తల్లి కోసం 15 రోజులుగా చిన్నారి ఎదురుచూపులు... ప్రభుత్వాన్ని కదిలించిన ఘటన...

తల్లి కోసం 15 రోజులుగా చిన్నారి ఎదురుచూపులు... ప్రభుత్వాన్ని కదిలించిన ఘటన...

తల్లి కోసం 15 రోజులుగా చిన్నారి ఎదురుచూపులు... ప్రభుత్వాన్ని కదిలించిన ఘటన... (credit - twitter)

Corona Lockdown | Coronaupdate : కరోనా వైరస్ మహమ్మారి తరిమేసేందుకు ఎంతో మంది డాక్టర్లు, వైద్య సిబ్బంది పడుతున్న శ్రమ, బాధలు అన్నీ ఇన్నీ కావు.

 • Share this:
  Corona Lockdown | Coronaupdate : అది కర్ణాటక... బెల్గాంలోని ప్రభుత్వ ఆస్పత్రి. దాని ఎదురుగా ఆస్పత్రి వైద్య సిబ్బంది, నర్సులు ఉండేందుకు తాత్కాలిక ఏర్పాట్లు చేశారు. అక్కడ ఓ తండ్రి గుక్కపెట్టి ఏడుస్తున్న తన మూడేళ్ల పసి పాపను ఓదార్చేందుకు ప్రయత్నిస్తున్నాడు. కానీ ఆ పాప ఎంతకీ ఏడుపు ఆపట్లేదు. "అమ్మ కావాలి, అమ్మను చూడాలి" అంటూ... మారాం చేస్తోంది. పాప ఎంత ఏడుస్తున్నా... ఆస్పత్రి లోంచీ తల్లి బయటకు రావట్లేదు. ఆ ఆస్పత్రిలో 15 రోజులుగా ఆమె ఐసోలేషన్ వార్డులో నర్సుగా సేవలు అందిస్తోంది. తను ఇంటికి వెళ్తే... తన వల్ల తన వాళ్లకేమైనా కరోనా సోకుతుందేమోనన్న భయంతో ఆమె ఇంటికి వెళ్లట్లేదు. రోజూ ఏడుస్తున్న పాపను ఓదార్చలేక... ఓసారి తల్లిని కళ్లారా చూపిద్దామని తండ్రి... ఆ చిన్నారిని ఆస్పత్రికి తీసుకొచ్చాడు.

  ఆ సమయంలో... ఆమె ఆస్పత్రిలోనే ఉంది. ఆమె బయటకు రావడానికి కొంత సమయం పట్టింది. అప్పటివరకూ కూతుర్ని ఎలా ఓదార్చాలో, ఆ చిట్టితల్లికి ఏం చెప్పి ఏడుపు ఆపించాలో ఆ తండ్రికి అర్థం కాలేదు. కాసేపటి తర్వాత... ఆస్పత్రి నుంచి బయటకు వచ్చిన తల్లి... తన కూతుర్ని చూసి... కన్నీటి సంద్రమైంది. అన్ని రోజులూ హృదయంలో గూడుకట్టుకున్న ప్రేమను దాచుకోలేక... అలాగని కూతురి దగ్గరకు వెళ్లలేక... దూరం నుంచే ఓదార్చింది.

  India Trusts Pm Modi, extend the lockdown, corona update, coronavirus outbreak, coronavirus lockdown, coronaupdate, fight with corona virus, కరోనా లాక్‌డౌన్, కరోనా అప్‌డేట్, కరోనా న్యూస్, తెలుగు వార్తలు,
  తల్లి కోసం 15 రోజులుగా చిన్నారి ఎదురుచూపులు... ప్రభుత్వాన్ని కదిలించిన ఘటన... (credit - twitter)


  ఇలా తల్లీ, కూతురూ ఏడుస్తుంటే... ఆ హృదయ విదారక ఘటన... అక్కడి వారందరి హృదయాల్నీ కదిలించింది. ఈ దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అది చివరకు ముఖ్యమంత్రి యడియూరప్ప దృష్టికి వెళ్లింది. యడియూరప్ప కూడా ఐదుగురు పిల్లలకు తండ్రే. వారిలో ముగ్గురు అమ్మాయిలే. ఈ విషయం తెలిశాక ఆయన కూడా ఏడ్చేశారు. బుధవారం ఆ తల్లి నర్సుకి కాల్ చేసి... ఆమె నిస్వార్థమైన సేవను మెచ్చుకున్నారు. ధన్యవాదాలు చెప్పారు. తల్లిలేకపోతే అన్నం కూడా తిననని మారం చేస్తున్న కూతురి విషయం తాను తెలుసుకున్నానన్న యడియూరప్ప... ఆమెకు, ఆమెలా కరోనా కోసం జీవితాల్ని పణంగా పెడుతున్న నర్సులందరికీ సాయం చేస్తానని మాట ఇచ్చారు.

  బెల్గాంలోని బెల్గాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (BIMS)లో నాలుగేళ్లుగా స్టాఫ్ నర్సుగా చేస్తున్నారు సునంద. ఇప్పటి వరకూ బెల్గాంలో ఏడుగురుకి కరోనా పాజిటివ్ వచ్చింది. మరికొందరు అనుమానితులుగా ఆస్పత్రిలో ట్రీట్‌మెంట్ పొందుతున్నారు.

  ఇండియాలో కరోనా వైరస్ వ్యాపించిన తర్వాత దేశవ్యాప్తంగా డాక్టర్లు, నర్సులు, వైద్య సిబ్బంది, హెల్త్ వర్కర్లు, శానిటేషన్ వర్కర్లు, పోలీసులు, పారిశుధ్య కార్మికులు ఇలా అంతా... కరోనా వైరస్‌పై నిరంతరం పోరాడుతూనే ఉన్నారు. చాలా మంది తమ కుటుంబ సభ్యులకు, తమ గారాలపట్టీలకు దూరంగా ఉంటున్నా్రు. ఈ మహమ్మారి ఎప్పుడు వదిలిపోతుందా అని క్షణక్షణం ఎదురుచూస్తున్నారు. విదేశాల్లో లాగా మన దేశంలో ఆస్పత్రుల్లో బ్రహ్మాండమైన సదుపాయాలు లేకపోయినా... తమ ప్రాణాలు కూడా లెక్క చెయ్యకుండా వారు కరోనా బాధితులకు సేవలు చేస్తున్నారు.

  Published by:Krishna Kumar N
  First published:

  అగ్ర కథనాలు