భారతే కరోనా వ్యాక్సిన్ చెయ్యాలంటున్న ప్రపంచ దేశాలు... ఎందుకు?

Corona Lockdown | Corona Update : ప్రపంచంలోని చాలా వ్యాధులకు వ్యాక్సిన్లు తయారుచేసింది భారతే. కరోనా విషయంలోనూ అదే జరుగుతుందా?

news18-telugu
Updated: April 27, 2020, 7:22 AM IST
భారతే కరోనా వ్యాక్సిన్ చెయ్యాలంటున్న ప్రపంచ దేశాలు... ఎందుకు?
మరోవైపు చైనాలో మరోసారి కరోనా వ్యాపిస్తుందన్న భయంతో మే 15 నుంచి 25 మధ్య 65 లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించింది.
  • Share this:
Corona Lockdown | Corona Update : కరోనా వైరస్‌కి విరుగుడు కోసం... ప్రపంచవ్యాప్తంగా దాదాపు 80 వ్యాక్సిన్ల ట్రయల్స్ జోరుగా సాగుతున్నాయి. కొన్ని దేశాల్లో కొన్ని ఫార్మా కంపెనీలు... జంతువులపై మానేసి... డైరెక్టుగా మనుషులపైనే ప్రయోగాలు చేస్తున్నాయి కూడా. ఐతే... ప్రపంచంలో చాలా దేశాలు... కరోనా వ్యాక్సిన్‌ను ఇండియా తయారుచెయ్యాలని పట్టుపడుతున్నాయి. అందుకు తగ్గట్టుగానే దాదాపు ఆరు దేశీయ కంపెనీలు వ్యాక్సిన్ తయారీలో తలమునకలయ్యాయి. కాకపోతే... ప్రపంచ దేశాలతో పోల్చితే... ఈ ట్రయల్స్ ఇండియాలో కాస్త ఆలస్యంగా ప్రారంభమయ్యాయి.

అమెరికా, భారత్ కలిసి... కరోనా వ్యాక్సిన్ తయారు చేసే పనిలో ఉన్నాయని గత వారం అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో తెలిపారు. ఇందులో వింతేమీ లేదు. మూడు దశాబ్దాలుగా వ్యాక్సిన్ల తయారీలో ఈ రెండు దేశాలూ కలిసి పనిచేస్తున్నాయి. ఇదివరకు డెంగ్యూ, ఎంటెరిక్ (Enteric) వ్యాధి, ఇన్‌ఫ్లూయెంజా, టీబీలకు కలిసి వ్యాక్సిన్ల తయారీ కార్యక్రమంలో పాలుపంచుకున్నాయి. డెంగ్యూ వ్యాక్సిన్‌కి భవిష్యత్తులో ట్రయల్స్ చేపట్టబోతున్నాయి.

జెనెరిక్ మందులు, వ్యాక్సిన్ల తయారీకి ప్రపంచంలో భారతే అతి పెద్ద కేంద్రం. ప్రపంచంలో వ్యాక్సిన్లు తయారుచేసే పెద్ద కంపెనీల్లో ఆరు దాకా ఇండియాలోనే ఉన్నాయి. చిన్న కంపెనీలకు లెక్కే లేదు. పోలియో, మెనిన్‌జైటిస్, నిమోనియా, రొటా వైరస్, BCG, మీజిల్స్ (measles), మంప్స్, రుబెల్లా వంటి వ్యాధులకు వ్యాక్సిన్ డోస్‌లు తయారైంది ఇండియాలోనే. ఈ ట్రాక్ రికార్డ్ కారణంగానే... కరోనాకి కూడా భారతే వ్యాక్సిన్ తయారుచెయ్యాలని ప్రపంచ దేశాలు కోరుతున్నాయి.

ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ తయారీలో ఉన్న ఇండియాలోని సెరమ్ ఇన్‌స్టిట్యూట్... ప్రపంచంలో అతి పెద్ద వ్యాక్సిన్ తయారీ సంస్థ. 53 ఏళ్ల ఈ కంపెనీ... ఏటా 150 కోట్ల డోసుల వ్యాక్సిన్లు తయారుచేస్తోంది. 7వేల మంది దాకా ఇందులో పనిచేస్తున్నారు. ఏటా 165 దేశాలకు 20 రకాల వ్యాక్సిన్లు సప్లై చేస్తోంది. ఒక్కో డోస్ రేటు జస్ట్ 50 సెంట్లే (దాదాపు రూ.35) ప్రపంచంలో ఇంత తక్కువ రేటుకు వ్యాక్సిన్ మరెక్కడా తయారవ్వట్లేదు. ఇప్పుడు ఈ కంపెనీ... అమెరికాలోని కొడాజెనిక్స్ (Codagenix)తో కలిసి... కరోనా వ్యాక్సిన్ తయారీ చేపడుతోంది. ప్రస్తుతం ప్రాణులపై ట్రయల్స్ చేస్తోంది. సెప్టెంబర్‌లో మనుషులపై చేయనుంది.

మిస్టర్ పూనావాల్లా, హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్ కంపెనీలు కూడా.. యూరప్, అమెరికా దేశాలతో టై-అప్ అయి వ్యాక్సిన్లు తయారుచేస్తున్నాయి. అలాగే జైడస్ కాడిల్లా, బయోలాజికల్ E, ఇండియన్ ఇమ్యునోలాజికల్స్, మిన్వాక్స్ కంపెనీలు కూడా వ్యాక్సిన్ల తయారీలో ఉన్నాయి. మరో నాలుగైదు కంపెనీలు కూడా స్టార్టింగ్ స్టేజ్‌లోకి చేరాయి.

మొత్తంగా ఓ ఏడాది నుంచి 15 నెలల్లో కరోనా వైరస్‌కి సరైన వ్యాక్సిన్ తయారై... ప్రపంచ దేశాలకు చేరవచ్చనే అంచనాలు ఉన్నాయి. ఆ వ్యాక్సిన్ ఇండియాలోనే తయారైతే... ప్రపంచ దేశాలు... భారత్‌కు ఎప్పటికీ రుణపడి ఉంటాయి అనుకోవచ్చు.
Published by: Krishna Kumar N
First published: April 27, 2020, 7:22 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading