Corona Vaccine : ఆ 30 ఆడ కోతులపై పుణెలో కరోనా వ్యాక్సిన్ ప్రయోగం... ఏంటి వాటి ప్రత్యేకత?

Corona Lockdown | Corona Update : మనిషి రూపాంతరం చెందింది కోతుల నుంచే అని సైన్స్ చెబుతోంది. మనిషి లక్షణాలతో ఉండే కోతులపై వ్యాక్సిన్ సక్సెస్ అయితే... మనుషులకూ సక్సెస్ అవుతుందా?

news18-telugu
Updated: June 3, 2020, 1:42 PM IST
Corona Vaccine : ఆ 30 ఆడ కోతులపై పుణెలో కరోనా వ్యాక్సిన్ ప్రయోగం... ఏంటి వాటి ప్రత్యేకత?
Corona Vaccine : ఆ 30 ఆడ కోతులపై పుణెలో కరోనా వ్యాక్సిన్ ప్రయోగం... ఏంటి వాటి ప్రత్యేకత? (File)
  • Share this:
Corona Lockdown | Corona Update : ఇండియాలో జోరుగా, నెమ్మదిగా మొత్తం 11 కరోనా వ్యాక్సిన్లు తయారవుతున్నాయి. భారత్‌కి చెందిన భారత వైద్య పరిశోధనా మండలి - ICMR... ఈ వ్యాక్సిన్ల తయారీ అంశంపై ఎక్కువగా దృష్టి పెట్టింది. ICMRకి చెందిన... మహారాష్ట్ర.... పుణెలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (NIV)లో... 30 కోతులపై వ్యాక్సిన్ ప్రయోగాలు జరిపేందుకు అనుమతులు లభించాయి. ఆ కోతులన్నీ ఆడవే. పుణెలో వడ్గావ్ (Vadgaon) ఫారెస్ట్ రేంజ్‌లో హాయిగా తిరుగుతున్న కోతులు అవి. పరిశోధకుల కన్ను వాటిపై పడింది. వెంటనే తమ దగ్గరున్న మంకీ క్యాచింగ్ టీమ్‌కి మేటర్ చెప్పింది. వాళ్లు వెళ్లి.... కోతుల్ని పట్టుకొట్టారు. ఇందుకు ఫారెస్ట్ అధికారులు సాయం చేశారు.

ఈ వైరాలజీ విభాగంలో కోతుల్ని పట్టుకోవడానికి ప్రత్యేక ట్రైనింగ్ టీమ్ ఉంది. తరచూ మందుల ప్రయోగాలు జరుపుతూనే ఉంటారు కదా. అందువల్ల ఈ టీమ్ రెగ్యులర్‌గా కోతుల్ని ఇతరత్రా అవసరమైన ప్రాణుల్ని పట్టుకొని తెస్తూ ఉంటుంది. తాజాగా 30 ఆడ కోతుల్ని వెతికి వెతికి వాటి వెంట పరుగులు పెట్టి మరీ పట్టుకుంది. అన్నీ 3, 4 ఏళ్ల వయసు ఉన్నవే. అన్నీ అడవుల్లో మంచి ఆహారం తింటూ బలిష్టంగా ఉన్నాయి. అందువల్ల వాటిపై ప్రయోగాలు చేస్తే... ఫలితంగా కచ్చితత్వంతో వస్తాయని అనుకుంటున్నారు.

కోతుల్ని బంధించినా... వాటికి ఎలాంటి హానీ చెయ్యబోమని హామీ ఇచ్చింది NIV. అందుకే అటవీ శాఖ అనుమతి ఇచ్చింది. ఇక వాటికి బాగా ఫుడ్డు పెట్టి... చక్కగా చూసుకుంటూ... వ్యాక్సిన్ ప్రయోగాలు చేస్తూ... సక్సెస్సా కాదా అన్నది తెలుసుకుంటారు. వచ్చే 3 నెలల్లో ఇదంతా జరగనుంది.

కోతులకూ మనుషులకూ దాదాపు ఒకే రకమైన జీన్స్ ఉంటాయి. అందువల్ల వ్యాక్సిన్ల తయారీలో మనుషులపై ప్రయోగించే ముందు కోతులు, చుంచెలుకలు వంటివాటిపై ప్రయోగిస్తారు. వాటిపై వ్యాక్సిన్ సక్సెస్ అయితే... మనుషులపైనా సక్సెస్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉంటున్నాయి. ఐతే... ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ల తయారీలో చాలా ఫార్మా కంపెనీలు.... జంతువులపై కాకుండా డైరెక్టుగా మనుషులపైనే ప్రయోగాలు చేస్తున్నాయి. జంతువులపై ప్రయోగాలు చేయాలంటే... కొన్నేళ్లు పడుతుంది. అలా కాకుండా వేగంగా ప్రయోగాలు చేయడం కోసం డైరెక్టుగా మనుషులపైనే చేస్తున్నారు.
First published: June 3, 2020, 1:42 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading