జోరు తగ్గని కరోనా... డేంజర్ జోన్లుగా అమెరికా, రష్యా, బ్రిటన్, బ్రెజిల్...

జోరు తగ్గని కరోనా... డేంజర్ జోన్లుగా అమెరికా, రష్యా, బ్రిటన్, బ్రెజిల్... (credit - WHO)

Corona Lockdown | Corona Update : కొన్ని దేశాల్లో తగ్గినట్లు కనిపిస్తున్న కరోనా... మరికొన్ని దేశాల్లో అనూహ్యంగా పెరిగిపోతోంది.

 • Share this:
  Corona Lockdown | Corona Update : ప్రపంచవ్యాప్తంగా కరోనా దాడి కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా అమెరికా, రష్యా, బ్రెజిల్‌, బ్రిటన్‌పై ఈ మహమ్మారి విరుచుకుపడుతోంది. రష్యాలో... శనివారం ఒక్కరోజే 9వేలకు పైగా కేసులు నమోదవ్వడం తీవ్ర ఆందోళన కలిగించే అంశం. ప్రపంచవ్యాప్తంగా శనివారం కొత్తగా 81427 కేసులు నమోదవ్వగా... కొత్తగా 5133 మంది చనిపోయారు. ప్రస్తుతం ఓవరాల్ కేసుల సంఖ్య 3479521గా ఉండగా... మరణాల సంఖ్య 244581గా ఉంది. రికవరీ కేసుల సంఖ్య 1108023గా ఉండగా... ప్రస్తుతం 2126917 మంది కరోనాతో బాధపడుతున్నారు. వీరిలో... 50864 మందికి వైరస్ తీవ్రంగా ఉంది.

  అమెరికాలో శనివారం ఒక్కరోజే 28400 కేసులు నమోదవ్వగా... మొత్తం కేసుల సంఖ్య 1159430కి చేరింది. అలాగే... శనివారం 1638 మంది చనిపోవడంతో... మొత్తం మరణాల సంఖ్య 67391కి చేరింది. అమెరికాలో ప్రతి పది లక్షల మందిలో 204 మందికి కరోనా సోకుతోంది. అదే ఇండియాలో ప్రతి 10 లక్షల మందిలో ఒకరికి కరోనా సోకుతోంది.

  అమెరికా తర్వాత ఇప్పుడు రష్యాలో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం రష్యాలో 124054 మందికి కరోనా సోకగా... శనివారం 53 మంది చనిపోవడంతో... మొత్తం మరణాల సంఖ్య 1222గా ఉంది. రష్యాలో ఇప్పటివరకూ మరణాలు తక్కువగానే ఉండేవి... ఇప్పుడు వాటి సంఖ్య పెరుగుతోంది.

  రష్యా తర్వాత... బ్రెజిల్‌లో అనూహ్యంగా కేసులు పెరుగుతున్నాయి. శనివారం అక్కడ 4450 కేసులు నమోదవ్వడంతో... మొత్తం కేసుల సంఖ్య 96559కి చేరింది. అలాగే శనివారం 340 మంది చనిపోవడంతో... మొత్తం మరణాల సంఖ్య 6750కి చేరింది.

  ఇక ఎప్పటి నుంచో ఎక్కువ కేసులు నమోదవుతున్న బ్రిటన్‌లో పరిస్థితి ఇప్పటికీ అదుపులో లేదు. శనివారం అక్కడ కొత్తగా 4806 కేసులు నమోదవ్వగా... మొత్తం కేసుల సంఖ్య 182260కి చేరింది. అలాగే శనివారం 621 మంది చనిపోవడంతో మొత్తం మరణాల సంఖ్య 28131కి చేరింది.

  ఇక ఇండియాలో తొలిసారిగా శుక్రవారం ఏకంగా 2411 కేసులు నమోదవ్వడంతో... మొత్తం కేసుల సంఖ్య 37776కి చేరింది. ఇంత ఎక్కువ కేసులు ఇదివరకు ఎప్పుడూ నమోదు కాలేదు. మరణాలు కూడా 71 నమోదవ్వడంతో... మొత్తం మరణాల సంఖ్య 1223కి చేరింది. మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్, రాజస్థాన్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్‌లో వెయ్యికి పైగా కేసులుండగా... ఒక్క మహారాష్ట్రలోనే 11506 కేసులున్నాయి.

  తెలంగాణలో కొత్తగా 17 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒకరు ప్రాణం కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 1061కి చేరింది. చనిపోయిన వారి సంఖ్య 29కి పెరిగింది.
  499 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 533.

  ఏపీలో కొత్తగా 62 కేసులు నమోదవ్వడంతో... మొత్తం కేసుల సంఖ్య 1525కి చేరింది. వాటిలో 441 మంది ఆల్రెడీ డిశ్చార్జి అయ్యారు. 33 మంది చనిపోయారు. అందువల్ల ప్రస్తుతం 1051 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.
  Published by:Krishna Kumar N
  First published: