దేశంలో కరోనా విశ్వరూపం... 2 లక్షలవైపు కేసుల పరుగులు...

Corona Lockdown | Corona Update : ఇండియాలో కరోనా అత్యంత తీవ్రంగా వ్యాపిస్తోంది. కారణమేంటి? ఎక్కడ తేడా వస్తోంది?

news18-telugu
Updated: June 1, 2020, 9:34 AM IST
దేశంలో కరోనా విశ్వరూపం... 2 లక్షలవైపు కేసుల పరుగులు...
దేశంలో కరోనా విశ్వరూపం... (credit - NIAID)
  • Share this:
Corona Lockdown | Corona Update : దేశంలో కొత్తగా మరో 8392 కరోనా పాజిటివ్ కేసులు రావడంతో... మొత్తం కేసుల సంఖ్య 190535కి చేరింది. అలాగే... నిన్న ఒక్క రోజే... 230 మంది చనిపోయారు. ఈమధ్య కాలంలో ఇంత ఎక్కువ మంది చనిపోయింది నిన్నే. మొత్తం మరణాల సంఖ్య 5394కి చేరింది. ఇండియాలో కరోనా ఇంత వేగంగా విస్తరిస్తుందని మొదట్లో ఎవరూ ఊహించి ఉండరు. ఇప్పుడు మాత్రం రోజురోజుకూ సంఖ్య పెరిగిపోతోంది. నిన్న 4835 మంది మాత్రమే రికవరీ అయ్యారు. మొత్తం రికవరీ కేసులు 91818గా ఉన్నాయి. అదే సమయంలో... యాక్టివ్ కేసులు 93322గా ఉన్నాయి. అంటే... రికవరీ కేసుల సంఖ్య యాక్టివ్ కేసులే ఎక్కువగా ఉంటున్నాయి. ఇది ప్రమాదకర సంకేతం.

ప్రపంచంలో ఎక్కువ కేసులున్న దేశాల్లో భారత్ 7వ స్థానంలో ఉంది. రోజువారీ ఎక్కువ కేసులు నమోదవుతున్న దేశాల్లో నాలుగో స్థానంలో ఉంది. ఎక్కువ మరణాలు ఉన్న దేశాల్లో 13వ స్థానంలో ఉంది. ఇలా ఏ రకంగా చూసినా ఇండియా పరిస్థితి బాలేదు. ఆర్థికంగా కూడా ఇండియా చాలా నష్టపోయింది.

దేశ ప్రజలందరికీ కరోనా ఎలా సోకుతుందో తెలుసు. అయినప్పటికీ... ఎందుకు బ్రేక్ పడట్లేదు అన్నది తేలాల్సిన ప్రశ్న. అందరూ మాస్కులు పెట్టుకుంటే, అందరూ జాగ్రత్తలు పాటిస్తే... కరోనా కొత్తగా సోకే అవకాశమే ఉండదు. అయినా సోకుతోదంటే... దానర్థం కొంత మంది జాగ్రత్తలు పాటించట్లేదనే. ఇవాళ ఎవరికో వచ్చే కరోనా... రేపు మన వీధిలో ఇంకెవరికో రావచ్చు. అందుకే మనం దీన్ని నిర్లక్ష్యం చెయ్యకూడదని కోరుతున్నారు ఆరోగ్య నిపుణులు.

దేశంలో కరోనా కేసుల వివరాలు
First published: June 1, 2020, 9:34 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading