5 నెలల్లో 10 రూపాల్లోకి మారిన కరోనా వైరస్... సైంటిఫిక్ స్టడీ...

Corona Lockdown | Corona Update : కరోనా వైరస్ 10 రూపాల్లోకి మారిన విషయం తెలిసింది. చిత్రమేంటంటే... వాటిలో ఒక్క రూపమే ఎక్కువ డేంజర్ అవుతోంది.

news18-telugu
Updated: April 28, 2020, 9:19 AM IST
5 నెలల్లో 10 రూపాల్లోకి మారిన కరోనా వైరస్... సైంటిఫిక్ స్టడీ...
ప్రతీకాత్మక చిత్రం (credit - NIAID)
  • Share this:
Corona Lockdown | Corona Update : వైరస్ అనేది చాలా చిన్నగా ఉంటుంది. ఓ నీటి చుక్కలో... లక్షకు పైగా పట్టగలవు. అంత చిన్నగా ఉంటుంది కాబట్టే... వైరస్‌లో వాతావరణానికి తగ్గట్టుగా మార్పులు వచ్చేస్తూ ఉంటాయి. దీన్నే రూపాంతరం (Mutation) అంటారు. ఇక్కడ రూపం మారడం అంటే... మొత్తం స్వరూపం మారిపోదు. వైరస్ లోపల చిన్న చిన్న మార్పులు వస్తాయి. అంటే... కరోనా వైరస్ బంతిలా ఉంటూ... చుట్టూ ముళ్లలాంటి కొవ్వు పదార్థం ఉంది కదా. ఈ వైరస్ ఎప్పటికీ బంతిలాగే ఉంటుంది. ఆ ముళ్లు కూడా అలాగే ఉంటాయి. కాకపోతే... ఆ ముళ్ల ఆకారంలో మార్పులు రావచ్చు. దాని కలర్ మారొచ్చు. దాని పొట్టలో మార్పులు రావచ్చు. ఇవన్నీ రూపాంతరాల కిందకు వస్తాయి. ఓవరాల్‌గా వైరస్ ఆకారం మాత్రం అలాగే ఉంటుంది. ఇప్పుడు మనం సైంటిఫిక్ స్టడీని తెలుసుకుందాం.

2019 డిసెంబర్‌లో చైనాలో పుట్టిన కరోనా వైరస్... ఇప్పటివరకూ 10 రకాలుగా రూపాంతరం చెందింది. వాటిలో A2a అనే రకం ప్రపంచంలో ఎక్కువగా పాకుతోంది. ఒక్కమాటలో చెప్పాలంటే... మిగతా రూపాల్లోని కరోనా వైరస్‌లను పక్కకు నెట్టి... ఈ A2a అనేదే అంతటా ఎక్కువగా వ్యాపిస్తోంది. అన్ని దేశాల్లో అదే విస్తరిస్తోందట. బెంగాల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బయోమెడికల్ జెనోమిక్స్‌లో... నిధాన్ బిస్వాస్, పార్థ మజుందార్... ఈ స్టడీ నిర్వహించారు. దీని వివరాల్ని త్వరలో ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్‌లో ప్రచురించబోతున్నారు. ఈ జర్నల్‌ను ICMR పబ్లిష్ చేస్తోంది.

మనుషుల ఊపిరి తిత్తుల్లోకి ఎక్కువగా వెళ్తున్నది ఈ A2a రకం వైరస్సే. పదేళ్ల కిందట ఇదే జాతికి చెందిన సార్స్ వైరస్ కూడా ఇలాగే ఊపిరి తిత్తుల్లోకి వెళ్లింది. కానీ... ఆ వైరస్ కంటే... ఈ వైరస్ చాలా దూకుడుగా వెళ్తోంది. ఆ సార్స్ వైరస్ నుంచే ఈ కరోనా వైరస్ పుట్టిందనే వాదన కూడా ఉంది.

నాలుగు నెలల కిందట... O అనే రకం కరోనా వైరస్ ప్రారంభంలో ఉంది. ఆ తర్వాత ఆ వైరస్‌లో చిన్నా చితకా చాలా మార్పులు వచ్చాయి. అలా మారిన రకం వైరస్‌లు చాలా దేశాల్లో కనిపించాయి. ప్రస్తుతం మాత్రం మిగతా వైరస్‌లు దాదాపు కనిపించట్లేదు. అంతటా A2a అనే రకమే కనిపిస్తోందట. మార్చి ఆఖరులో ఇది ఎంటరైందనీ... జస్ట్ నెల రోజుల్లో ఇది మొత్తం ప్రపంచమంతా విస్తరించిందని సైంటిస్టులు చెబుతున్నారు.

మొత్తం 55 దేశాల నుంచి... 3600 కరోనా వైరస్‌ల RNAను సేకరించారు. 2019 డిసెంబర్ నుంచి ఏప్రిల్ 6 వరకూ ఈ సేకరణ జరిగింది. ఆ తర్వాత కరోనా వైరస్‌ను O, A2, A2a, A3, B, B1 ఇలా రూపాలను బట్టీ విభజిస్తూ వెళ్లారు. మొదట చైనాలోని వుహాన్‌లో వచ్చిన O రకాన్ని కూడా కలిపితే... మొత్తం 11 రకాలు కింద లెక్క.

ఇలా రూపాంతరం చెందినప్పుడు కొన్ని రకాల వైరస్‌లు మరింత మందికి లేదా మరిన్ని ప్రాణులకు వ్యాపించలేక... ఆగిపోతాయి. మరికొన్ని రకాల వైరస్‌లు మాత్రం రూపాంతరం చెందేకొద్దీ మరింత ఉత్సాహంగా వ్యాపిస్తాయి. కరోనా రెండో రకం అనుకోవచ్చు.

A2a వైరస్‌లో వచ్చిన రూపాంతరం ఏంటంటే... పైన మనం చెప్పుకున్న బంతిపై ఉండే... ముళ్లలాంటి కొవ్వు పదార్థంలో మార్పులొచ్చాయి. దీని వల్ల ఆ రకం వైరస్... మనుషుల ఊపిరి తిత్తుల్లోకి వెళ్లి... అక్కడి మాంస కణాలకు ఈజీగా అతుక్కోగలుగుతోంది. ఆ తర్వాత వైరస్ సంఖ్య విపరీతంగా పెరుగుతోందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ కారణంగానే A2a టైపు కరోనా వైరస్... ఈజీగా ప్రపంచమంతా పాకేసిందని చెబుతున్నారు.ఇండియాలో కరోనా సోకిన వారిలో దాదాపు 47.5 శాతం ఈ A2a రకమే ఉందంటున్నారు. ఇప్పుడు ప్రపంచంలోని శాస్త్రవేత్తలంతా... ఈ A2a రకం వైరస్‌ను చంపే వ్యాక్సిన్ తయారుచెయ్యాల్సిన పరిస్థితి ఏర్పడింది.
First published: April 28, 2020, 9:19 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading