస్‌లో 68 శాతం, గ్రాసరీస్‌లో 54 శాతం చెల్లింపుల ట్రాన్సాక్షన్స్ తగ్గిపోయాయి. ఐతే... ఆన్‌లైన్ డొనేషన్లు మాత్రం 180 శాతం పెరిగాయి. కారణం... కరోనా నివారణలో పేదల కోసం చాలా స్వచ్ఛంద సంస్థలు విరాళాలు సేకరిస్తు్నాయి.

ఇప్పటివరకూ నిత్యవసరాలు, అత్యవసరాలు మాత్రమే అందుబాటులో ఉండటంతో... ప్రజలు వాటిని మాత్రమే కొనుక్కుంటుంటే... చెల్లింపులు చాలా వరకూ తగ్గిపోయాయి. పేటీఎం చెల్లింపులు 47 శాతం, గూగుల్ పే చెల్లింపులు 43 శాతం, ఫోన్ పే చెల్లింపులు 32 శాతం తగ్గినట్లు రిపోర్ట్ చెబుతోంది.

అయితే, కొవిడ్ 19 వెళ్లిపోయిన తర్వాత డిజిటల్ చెల్లింపులు, ట్రాన్సాక్షన్లకు మంచి ఫ్యూచర్ ఉంటుందని రేజర్ పే సంస్థ అంచనా వేసింది. ఇందుకు సంబంధించి బ్యాంకులు, డిజిటల్ పే సంస్థలు... సరికొత్త టూల్స్ యూజర్ల కోసం తేవాల్సి ఉంటుందని సూచించింది.
First published: April 25, 2020, 12:41 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading