కరెన్సీ నోట్లు, ఫేస్ మాస్కులపై కరోనా వైరస్ ఎన్ని రోజులు ఉంటుందో తెలుసా?

Corona Lockdown | Coronaupdate : అసలే కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. దానికి తోడు ఈ కొత్త కొత్త పరిశోధనలు మరింత టెన్షన్ పెడుతున్నాయి. అదే సమయంలో మనల్ని అలర్ట్ కూడా చేస్తున్నాయి.

news18-telugu
Updated: April 15, 2020, 11:10 AM IST
కరెన్సీ నోట్లు, ఫేస్ మాస్కులపై కరోనా వైరస్ ఎన్ని రోజులు ఉంటుందో తెలుసా?
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
Corona Lockdown | Coronaupdate : భారత్‌లో ఎంత మంది మాస్కులు వాడుతున్నారు? ఎంత మంది నాణ్యమైన మాస్కులు వాడుతున్నారు? ఎంత మంది వాటిని మళ్లీ మళ్లీ వాడుతున్నారు? ఎంత మంది వాటిని బయటి వైపు ముట్టుకుంటున్నారు (అలా ముట్టుకుంటే వైరస్ వ్యాపిస్తుంది), ఎంత మంది ఒకే మాస్కును రోజుల తరబడి వాడుతున్నారు? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు ఆశ్చర్యంగా ఉంటాయి. అవి పక్కన పెడితే... ఇప్పుడో కొత్త సర్వే చేశారు. దాన్లో ఏం తేలిందంటే... మాస్కులపై కరోనా వైరస్ 7 రోజులు బతికే ఉంటుందట. అలాగే.... కరెన్సీ నోట్లు, స్టెయిన్‌లెస్ స్టీల్, ప్లాస్టిక్ వస్తువులు, ప్రదేశాలపై కరోనా వైరస్ రోజుల తరబడి బతికే ఉంటుందని పరిశోధన చెబుతోంది. హాంకాంగ్ యూనివర్శిటీ పరిశోధకులు... ఈ రీసెర్చ్ చేశారు. మనం కంగారుపడకుండా ఉండేందుకు మరో విషయం చెప్పారు. ఈ వైరస్... మన ఇళ్లలో అంట్లు తోమే పౌడర్లు, సబ్బులు, బ్లీచ్, సోప్ వాటర్ వంటివాటితో చచ్చిపోతుందని కూడా చెప్పారు. లాన్సెట్ జర్నల్‌లో ఈ పరిశోధన వివరాల్ని రాశారు.

ప్రింటింగ్ పేపర్లు, టిష్యూ పేపర్లపై మూడు గంటలకు పైగా ఈ వైరస్ ఉంటుందట. కలప, బట్టలపై రెండు రోజులు బతికి ఉంటుందట. ముఖ్యంగా మాస్కుల బయటివైపు 7 రోజులు వైరస్ జీవించి ఉంటుందని చెప్పడం ఇప్పుడు అందర్నీ ఆలోచనలో పడేస్తోంది. అందుకే మాస్క్ తొడుకున్నాక... దాని బయటివైపు అస్సలు ముట్టుకోవద్దని ప్రపంచవ్యాప్తంగా డాక్టర్లు, పరిశోధకులు, నిపుణులు, మీడియా పదే పదే చెబుతోంది. ఎందుకంటే పొరపాటున మాస్క్ బయటివైపు ముట్టుకుంటే... దానిపై ఉండే కరోనా వైరస్ చేతులకు అతుక్కుంటుంది. అక్కడి నుంచి మనం ఏ కళ్లనో తాకితే చాలు... కళ్లలోంచీ... రూట్ వెతుక్కొని... బాడీలోకి వెళ్తుంది.

ఈ పరిశోధనను రోడ్లపైనా, రియల్ ప్రపంచంలో చెయ్యలేదు. ల్యాబ్‌లో చేసి చూశారు. అందువల్ల బయట కూడా ఇలాగే జరుగుతుందా అన్నదానిపై గ్యారెంటీ లేదంటున్నారు. ఐతే... మార్చిలో జరిపిన ఓ సర్వేలో కూడా... దాదాపు ఇలాంటి ఫలితాలే వచ్చాయి. అమెరికా పరిశోధకుల రీసెర్చ్‌లో ఈ వైరస్... ప్లాస్టిక్, స్టీల్ వస్తువులపై 72 గంటలు బతికి ఉంటుందని తెలిసింది. ఐతే... కాపర్ వస్తువులపై 4 గంటలు, కార్డ్‌బోర్డ్‌పై 24 గంటలు మాత్రమే బతికి ఉంటుందని చెప్పింది.

వేర్వేరు పరిశోధనల్లో వచ్చిన ఫలితాల్ని బట్టీ వైరస్ వేటిపై ఎంత కాలం ఉంటుందంటే...


ఐటెం వైరస్ జీవించే కాలం
మాస్కులు (బయటివైపు) 7 రోజులు
కరెన్సీ నోట్లు 4 రోజులు
ప్లాస్టిక్ వస్తువులు 3 రోజులు
బట్టలు 2 రోజులు
కలప 2 రోజులు
కార్డ్ బోర్డ్ 24 గంటలు
ప్రదేశాలు 12 గంటలు
కాపర్ (రాగి) 4 గంటలు
టిష్యూ పేపర్లు 3 గంటలు
ప్రింటింగ్ పేపర్లు 3 గంటలు

 
First published: April 15, 2020, 11:08 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading