మళ్లీ జోరుగా కరోనా... పెరుగుతున్న కేసులు... రష్యా, బ్రెజిల్, భారత్‌లో డేంజర్ బెల్స్...

మళ్లీ జోరుగా కరోనా... పెరుగుతున్న కేసులు... రష్యా, బ్రెజిల్, భారత్‌లో డేంజర్ బెల్స్... (credit - WHO)

Corona Lockdown | Corona Update : కరోనా వైరస్ తగ్గిపోతుందని ప్రపంచ దేశాలు చెబుతున్నాయి... అది నిజమేనా?

 • Share this:
  Corona Lockdown | Corona Update : చైనాలో కరోనా వైరస్ ప్రారంభమైన కొత్తలో ప్రజల్లో ఎంతో భయం ఉండేది. ఇప్పుడు ప్రపంచమంతా కరోనా ఉన్నా ప్రజల్లో అంతగా భయం లేదు. కరోనాకి ప్రజలు అలవాటుపడిపోతున్నారా? అన్న ప్రశ్న తలెత్తుతోంది. ప్రపంచదేశాలన్నీ ఆంక్షల్ని సడలిస్తుంటే... క్రమంగా కరోనా మళ్లీ పెరుగుతోంది. తాజాగా సోమవారం ఒక్కరోజే 77515 కేసులు నమోదై... మొత్తం కేసుల సంఖ్య 3641204కి చేరింది. అలాగే... కొత్తగా మరో 3802 మంది చనిపోవడంతో... మొత్తం మరణాల సంఖ్య 251947కి చేరింది. తగ్గిపోతుంది అనుకునే సమయంలో... కరోనా మళ్లీ విజృంభిస్తోంది. ప్రస్తుతం 49627 మందికి ICUలో ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు. మొత్తం కేసుల్లో వీరి సంఖ్య 2 శాతంగా మాత్రమే ఉండటం ఒకింత ఉపశమనం.

  అమెరికాలో కరోనా ఎప్పటికి కంట్రోల్ అవుతుందో అంచనాకు అందట్లేదు. సోమవారం కొత్తగా 23716 కేసులొచ్చాయి. మొత్తం కేసులు 1211838కి చేరాయి. అలాగే సోమవారం 1112 మంది చనిపోవడంతో... మొత్తం మరణాల సంఖ్య 69709కి చేరింది. అమెరికాలో లక్ష మంది దాకా చనిపోవచ్చని ట్రంప్ అంచనా వేశారు.

  అమెరికా తర్వాత... రష్యాలో నిన్న ఒక్క రోజే 10581 కేసులొచ్చాయి. అలాగే బ్రెజిల్ (6697), బ్రిటన్ (3985)లో కేసులు విపరీతంగా పెరిగాయి.

  మరో షాకింగ్ విషయమేంటంటే... కేసులు ఎక్కువగా నమోదవుతున్న టాప్ 10 దేశాల్లో ఇండియా కూడా చేరిపోయింది. తాజాగా ఇండియాలో 42836 కేసులుండగా... మృతుల సంఖ్య 1389కి చేరింది.

  ఇప్పటివరకూ ఎక్కువ కేసులు నమోదయ్యే స్పెయిన్, ఇటలీ, ఫ్రాన్స్, టర్కీ, ఇరాన్, కెనడా, పెరు, ఈక్వెడార్, సౌదీ అరేబియా కంటే ఇప్పుడు ఇండియాలోనే రోజూ ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి.

  ఏపీలో రోజుకు కనీసం 60-70 కేసులొస్తున్నాయి. 24 గంటల్లో 67 కొత్త కేసులు నమోదయ్యాయి. చిత్తూరులో 1, గుంటూరు 19, కడప 4, కృష్ణా 12, కర్నూలు 25, విశాఖపట్నంలో 6 కొత్త కేసులు నమోదయ్యాయి. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1650కి చేరింది. 33 మంది మరణించారు. ప్రస్తుతం 1093 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

  తెలంగాణలో ఓసారి కేసులు పెరుగుతూ... ఓసారి తగ్గుతూ ఉన్నాయి. తాజాగా 3 కొత్త కేసులు నమోదయ్యాయి. తాజాగా 40 మంది డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1085కి చేరింది. వీరిలో కరోనాతో పోరాడుతూ ఇప్పటి వరకు 585 మంది కోలుకోగా... 29 మరణించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 471 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.

  ఓవరాల్‌గా చూస్తే... కరోనా ఇదివరకు తక్కువగా ఉండే భారత్, రష్యా, బ్రెజిల్ లాంటి దేశాల్లో ఇప్పుడు ఎక్కువగా నమోదవుతోంది. ఐతే... ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణాలు తగ్గుతుండటం మాత్రం శుభ పరిణామం అనుకోవచ్చు. ప్రధానంగా ఇండియాలో కరోనా అదుపు తప్పినట్లే కనిపిస్తోంది. కేంద్ర, రాష్ట్రాలు మరింత జాగ్రత్త పడకపోతే ఇబ్బందే అనుకోవచ్చు.
  Published by:Krishna Kumar N
  First published: